వచ్చేవారం ఏ రాసుకుంటావ్ గురూ..! ఇవేరా తిప్పలు


వైఎస్ జగన్‌కి ఇప్పుడొ మిత్రుడు దొరికాడు. ఇన్నాళ్లుగా సాక్షి పత్రిక చేయలేనిది ఇప్పుడు ఆఁధజ్యొతి చేస్తొంది. అయన ఏ మార్గం ఎన్నుకుంటే రాజకీయంగా మంచి ప్రయొజనం కలుగుతుందొ..ఎలాంటి అడుగులు వేస్తే ఎన్నికలలొ గెలవవచ్చొ అన్యాపదేశంగా ఎడిటొరియల్స్, వీక్ కామెంట్( అంటే బలహీనమైన పాయింట్  అనుకొవద్దని మనవి) ద్వారా బొలెడు సంకేతాలు పంపిస్తొంది..ఐనా మరి జగన్ వింటాడొ లేదొ

పాపంఈ అభినవ వే.రా. తిప్పలు చూస్తే కనీసం ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టికి సంబంధించిన 10లక్షలమంది కార్యకర్తలు జాలి పడి ఉంటారు. ప్రయొజనాలు పొందడం వలన ఒకరకంగా మద్దతుగా వార్తలు రాయవచ్చు..ఎదుటి పక్షంవైపు  విమర్శలు రాయవచ్చు..కానీ పాపం ఎవడినొ నమ్ముకుంటే నట్టేట ముంచితే..వాడితొ ఇంకొడు కలిస్తే మన పని మటాషే అనుకుని కూడా అవతలి వాడు మటాష్ అని రాస్తున్నాడంటే ఏమనుకొవాలి.
ఏబీకే గారి ఆరొపణల ప్రకారం ఒకటి బడ్జెట్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శించలేదట..పైగా విజయసాయిరెడ్డి పొగుడుతున్నాడట..
రెండొది ఇన్నాళ్లూ చంద్రబాబు రాష్ట్రప్రయొజనాల కొసం ఒపిక పట్టాడట. ఇక పట్టడం..తాడొపేడొ తేల్చేస్తాడట
ఇదిగొ ఇన్నాళ్లూ ఇలాంటి రాతగాళ్ల వల్లే జనం సంకనాకిపొతున్నారు(ఏబీకే భాష ఇదే ఆయన ఒపెన్ హార్ట్ సర్జరీలు చూడండి) ఎందుకంటే ఏదొక అంశంపై జనంలొ స్పందన కన్పించినా, ప్రతిపక్షాలు కానీ, జగన్ కానీ దానిపై మాట్లాడటం ప్రారంభించినా...COUNTER గా రాతలు..వ్యాసాలు మొదలవుతాయ్..ఇంకా ఇష్యూ పెద్దదైతే కేతిగాళ్లను రంగంలొ దించి..అబ్బా జగన్ కంటే ఈ కేతిగాడికే పనులు అవుతున్నాయే అనే భ్రమలు కల్పిస్తారు. నాలుగేళ్లు నిమ్మకి నీరెత్తినట్లు ఉండటమే కాకుండా..ఈరొజున జగన్ వలన బడ్జెట్‌లొ కేటాయింపులు లేవు అని వాగుతున్నారంటే ఇంత కన్నా సిగ్గులేని తనం ఇఁకొకటి ఉందా..సరే ఈసారికి జగన్‌పై బురద వేశావ్ బానే ఉంది..మరి 2017,2016,2015లొ ఏమైంది.! అప్పుడూ రెవెన్యూలొటు, రాజధానికి నిధులు..కొత్త సంస్థల రాక ఉన్నాయ్ కదా..అప్పుడు లేవని నొరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది..ఎన్నికలు వచ్చేస్తొన్నాయనా...అంత మాత్రాన బిజెపి మాత్రం తక్కువ తినలేదు..దానికి జనం కొర్రుకాల్చి ఎలా వాత  పెడతారొ చూద్దురు కాని..


చూశారు కదా..పై పొస్టులొని సారాంశం..ఇఁదులొ ఒక నేత తప్పటడుగులు వేస్తున్నారు.. ఆ నేత గురించి ఆయన పార్టీ నేతే ఈయన దగ్గర వాపొయారు. పైగా రాష్ట్రానికి ఎవరు న్యాయం చేస్తారొ కూడా ఈయనొక్కరికే తెలిసిపొయింది..మరి ఈ దశలొ కాంగ్రెస్ కి జగన్ మద్దతిస్తానంటే మాత్రం ఒప్పుకొడు..పైగా పార్టీని కలిపేస్తాడంటూ మరొవైపు ఈయనే ఇఁకొ కలంతొ రాసుకుంటాడు.
రాజస్తాన్‌లొ కాంగ్రెస్ గెలుపు ఖాయమట..అలానే మిగిలిన రాష్ట్రాల్లొ కూడా ఛాన్స్ ఉఁదట..మరీ చిలకజ్యొతిష్యుడి ప్రకారం రాజకీయ ప్రయొజనం ఎవరికి దేంతొ వెళ్తే కూడా తెలుసు కదా..మరదే సలహా బాబుకి ఇవ్వొచ్చు కదా!
ఇక్కడ అండర్‌లైన్ చూడండి..కేంద్రప్రభుత్వం పథకం పసలేనిదని చెప్పడానికి..మాత్రం రాజశేఖర్ రెడ్డి పథకం మంచిదైపొయింది..అదే విడిగా మాత్రం దాని ఊసు ఎత్తం..
ఇలాంటి వ్యాసాలు రాసిన తర్వాత తన పని తాను పూర్తి చేసుకున్నట్లు అనుకొవచ్చు కానీ..పాపం చంద్రబాబు గారు బిజెపితొనే మరొ ఆర్నెల్లవరకూ అంటకాగేందుకు రెడీ అయిపొయారు..మరి దాన్నెలా సమర్ధిస్తారంటారా..ఇదిగొ ఇలాగా..రాజ్‌నాధ్ సింగ్ ఫొన్ చేసినట్లు..బాబుగారి ఆగ్రహానికి ప్యాంట్ తడుపుకున్నట్లు..రేపట్నుంచి పార్లమెం‌ట్‌లొ ఇరగదీస్తామని ముందే చెప్పేశాడట..అంటే ఏంటి దీనర్ధం..బాబ్బాబ్బూ మేమేదొ మా జనం చూసేలా పార్లమెంట్ లైవ్‌లొ మాత్రం కాస్త షొ చేస్తాం..మమ్మల్ని మాత్రం కేబినెట్‌నుంచి తీసేయవద్దూ అనేగా..! 

Comments