చిరంజీవిపై మోహన్ బాబు ఇన్‌డైరక్ట్ కామెంట్స్ ..ఎందుకీ వైరం


మోహన్ బాబు వయసు మీదపడుతున్నా తన డైలాగ్ డెలివరీలో ఎక్కడా తగ్గడంలేదు..రీసెంట్ గా రిలీజైన గాయత్రి ఫలితం ఎలా ఉన్నా మోహన్ బాబు స్వరంలోని సత్తా మరోసారి చాటి చెప్పింది. అందులోని డైలాగ్స్ ఏపీ మినిస్టర్స్ ని టార్గెట్ చేసుకుని వాడినవే అని ప్రచారం జరుగుతుండగా..ఇప్పుడు మరో బాంబ్ పేల్చారాయన
తెలుగు ఇండస్ట్రీలో కలెక్షన్స్ ...నంబర్ వన్ అంటూ జరుగుతున్న హంగామాపై తన కంచుకంఠాన్ని ఎక్కుపెట్టారు. నా సినిమా వందకోట్లు కలెక్టే చేసింది..150కోట్లు కలెక్ట్ చేసింది అంటూ కొంతమంది హడావుడి చేస్తున్నారంటూ విమర్సించారు. అసలు ఆ సినిమాల నిజమైన కలెక్షన్లు దమ్ముంటే బైటపెట్టాలంటూ సవాల్ విసిరారు
ఎవరైనా నిర్మాత నా సినిమా వందకోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది నాకు యాభై కోట్లు మిగిలిందంటూ చెప్పగలరా అని ఛాలెంజ్ చేశారు..భార్యాబిడ్డలపై ఒట్టు పెట్టుకుని తన సినిమా కలెక్షన్స్ బైటపెట్టాలని డిమాండ్ చేశారాయన. ఈ కామెంట్లు ఖచ్చితంగా చిరంజీవితో పాటు మెగా కాంపౌండ్ హీరోలను దృష్టిలో పెట్టుకుని చేసినవే
అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలా వందకోట్లు ..నూటయాభైకోట్లు కలెక్ట్ చేశాయ్ మా సినిమాలు అని ప్రకటనలు గుప్పిస్తోంది ఆ కాంపౌండ్ హీరోలే పైగా వీళ్లిద్దరికీ ఎప్పట్నుంచో ప్రత్యక్షమైన పోరు నడుస్తోంది కూడా..దీనికి బీజం 1994లో జరిగిన సినిమా యూనియన్ స్ట్రైక్ కారణం..అప్పట్లో చిరంజీవి
మద్రాసులోనే నివాసం ఉండేవారు. అసలు ఓ దశవరకూ హైదరాబాద్ వచ్చేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఆ సందర్భంగా స్థానికులకే సినిమా షూటింగ్స్‌లో స్థానం కల్పించాలనే వాదనతో సినిమా రంగం రెండు వర్గాలుగా చీలిపోయింది. అప్పుడే మోహన్‌బాబు చిరంజీవి వర్గంపై తీవ్రంగా విరుచుకుపడేవారు. ఆయన వాగ్ధాటికి
బలైన వారిలో పరుచూరి బ్రదర్శ్ కూడా ఉన్నారు. కులం పేరెత్తి మరీ పరుచూరి బ్రదర్స్‌పై మోహన్ బాబు ఒంటికాలితో లేచారని అప్పటి ప్రత్యక్షసాక్షుల కథనం. ఆ ప్రహసనంతోనే తెలుగు ఇఁడస్ట్రీకి చెందిన నటులు చాలామంది హైదరాబాద్‌కి తరలి వచ్చేశారు. ఇక గత్యంతరం లేకనే చిరంజీవి కూడా మద్రాసు వదిలి హైదరాబాద్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు

అప్పటికీ కొంతమంది నిర్మాతలు దేవీవరప్రసాద్ లాంటి వాళ్లు నేను మద్రాసులోనే సినిమా తీస్తా..సబ్సిడీలు ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు అని భీష్మించుకుని మద్రాసులోనే ఉండిపోయారు కూడా ఇక అప్పట్నుంచే సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు ఒకరకంగా ఒంటరి అయ్యాడంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. పైకి ఒకరిపై ఒకరు అభిమానాలు చాటుకున్నా..ఇప్పటికీ మెగాస్టార్ కానీ..అతని కాంపౌండ్ హీరోలపై కానీ విమర్శలు చేయాలంటే ఆ ధైర్యం మోహన్ బాబుకే చెల్లింది. ఇప్పుడు మోహన్ బాబు చేసిన కలెక్షన్ల కామెంట్లు కూడా ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవే అని చాలామంది నిర్ధారణకు వచ్చేశారు

Comments