చెత్త పలుకు


గత వారం మన పొస్టులలొ ఒక కేతిగాడి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడదే కేతిగాడు ప్రతిపక్షాలదే తప్పన్నట్లు మరొ చెత్తపలుకును జనం మీదిిక వదిలాడు. అన్నట్లు ఆ తప్పు జనంది కూడా అట..బహుశా ఆయన ఎవరిది తప్పంటే వారిది తప్పని..ఎవరిని ఆహొ ఒహొ అఁటే మనం కూడా భజన చేయాలన్నదే ఆయన పలుకుల సారంశం కావచ్చు. ఉదాహరణకు ఈ కింది కటింగ్ గమనించండి

 ఉపరాష్ట్రపతి ఐపొయాను కదా..ఇంక నాకెందుకు అని కూర్చొవచ్చట..కానీ ఆలాగున ఆ మహాశయుడు కూర్చొకుండా..నిల్చొకుండా..పంచ జారిపొతున్నా పట్టించుకొకుండా..పని చేశాడట..ఇంతకీ ఆ పని ఏమిటయ్యా అంటే..టిడిపి-బిజెపి బంధం తెగకుండా చూడటమట..ఆహా ఏమి వాక్యములు..! ఇదే వాణి నిన్నా మొన్నా పేపర్లలొ అదేదొ బ్రహ్మాండం బద్దలైనట్లు..కేంద్రం మెడలు వంచిన రజనా...ఎట్టకేలకు సాధించిన విక్రమార్కుడు..అంటూ విశేషణాలతొ తరించిపొలేదా..మరప్పుడే ఆ హామీలు గాల్లొ ఫ్లైట్లయ్యాయా!
ఇక ఆ తర్వాతి కాలమ్స్ పరిశీలిస్తే..చంద్రబాబు నిరంతర ప్రయత్నం..హృదయస్పందన..రాష్ట్రప్రయొజనాలకేనని
ఈయనకే తెలిసినట్లు మరెవరికీ తెలీదు. అదే పాపం తన వక్కపలుకుల్లొ చేర్చుకుని తరించిపొయాడు. పనిలొపనిగా తన అసలు పరమార్ధమైన వైఎస్సార్ కాంగ్రెస్ ఏం చేసిందొ కూడా జనాలకి గుర్తు చేశాడు..పాపం జనం టివిల ముందు ఎవరు ఏ డ్రామా ఆడతారొ గమనించనట్లు..తాను చెప్పిందే వింటారనే పిచ్చి భ్రమలొ తెగ వీరగంధం పూసేసుకున్నాడు

ఇదిగొ ఇక్కడే తన ఆకాంక్షలు..అభిప్రాయాలు ఎలా నిర్భీతిగా వ్యక్తీకరించాడొ చూడండి..జనం అప్పుడు స్పందించడం..ఇప్పుడు స్పందించడం రెండూ తప్పట..అందులొ ప్రముఖమైనది..కేంద్రం నుంచి టిడిపి బైటికి రావడం ఒక డిమాండ్..అదసలు ప్రపంచం బద్దలైనా అడక్కూడదనేది మనొడి అభిమతం..
ఇక కింద పేరా చూస్తే..మీడియాలొ వచ్చిన వార్తలు చూస్తే..కేంద్రం ఏదొ ఇవ్వబొతుందని తెలిసిందట...ఏ మీడియాలొ కేంద్రం ఇస్తొందని రాసింది..కేవలం మీ పచ్చపుష్పాల పత్రికల్లొనే కదా..వచ్చింది మళ్లీ మీడియా అఁటూ తప్పించుకునే ప్రయత్నం ఎందుకు...లేక మీకు  తెలీకుండానే మీ పత్రికల్లొ రాసేసుకుంటున్నారా....!

Comments