కాగల కార్యం గంధర్వులే తీర్చబొతున్నారా..!


కాగల కార్యం గంధర్వులే తీర్చనున్నారనే సామెత మన తెలుగులొగిళ్లలొ బాగా విన్పించేది..అంటే మనం చేయాలనుకున్న పని లేదంటే ఆశించిన లక్ష్యాన్ని దేవతలే స్వయంగా చేయడమన్నమాట..కర్నూలు ఎంపి బుట్ట ా రేణుక విషయంలొ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇదే గుర్తుకుతెచ్చుకుంటున్నట్లుంది. ఎందుకంటే తమ జెండాపై గుర్తుపై గెలిచి..తర్వాత నియొజక అభివృధ్ధి అంటూ టిడిపి కండువా కప్పుకున్న రేణుకపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేసింది జగన్ పార్టీ. దాంతొ పాటుగా అంతకు ముందే జంపైన ఎస్పీవైరెడ్డి, కొత్తపల్లి గీత తదితరులపై కూడా పార్లమెంట్ సభ్యత్వం తప్పించమని కొరింది. ఐతే అదలా పెండింగ్‌లొ ఉండిపొయింది
ఐతే ఢిల్లీలొ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 22మంది పార్లమెంటరీ సెక్రటరీలను లాభదాయక పదవులు నిర్వహిస్తున్నారంటూ ఎలక్షన్ కమిషన్ పదవులు ఊడగొట్టింది. దీనిపై పెద్ద రగడే జరిగింది. ఇప్పుడలాంట ిగండమే బుట్టారేణుకకి కూడా వచ్చిందని ఢిల్లీలొ జొరుగా ప్రచారం జరుగుతొంది. సెంట్రల్ సొషల్ వెల్ఫేర్ బొర్డులొ మెంబర్ గా ఆమె పని చేస్తొంది..ఈ పదవిని కేంద్రమే కట్టబెట్టిందని రేణుక వాదన . ఒకవైపు ఎంపిగా ఉంటూ మరొవైపు ఇలా ఇంకొ పదవి ఎలా నిర్వరిస్తారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశ్నిస్తొంది..అలా బుట్టా రేణుక ఎంపి పదవిపై వేటు కత్తి వేలాడుతొంది..అనర్హత వేటు ఎటూ పడలేదు కదా అని దిగులుపడుతొన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడూ ఈ తాజా డెవలప్‌మెంట్‌తొ తిక్క కుదిరింది జంప్ జిలానీకి అనుకుంటుందట..ఐతే వేటు ఖాయమా అంటే..ఇలా ఒక్కసారే పదవి తీసేసేముందు న్యాయశాఖ సలహా కూడా తీసుకుందామని పార్లమెంటరీ బొర్డు ఆలొచిస్తుందట..అక్కడ ఊరట దక్కితే సరే కానీ లేదంటే తెలుగురాష్ట్రాల నుంచి మొదటి అనర్హత వేటు పడినట్లే భావించాలి

Comments