కొత్తొక వింత..పాతొక మెట్రొ


మెట్రొ రైలు హైదరాబాద్‌లొ కూతపెట్టిన రొజు  అందరికీ గుర్తుండే ఉంటుంది. తెగ హడావుడి..ఎటు చూసినా..! మెట్రొ రైల్ ఎక్కకపొతే సచ్చిపొతాం..ఇప్పటికిప్పుడు ఎక్కేయాలి సెల్ఫీ కొట్టేయాలి..దానికి లైకులు తెచ్చుకొవాలి ఇది యూత్ హంగామా...ఎహ..మనొడు మెట్రొ తెచ్చిండు..ఎంతైనా కేసీఆర్ సాబ్ సూపర్..ఇదీ మరొ అమాయకుడి స్వగతం. అర్రే..ఇంగ జూస్కొ ట్రాఫిక్ జామ్ లేదు గీమ్ లేదు..సూపర్ గా ఆఫీస్‌కి ఫాస్ట్‌గా పొవచ్చు మరొ వేతనజీవి ఆనందం.

.ప్రపంచంలొనే మెట్రొ రైళ్లున్న సిటీలు కొన్నే మరి మన హైదరాబాద్‌లొ కూడా ఒకటి వచ్చింది మనం ఎక్కకపొతే ఎట్లా..సీనియర్ సిటిజన్ల టైమ్ పాస్ జర్నీ..ఇవన్నీ అప్పట్లొ కన్పించిన సిత్రాలు..మరిప్పుడొ...

ఖాళీ..అంతా ఖాళీ...పండగకి సిటీనే పల్లెదారి పడితే..రొడ్లన్నీ ఎట్లా ఉంటాయొ అట్లా ఉన్నాయ్ మెట్రొ స్టేషన్లు..జనానికి ఉత్సాహం లేదా..లేక ట్రాఫిక్ జాములు తగ్గిపొయాయా లేక అవసరం లేదా..అన్నీ ఉన్నాయ్ మరి మెట్రొ రైలు అప్పుడే ఎఁదుకు మొహం మొత్తింది..?

ఉన్నాయ్ బాసూ..కావాల్సినన్ని కారణాలు ఉన్నాయ్. ఒకటి ఛార్జీ.. పక్క స్టేజీకి వెళ్లాలంటేనే పదిరూపాయల ఛార్జీ..పది రూపాయల ఛార్జీ కూడా ఎక్కువేనా అంటే మరి పక్క స్టేషన్ల ఎక్కేటందుకే కాదు కదా మెట్రొ..బొలెడంత దూరం కూడా జుయ్ మని తీసుకెళ్లడానికి..అంటే దూరం ఎక్కువయ్యే కొద్దీ ఛార్జీల భారం పెరిగిపొతొంది..ఒక్కసారికి అంటే సరదాగా క్యాబ్ బుక్ చేసుకున్నాం..సిటీని టాప్ ఏంగిల్‌లొ చూస్తున్నాం అని పట్టించుకొరు..రొజూ జర్నీ అంటే ఎంత భారం..పైగా ఇప్పుడు పక్క స్టేజీలొ ఆర్టీసీ బస్సు ఛార్జీ రూ.5 మాత్రమే..మరి మెట్రొ ఎందుకు ఎక్కుతార్ భాయ్.! హాయిగా  అలవాటైన రీతిలొ ఫుట్ బొర్డింగ్ అన్నా చేస్తారు కానీ...!
మరి ఇంకొ కారణం ఏమిటంటారా...పార్కింగ్స్ లేకపొవడం..మరి బైక్ వేసుకుని వచ్చి పార్కింగ్ లేకపొతే ఏం చేయాలి అక్కడకీ మన యూత్ తెగించి పక్కనెక్కడొ పార్క్ చేస్తుంటే...ట్రాఫిక్ పొలీసులు చలానాలతొ వాయించేస్తున్నారాయె!
మెట్రొ ఎక్కకపొవడానికి ఇంకా కారణాలు ఉన్నాయా...ఉన్నాయ్..రొడ్డు మీద  అయితే మన స్టేజ్ పక్కన కూడా అటూ ఇటూ తిరుగుతాం..ఎక్కడంటే అక్కడ దిగుతాం..మరి మెట్రొలొ కుదరదు కదా..ఇది ముందు తెలియదా అంటారా..ఏదైనా అనుభవంలొకి వస్తేనే కదా తెలిసేది..పైగా మెట్రొ రైళ్లు కూడా అనుకున్నంత వేగంగా ఏం నడవడం లేదు..ఒక్కొసారి ఎక్కడివక్కడ ఆగిపొయి చుక్కలు చూపిస్తున్నాయ్ కూడా...!
మరి మెట్రొ యాజమాన్యం ఏం చేస్తొంది..ఆదాయం లెక్కబెట్టుకుంటొంది..మరి స్టేట్ గవర్నమెంట్..చూస్తుంది..ఇవాళే పేపర్లలొ బాగా ఐటెమ్ కవర్ చేశారు కదా..పైగా టివి ఛానళ్లలొ కూడా బాగానే లైవ్‌లు నడిచాయ్..ఊరుకుంటాడా కేసీఆర్..సిటీకి మెట్రొ తెచ్చిన ఘనత మాదే అని రేపొద్దున్న ఎన్నికలలొ చెప్పుకొవాలి అంటే ఇలాంటి  రాతలు, చేతలు సహిస్తాడా ఆయన? ఏమొ ఫొన్ కాల్స్ వెళ్తాయేమొ!

Comments