సిగ్గులేదా కొత్తపల్లి గీతా!


మింగలేనప్పుడు సింపుల్‌గా ఇవాళ మంగళవారం  అంటే ఎంచక్కా తప్పించుకోవచ్చు..ఇదే తెలుగుదేశం ప్రస్తుత వైఖరిగా చూడొచ్చు. ఎందుకంటే గత నాలుగు బడ్జెట్లుగా జరుగుతున్నదే ఇప్పుడూ జరుగుతోంది. ఐనా ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ త్యాగమైనా (అసలు దీన్ని త్యాగమనొచ్చా) చేస్తామన్న రేంజ్‌లో బిల్డప్స్ ఇవ్వడం ఆ తర్వాత ఎవడి పనులు వాడు చూసుకోవడం ఇదే కదా..మనం గత నాలుగైదేళ్లుగా చూస్తుూ వచ్చింది.

ఐతే ఇందులో కొత్తపల్లి గీత  ఎలా టిడిపి ఎంపి అయిందో వాళ్లే చెప్పాలి. ఎందుకంటే ఈ రొజుకీ స్పీకర్ ప్రకటన ప్రకారం ఆమె వైెఎస్సార్ కాంగ్రెస్ ఎంపినే..మరి ఇలా నిస్సిగ్గుగా టిడిపి పార్లమెంటరీ బేటీకి ఎలా హాజరైందో మరి.! బహుశా తన నియోజకవర్గం అభివృధ్ది కోసం అయి ఉండొచ్చు. మరిప్పుడు ఆ బిజెపినే టిడిపిని దూరం పెడుతుంటే ఎలా అభివృద్ది చెందగలదు ఈమె కమతం..పైగా పైన విజువల్స్ చూసినా మీకు అది ఎంత ఆషామాషీ సమావేశమో అర్ధమవుతుంది. చిరునవ్వులు చిందించుకుంటూ..ఆయ్..టిఫిన్ అయిందా..టీలు తాగారా..కాఫీలు సేవించారా అన్నట్లు కన్పిస్తున్నారే తప్ప ఎక్కడైనా సీరియస్‌నెస్ కన్పిస్తుందా..
ఇక సీన్ ఇక్కడ కట్ చేస్తే కొత్తపల్లి గీత పార్లమెంట్‌లో చేసే ఫైట్ ఏంటో ఆమెకే తెలియాలి. అసలు ఆమె ఇంతవరకూ లోక్ సభలో ఏమని చెప్పి స్పీకర్‌ని తన అభివృధ్దిని ప్రశ్నించగలదు..ఎందుకంటే ఆమె భర్తపైనే ఛీటింగ్ కేసులు ఉన్నాయ్. అలాంటప్పుడు ఎంత లైమ్ లైట్ నుంచి అంత తప్పుకుంటే మంచిది కానీ..ఎందుకీ మెహర్బానీలు

Comments