శ్రీదేవిని చంపేశారా..చనిపోయిందా..ఇదీ ఇప్పటి అనుమానం


శ్రీదేవి మరణంపై అందరికన్నా ముందే అనుమానం వ్యక్తం చేసింది ఇదీ ప్రపంచం..అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఆ అనుమానానికి జీవం పోస్తున్నాయ్. ఫస్ట్ కార్డియాక్ అరెస్ట్ అన్నారు..కానీ ఇప్పుడు ఆమె బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోయిందని.. ఆ తర్వాత చనిపోయిందని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్తోంది. అందులో శ్రీదేవి రక్తం నమూనాల్లో ఆల్కహాల్ ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఇక అనుమానాలు బోనీ కపూర్ వైపే మళ్లుతాయ్. ఎందుకంటే ఆ సమయంలో ఉంది అతనే కాబట్టి..ఆయనే ముందుగా శవాన్ని(లేదంటే ప్రాణంతో ఉన్న శ్రీదేవి శరీరాన్ని) చూశాడు కాబట్టి.. ముందుగా ఈ అనుమానాలను ఒక వరసలో పేర్చుకుంటూ వద్దాం
1. పెళ్లి దుబాయ్ లో అన్నారు..అది జరిగిన మూడు రోజుల వరకూ ఉన్నారు..వెంటనే ఎందుకు తిరిగి రాలేదు..ఇదో అసంబద్ద అనుమానం..ఎవడి ఇష్టం వాడిది..సెలబ్రెటీలూ కూడా మనలానే పెళ్లి అయీ..అయిపోగానే పెట్టాబేడా సర్దుకుని రావాల్సిన అవసరం లేదు. అందులోనూ షాపింగ్ కి ప్రసిధ్దిగాంచిన దుబాయ్ లాంటి ప్రదేశాలకు వెళ్తే వెంటనే ఎందుకు తిరిగి వస్తారు
2. ముందు గుండెపోటుతో చనిపోయిందనే వార్తని ఎవరు స్ప్రెడ్ చేశారు..వాళ్ల మోటో ఏంటి..జనరల్ గా ఎవరైనా ఉన్నట్టుండి చనిపోతే గుండెపోటుతోనే అని నిర్ధారించడం బాగా ప్యాషన్ అయిపోయింది. ఇదీ జవాబు లేదంటే కావాలనే విషయాన్ని పక్కదారి పట్టించడానికి చేసుండొచ్చు లేదంటే ఇప్పుడు చెప్తోన్న నీటిలో మునిగి చనిపోవడాన్ని..నీరు ఎక్కువగా మింగడంతో గుండె ఆగిపోయిందనే భ్రమని కల్పించి ఉండవచ్చు
3. బోనీకపూర్ ఆ సమయంలో అక్కడే లేరు..ఆ రోజే తిరిగి దుబాయ్ వెళ్లాడు..ఎందుకిలా...ఇదో శుద్ద దండగమారి ప్రశ్న..మూడు గంటల జర్నీ సమయం ఉన్న చోట డబ్బున్న జనం ఇలా రెండు రోజులకోసారి వెళ్లడం పెద్ద విషయం కాదు( బోనీకపూర్ నిర్దోషి అయిన పక్షంలో ఈ జవాబు సరిపోతుంది) పైగా తన వైఫ్‌కి సర్‌ప్రైజ్ పార్టీ ఇద్దామనుకున్నాడు కాబట్టి..అంటున్నారు కాబట్టి ఇది సమర్ధనీయంగానే ఉంది. 
4. అయితే హోటల్ జుమెరా టవర్స్‌లో శ్రీదేవి ఎన్నిగంటలకు బైటికి తీసుకొచ్చారనేది ఇప్పుడు మిస్టరీని( ఒక వేళ ఉఁటే) బైటపెట్టే అంశం. ఎందుకంటే చనిపోయిన వెంటనే తీసుకువచ్చి ఉంటే..ఆ సమయంలో ఆమె స్థితి ఏంటి..ఎవరెవరు ఆమె పక్కన ఉన్నారు. ఉంటే బోనీకపూర్ స్థితి ఏంటి..
5..శ్రీదేవితో చివరి సమయంలో సన్నిహితంగా బోనీకపూర్ మాత్రమే ఉంటే..మరణ సమయంలో ఆయన వైఖరిని తెలుసుకోవాల్సిందే..ఐతే ఇదంతా ఆయన దోషి  అనే కోణంలో ఆలోచిస్తేనే..లేకపోతే.. ఒక వ్యక్తి బాత్ టబ్‌లో మునిగిపోవడం..ఆ తర్వాత గుర్తించడం సాధారణంగా చోటు చేసుకునే విషాదాలే. ఐతే ఈ సందర్భంగా టివీ ఛానళ్ల అసంబద్ద ప్రశ్నలు చూసే ఈ శల్యశోధన చేయాల్సి వస్తుంది. ఓ ఛానల్ అంటుంది..బాత్ టబ్‌లో పడితే బైట ఉన్న బోనీకపూర్ కి తెలియదా అని..అసలు రెస్ట్‌రూమ్‌లో సౌండ్ ఫ్రూఫ్ ఉంటే పెద్ద పెద్ద కేకలు పెట్టినా కూడా బైటికి విన్పించవ్. ఈ డిటెక్టివ్ ప్రశ్నలు అడిగేవారికి ఆ విషయాలు కూడా గుర్తు చేసుకోవాలి. వీటి కంటే కూడా శ్రీదేవి తనంతట తాను చనిపోయిందా,....లేక బోనీకపూర్ చంపేశాడా అని డైరక్ట్ గా అడిగితే వెంటనే సమాధానాలు వెతుక్కోవడం సులభం అవుతుంది. నిజం ఏంటనేది పోలీసుల విచారణలో ఖచ్చితంగా తెలిసిపోతుంది. చదువరులు ఈ స్టోరీ పూర్తిగా చదివే సమయానికి ఆ కార్యం కూడా పూర్తవుతుందనే అనుకుందాం

Comments