ఉద్యోగం పేరుతో సెక్సీ చాటింగ్ బండారం బైటపెట్టిందెవరో తెలుసా!


పొట్టకూటి కోసం కోటి తిప్పలు అనే సామెత ఎప్పటికీ పాతబడదు. ఐతే అందుకోసం ఏ పనైనా చేయాలంటే మాత్రం కుదరదు..అలాంటి కానిపనినే చేయిస్తున్న నీచ్ కమీన్ కుత్తేగాళ్లని భువనగిరి పొలీసులు అరెస్ట్ చేశారు. .ఒక గూటి పక్షులు ఒకే గూటికి చేరుతారన్నట్లుగా గుంటూరు జిల్లాకి చెందిన వీరేశం..భువనగిరికి చెందిన భవాని కలిశారు. భుక్తి కోసం ఉద్యోగమో వ్యాపారమో చేసుకోవడం
కొంతమందికి తప్పదు. అలాంటివాళ్లని క్యాచ్ చేయడమే ఈ ఇద్దరి పనిగా పెట్టుకున్నారు. ఇక అలాంటివారితో ముందుగానే తెల్లకాగితాలపైన సంతకాలు పెట్టించుకునిఉద్యోగాలు ఇచ్చేశామన్నారు. ఇంతకీ వీళ్ల ఉద్యోగం ఏమిటంటే..రకరకాల ఫోన్ నంబర్లకు కాల్ చేసి బూతులతో రెచ్చగొట్టడం. ఎంత ఎక్కువసేపు మాట్లాడితే అంత డబ్బులు వస్తాయంటూ ఆశ పెట్టేవారు. ఇలా హనీ ట్రాప్ చేసిన యువకుల దగ్గర్నుంచి రకరకాల ప్యాకేజీలతో బాగా డబ్బులు వసూలు చేశేవాళ్లు..మరి వాళ్లు తిరిగి ఫోన్ చేసి పర్సనల్ గా కలిసేందుకు ప్రయత్నించరా అని డౌట్ రావచ్చు..అందుకోసమే వీళ్లే ఓ కాల్ సెంటర్ ఓపెన్ చేశారు. దీంతో అవతలివారికి కాల్ వెళ్తుందే తప్ప..ఫోన్ నంబర్ల ద్వారా తిరిగి ట్రేస్ చేయడం అంత సులభమయ్యేది కాదు..ఇదే రకంగా కొన్నాళ్లు సాగింది కానీ..ఇలాంటి బూతు సంభాషణ చేయడం తన వల్లకాదని ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు చెప్పడంతో వీళ్ల బండారం బైటపడింది. ఈ కాల్ సెంటర్లో కాల్ గాళ్స్ లా వ్యవహరించే 12మంది యువతులు పోలీసులకు పట్టుబడ్డారు. వాళ్లందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేయగా..వీరేశం భవాని మాత్రం ఊచలు లెక్కబెడుతున్నారు

Comments