ఇదీ బోనీకపూర్‌ని శ్రీదేవి పెళ్లి చేసుకోవడానికి అసలు కారణం


మిధున్ చక్రవర్తితో పెళ్లైందన్నారు..జితేంద్రతో సంబందం ఉందన్నారు. ఐనా శ్రీదేవి ఎప్పుడూ వాటికి స్పందించలేదు కానీ..ఒకసారి మాత్రం రెండో పెళ్లి మగాడిని మాత్రం చేసుకోను అని సమాధానం చెప్పింది. దాంతో ఈ ఇద్దరితో ఆమెకి ఎలాంటి సన్నిహిత సంబంధం లేదని నిర్ధారణకు వచ్చారు ఫ్యాన్స్..మరి కానీ పన్నెండేళ్ల తర్వాత తన మాట తానే ఎందుకు తప్పింది..పెళ్లై పిల్లలున్న బోనీకపూర్‌తో పెళ్లికి ఎలా రెడీ అయింది..ఇదో డౌట్ రాకమానదు..వాటికి సమాధానంగా అందరూ దాదాపు వాస్తవానికి దగ్గరగానే ఊహించారు..ఐతే శ్రీదేవి టాప్ మోస్ట్ ఫ్యాన్ రాం గోపాల్ వర్మ ఇప్పుడు అసలు నిజం బైటపెట్టాడు.
 ఆయన మాటల్లో చెప్పాలంటే తల్లిదండ్రులున్నంతవరకూ శ్రీదేవి హ్యాపీ గో లైఫ్ ఎంజాయ్ చేసింది..తండ్రి చనిపోవడంతో అసలు కష్టాలు ప్రారంభం అయ్యాయట. తండ్రిని స్నేహితులు మోసం చేస్తే..ఆమె తల్లికి ఇక వేరే 
దిక్కులేక బంధువులను నమ్మడం ప్రారంభించింది. ఐతే ఎప్పుడైతే బ్రెయిన్ సంబంధింత జబ్బుతో ఆమెకి అమెరికాలో వైద్యం జరిగిందో అప్పుడే శ్రీదేవి కష్టాలు ఎక్కువ అయ్యాయ్. అక్కడే శ్రీదేవి తల్లి చనిపోవడం కూడా జరిగింది. అసలు ఈ కథతోనే శంకర్ సినిమా జీన్స్ తీశారంటారు..శ్రీదేవిని విపరీతంగా అభిమానించిన టెన్నిస్ స్టార్లు అమృతరాజ్ బ్రదర్స్ సినిమాలో ప్రశాంత్ ట్విన్స్ కాగా..ఐష్ క్యారెక్టర్ శ్రీదేవిది కాగా..లక్ష్మి శ్రీదేవి తల్లి క్యారెక్టర్ అంటారు. ఇక ఎప్పుడైతే ఆమె తల్లి చనిపోయిందో..ఇక అక్కడ్నుంచీ శ్రీదేవి అసలు కష్టాలు ప్రారంభం అయ్యాయ్. ఆమెరికా ఆస్పత్రి నిర్లక్ష్యానికి పరిహారంగా వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం శ్రీదేవి చెల్లి శ్రీలత కేసు పెట్టింది కూడా! ఇక అప్పుడే తన చుట్టూ తిరుగుతున్న బోనీ కపూర్ ని నమ్మడం తప్ప మరో దారి లేకుండా పోయింది శ్రీదేవికి .  ఇక్కడే రాము మరో విషయం  పేల్చాడు. 

శ్రీలత పక్కింట్లో ఉండే వ్యక్తితో లేచిపోయిందని చెప్పాడతను. ఇన్ని కష్టాల తర్వాత బోనీ కపూర్ ని చేసుకుంటే..అటు అత్తింటి ఆరళ్లు అనే పదానికి అర్ధం తెలిసొచ్చేలా బోనీకపూర్ తల్లి బిహేవ్ చేసేదట. అందరూ చూస్తుండగానే చేయి చేసుకోవడం కూడా జరిగిందట. ఇదీ ఓ ఆలిండియా సూపర్ స్టార్ లేడీకి జరిగిన సన్మానం..ఇది చాలు శ్రీదేవి జీవితం ఏంటనేది చెప్పడానికి.. అలా నటిగా తన హుందాతనం కాపాడుకుంటూనే బైటికి మాత్రం ఎక్కడా గుట్టు విప్పకుండా జాగ్రత్త పడిందట శ్రీదేవి. 1997 తర్వాత హిట్లు లేకపోయినా..ఎలాగోలా సినిమాల్లో నెట్టుకొచ్చేసింది..బోనీకపూర్ తీసిన సినిమాలు కూడా ఫెయిలవడంతో ..ఇక చేసేది లేకనే రీ ఎంట్రీ ఇచ్చింది..కూతురిని కూడా రంగంలోకి దింపింది..క్లాసికల్ డ్యాన్స్ తప్ప క్యాబరే టైప్ డ్యాన్సులంటే అస్సలు ఇష్టం లేని శ్రీదేవి అలాంటి చోట్లకి వెళ్లడం కూడా నరకంతో సమానంగా భావించేదట..ఐతే స్క్రీన్ పై మాత్రం నటన కాబట్టి చేసేదాన్నని చెప్పుకొచ్చేది. ఇదే ఒత్తిడితో మానసిక అశాంతి శరీరంపైన పడుకుండా ఉండేందుకు సర్జరీలను ఆశ్రయించిందని రామ్ గోపాల్ వర్మ బాహాటంగా తన తాజా డైరీలో రాసుకొచ్చాడు. చివరికి ఇలా మృత్యువు ఒడిలో చేరిందని తీవ్రమైన బాధతో వర్మ చెప్పడం సంచలనంగా చెప్పాలి. ఎందుకంటే వర్మ వ్యక్తం చేసే అభిప్రాయాలను చూసినవాళ్లెవరూ ఇలా ఒక వ్యక్తి గురించి తపన పడటం నమ్మరు. కానీ వర్మ డైరీ రాతలతో అసలు శ్రీదేవి బోనీకపూర్‌ని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనేది స్పష్టమైపోయింది

Comments