ఈ సినిమానే రాజమౌళి బాహుబలిగా తీశాడా


రాజమౌళి ప్రతి సినిమా ఏదో ఒక దాన్నుంచి కాపీ కొట్టాడనే విమర్శలు వస్తూనే ఉంటాయ్. కొన్ని సీన్లు
అయితే అలానే ఎత్తిపెట్టిన సందర్భాలు కూడా మనొళ్లు చూపిస్తుంటారు. ఐతే ప్రపంచవ్యాప్తంగా
విడుదలైన బాహుబలి విషయంలోనూ ఇలానే కామెంట్లు విన్పించాయ్. రాజ్ కుమార్ హీరోగా నటించిన ఓ పాత కన్నడ సినిమాని ఒకదాన్ని కాపీకొట్టాడని కొందరు పోస్టులు పెట్టారు కూడా..

 ఎంజి రామచంద్రన్, జయలలిత నటించిన అదిమై పెణ్ సినిమాని ఉత్ప్పేరకంగా తీసుకుని అటు ఘవేంద్రరావ్..ఇటు రాజమౌళి సినిమాలు తీశారని ఈ మధ్య ప్రచారం మొదలైంది. ఈ అదిమైపెణ్ సినిమా కథాంశం టార్జాన్ థీమ్‌ని ఫాలో అవుతుంది. 1969లో వచ్చిందీ సినిమా. అప్పట్లోనే బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది 60లక్షల రూపాయలు కలెక్ట్ చేసిన ఈ సినిమాలో జయలలిత డ్యూయెల్ రోల్ చేయగా..జ్యోతిలక్ష్మి, చో రామస్వామి,రాజశ్రీ, పండరీబాయి ఇతర నటీనటులు. ఇందులో పెద్ద ప్రభాస్ ని వెన్నుపొటు పొడిచినట్లే ఎంజిఆర్ చనిపోతాడు. చిన్న ఎఁజిఆర్ టార్జాన్‌లా మారిపోగా, జయలలిత అతన్ని మార్చుతుంది. అలా యువ ఎంజిఆర్ తల్లి జయలలితను కాపాడుకోవడానికి
చేసిన ప్రయత్నమే ఈ సినిమా సినిమా మొత్తంలో చాలా సీన్లను రాఘవేంద్రరావ్ అడవిదొంగలో రాజమౌళి బాహుబలిలో వాడుకున్నాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. చివరకు కట్టప్ప క్యారెక్టర్ కి ఒరిజినల్ కూడా మారప్ప అనే క్యారెక్టర్ ఉండటం విశేషం.

కథలు కొత్తగా పుట్టుకురావ్ ఉన్నవాటినే అటూ ఇటూ తిప్పి కొత్తగా చెప్పడమే సినిమా వాళ్లు చేస్తుంటారంటారు. మరి దాదాపు 50 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ బాహుబలికి అడిమైపెన్ మాతృక అనడంలో తప్పేం లేదేమో

Comments