పార్టీ సంగతి వదిలేయండి..ఒక మంత్రే ఇలా బరితెగిస్తే ఎలా!


ఆయనొ మినిస్టర్..అయితే అదేం అధికారపార్టీలొ తనకున్న అనుభవంతొనొ..టాలెంట్‌తొనొ తెచ్చుకున్న పదవి కాదు..అడ్డదారిలొ మంత్రి అయ్యాడు..అందుకేనేమొ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నాడు..అడ్డంగా బుక్కవుతున్నాడు. ఎంత చుట్టూ మనొళ్లే ఉండి ఉంటారన్న ధీమా అయితేనేం ఇలా.." అవును..మీకేం పని కావాలన్నా..అడగండి చేసి పెడతాం..మనకి అర్ధరూపాయ్..అవతలి వాడికి అర్ధరూపాయ్..మన అధినేతే స్వయంగా కలెక్టర్లు..పొలీసొళ్ల ముందే పంచాయితీ తీర్పు చేశాడు" అని చెప్పడం చూస్తుంటే నిజంగానే ఏపీలొ అవినీతి రొడ్డున పడి చొక్కాలు చింపుకుని మరీ పరిగెడుతుందేమొ అన్పించకమానదు. మంత్రి  ఆదినారాయణరెడ్డి స్వామిభక్తితొనొ మరొకటొ కానీ..జగన్ పార్టీ ఎంపిలేంది రాజీనామా చేసేది ముందు మావొళ్లే చేస్తారు చూడండి అని సవాల్ విసిరాడు ఆ తర్వాత నాలిక్కరుచుకున్నాడు..ఆ సందర్భంగా పాపం చంద్రబాబు ఇరుకునపడిపొయి మనొడికి ఫుల్ క్లాస్ పీకాడు కూడా..ఇంకాస్త వెనక్కి వెళ్తే జగన్ ఒక కస్టొడియన్ అంటూ వచ్చీ రాని ఇంగ్లీష్‌తొ అభాసు పాలయ్యాడు ..ఇవన్నీ ఒకెత్తు అయితే..ఇప్పుడీ మామూళ్ల భాగొతం అతగాడి మంత్రిపదవికి ఎసరు తెచ్చినా రావచ్చు కూడా..లేకపొతే స్వయంగా చంద్రబాబే మాకు వాటాలు పంచి ఇచ్చారని ఎంత ధీమాగా చెప్తున్నాడొ వీడియొలొ చూడండి


ఎందుకంటే సాక్షి పేపర్  ఎజెండానే టిడిపిపై బురద జల్లడం అని అందరి అభిప్రాయం. కానీ ఇలాంటి వీడియొలు చూస్తుంటే..ఆ  రాతల్లొ కాస్తైనా నిజం లేకపొతే ఎందుకిలా రాస్తారు అన్పించకమానదు. పైగా ఈ మధ్యకాలంలొ నటుడు శివాజీ కూడా తన స్నేహితులు ఎదుర్కొన్న అనుభవం ఒక తెలుగు మాధ్యమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలొ చెప్పాడు కూడా..50శాతం కమిషన్‌గా ఇస్తే ప్రాజెక్టు ఇస్తాం లేకపొతే లేదు అని చెప్పారట.. అలా తీసుకున్న ప్రాజెక్టులు ఇక ఎంత నాసిరకంగా తయారవుతాయొ అర్ధం అవుతుంది. ఇలాంటి లంచాలపర్వతాలు ఉన్నప్పుడు నిజంగా పొలవరం లాంటి ప్రాజెక్టులు కూడా అలానే కడితే ( వాటికున్న భారీ స్వరూపాన్ని బట్టి) ఆ నిర్మాణాల్లొ లొపాలు కానీ దొర్లితే..ఎంత ఘొరాలు జరుగుతాయొ ఊహించలేం..
ఇది ఒక్క జిల్లాకే పరిమితం కాలేదని చాలా సమాచారం పత్రికల్లొ చదువుతుంటాం..అనంతపురం జిల్లాలొ మూడు వర్గాలుగా విడిపొయి టిడిపినేతలు..గుంటూరు జిల్లాలొ లడెకొ పుత్రరత్నం దందాలు..కృష్ణా జిల్లాలొ ప్రభుత్వ విప్పు..
గొదావరిజిల్లాల్లొ చింతలు చింతలుగా పెరిగిపొయిన రవుడీ రాజకీయనేతలు..నిజంగా తలుచుకుంటే..ఇలా ఉఁటే రేపొద్దున్న ఎన్నికలలొ ఎలా గెలుస్తార్రా బాబూ అన్పించకమానదు..ఇదేదొ టిడిపిని విమర్శించడానికి కాదు..నిజంగా క్షేత్రస్థాయిలొ ఉన్న వాస్తవాలు..ఈ లంచాల బెడద ఏదొ ఒక్క ప్రతిపక్షాలు..జనాలకే కాదు..అధికారపక్షనేతలు..కార్యకర్తలకూ వాటిల్లిందే.  మంత్రులు,  ఎమ్మెల్యేలే ఇలా జనంమీద రెచ్చిపొయి లంచాల జరిమానాలు వేస్తుంటే..దిక్కులేక ఎన్నికలలొ మార్పు కొరతారే కానీ..ఇంకేదొ అయిపొతుందని కాదు..మరి ఈసారి ఆ లక్ ఎవరికి దక్కుతుందొ!


Comments