నరబలి కాదు మానవత్వం బలి


మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా..వారిని తెలిసినవాళ్లే కదా అని పక్కింటికి పంపడం..బంధువులే కదా అని కలిసి బజారుకు పంపడం చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి..ఎందుకంటే మనుషుల్లో మానవత్వం లేదు. అదెప్పుడో చచ్చిపోయింది..లేకపోతే చంద్రగ్రహణం ఏంటి..దానికి నరబలి ఇస్తే ఆరోగ్యం బాగుపడటం ఏంటి..అసలు ఓ జీవిని చంపాలంటే ఎంతో కష్టం అలాంటిది ఓ శిశువును తల నరికి చంపడం అంటే ఎంత దుర్మార్గం..
మాటల్లో ఇలాంటి ఘోరాన్ని వర్ణించడం సాధ్యమయ్యే పని కాదు..ఎవడో గొట్టంగాడు చెప్పాడని పాపను నరికి చంపానని సదరు ఆటో డ్రైవర్ రాజశేఖర్ చెప్పడం మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అర్ధం అవుతుంది. పక్కన మెసిలే ప్రతి మనిషినీ ఇప్పుడు అనుమానంతో చూస్తేనే బతకగలం అన్పిస్తే అది వారి తప్పు కాదు. ఒక చిన్న పాప..నెలల పాప..బహుశా ఈ దుర్మార్గుడు తెచ్చుకున్నప్పుడు ఊహించి ఉఁడదు..తనని కిరాతకంగా చంపేస్తాడని..అతనితో  ఉన్న రోజులు కాస్తో కూస్తో ఆడించే ఉంటాడు..అప్పుడైనా ఈ దుర్మార్గుడికి మానవత్వం నిద్రలేవలేదా..వాడు చెప్పే కారణం ఏంటంటే వాడి పెళ్లానికి అనారోగ్యమట పాపని బలి ఇస్తే..చక్కబడుతుందట..ఎక్కడో అమ్మానాన్నల ఒడిలో పడుకున్న పాపను ఎత్తుకొచ్చానని నిస్సిగ్గుగా చెప్తున్నాడంటే..ఇతగాడికి బతికే హక్కు ఉందా..!
పైగా ఈ దారుణం చేసిన తర్వాత చక్కగా రక్తపు మరకలు శుభ్రం చేయడం ఇతగాడి రాక్షసత్వానికి నిదర్శనం.
ఇలాంటి సలహాలు ఇచ్చిన లంజాకొడుకులను ముందు కాళ్లూ చేతులూ , నాలిక నరికి సమాజంలో వదలాలి. అప్పుడే మనిషి ప్రాణం విలువ తెలుస్తుంది.. ఆ తర్వాత గ్రహణాలు..ముహూర్తాలు అంటూ బూటకపు ప్రచారాలు చేసే జ్యోతిష్యులను బట్టలూడదీసి కొట్టాలి. ఈ చీకటియుగపు మనుషులను ఎక్కడిక్కడ నాలికలపై వాతలు వేస్తే కానీ సమాజంలో అభద్రతా భావం పోదు. నీ ముహూర్తాలు నువ్ పెట్టుకొ..నీ నమ్మకాలు నీ దగ్గరే ఉఁచుకో
కేవలం నీవరకే ఫాలో అవ్వు..అంతేకానీ నీ సంతానానికి కూడా నూరిపోయకు అని సమాజం మొత్తం తిరస్కరించిన రోజే ఇలాంటి మూఢ నమ్మకాలకు తెరపడేది. అందుకే ఈ రోజు నుంచి మీ పిల్లలను ఇంకాస్త జాగ్రత్తగా చూసుకోండి..ఎందుకంటే..మీ పక్కనే ఇలాంటి రాక్షసులు నవ్వుముఖంతో తిరుగుతుండొచ్చు..ఆదమరిస్తే
చాలు మాయం చేయడానికి ఎదురు చూస్తుంటారు. మన అప్రమత్తతే మన పిల్లలపాలిట వరంగా మారాలి

Comments