విజయసాయిరెడ్డి గడ్డం వెనుక కథ


రాజ్యసభలొ తన ప్రసంగాలతొ దుమ్మురేపుతొన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపి విజయసాయిరెడ్డి గత కొద్ది రొజులుగా వార్తల్లొని వ్యక్తిగా నిలుస్తున్నారు..ఆస్తులకు సంబంధించిన కేసులొ విచారిస్తున్న సిబిఐ కూడా ఈయన్ని జీనియస్ అని పొగడటం గుర్తుండే ఉంటుంది. అంతటి మేధావి కనుకే పార్టీ నుంచి ఎందరున్నా..రాజ్యసభలొ పనులు చక్కబెట్టడానికి ఆ పార్టీ అధినేత జగన్ ఆయన్నే ఎంపిగా ఎంపిక  చేశారంటారు..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే సాధ్యంకాని మొడి అప్పాయింట్ మెంట్‌ని విజయసాయిరెడ్డి ఏకంగా మూడుసార్లు పొందారు. అంతకుముందు బీహార్ గవర్నర్‌గా ఉన్న ఇప్పటి రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్‌ని ముందే కలిసి అభినందించారు. అప్పట్లొనే ఈ విషయం సంచలనమైంది.
ఐతే కొద్ది రొజులుగా ఆయన ఆహార్యంలొ కూడా మార్పు వచ్చింది. దీనికి కారణం ఏమిటా అని తరచి చూస్తే రెండు విషయాలు తెలుస్తున్నాయ్. 2014లొ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తప్పకుండా తన పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి అవుతారనే అభిప్రాయం చాలామందిలొ ఉంది. ఐతే ఆ సీట్లు కాస్తా 60పై చిలుకు దగ్గరే ఆగిపొవడంతొ అది నెరవేరలేదు. అప్పుడే సరైన వ్యూహం , వ్యూహకర్త లేకపొవడం వల్లనే అలా జరిగిందని పార్టీలొ చాలామంది అనుకున్నారు..అది నిజం కూడా..అందుకే ఇలాంటి మాస్టర్ స్ట్రాటజీలు అమలు చేయడానికే జగన్ విజయసాయిని రంగంలొకి దింపారంటారు..ఆల్మొస్ట్ ఆయన వ్యూహం ఫలించింది కూడా..! అందుకే ఇప్పుడు కేంద్రంలొని జాతీయపార్టీలు జగన్‌ని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఈ సందర్భంలొనే విజయసాయిరెడ్డి..జగన్ ని సిఎం పదవిలొ చూసేంతవరకూ ఇలా గడ్డం తీయననే శపథం చేసారని కొంతమంది అంటారు..అందుకు తగ్గ వ్యూహాలు ఎప్పటికప్పుడు రచించుకుంటూ ముందుకు పొతున్న విజయసాయిరెడ్డి ఈ క్రమంలొ ఎలక్షన్ ఇఁజనీరింగ్‌లొ పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషొర్‌ని కూడా ఒవర్ టేక్ చేశారట.

ఐతే నంద్యాల,కర్నూలు బైఎలక్షన్స్ దెబ్బ కొట్టినా...అసలు టార్గెట్ 2019 ఎన్నికలు అని అది మాత్రం మిస్సవదని పార్టీలొని సన్నిహితుల వద్ద విజయసాయిరెడ్డి వ్యాఖ్యానిస్తున్నారట. తన పట్టుదలకి నిదర్శనంగానే ఈ కొత్త గెటప్‌తొ ముందుకు సాగుతున్నట్లు చెప్తున్నారు..ఐతే కొంతమంది మాత్రం రాజ్యసభ ఎంపిగా తనకంటూ  ఒక ప్రత్యేకమైన గెటప్ ఉంటేనే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉఁటుందని అందుకు తగ్గట్లే లుక్ మార్చినట్లు చెప్తున్నారు. అంతకుముందు సాదాసీదా ప్లెయిన్ షర్ట్స్ ‌తొ టక్ చేసి సింపుల్‌గా ఒక కార్పొరేట్ ఎంప్లాయిలాగా కన్పించేవారు విజయసాయిరెడ్డి..

కానీ ఇప్పుడు మాత్రం ఒవర్ కొట్...పెరిగిన గడ్డంతొ డిఫరెంట్ లుక్‌తొ ఒక్కసారి చూసినవాళ్లకి కూడా రిజిస్టర్ అయ్యేలా దర్శనమిస్తున్నారు. ఈ రెండు ప్రచారాలలొ ఏది నిజమైనా..విజయసాయిరెడ్డి మాత్రం బడ్జెట్ సమావేశాలతొ తెలుగు ఎంపిలలొ ఎవరికీ రాని గుర్తింపు తెచ్చుకున్నారనడంలొ సందేహం లేదు..ఒకవైపు తెలుగు దేశం ఎంపిలలొ కొందరు చిల్లరవేషాలు వేస్తుంటే..ఈయన మాత్రం సాక్షాత్తూ రాజ్యసభలొనే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ అందరి దృష్టినీ ఆకర్షించడం విశేషమే మరి. 

Comments