ఛీ..పొ పొమ్మంటున్నా పొయ్యేట్టుగా లేడే..! వీర్రాజు వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా


ఒకవైపు అధినేత అసంతృప్తి..మరొవైపు ఢిల్లీనుంచి వచ్చి పడుతొన్న ఫొన్ కాల్స్..శిబిరం నుంచి బైటికి రావడమే తరువాయి..ఇఁకేదొ టెంట్ పెట్టుకొవచ్చు..అందుకే శివసేనతొ కూడా ఫొన్ కాల్స్‌లొ మంతనాలు జరుగుతున్నాయ్ అంటూ ఉదయం నుంచి తెగ భజన బృందం మొసేసిన దాన్ని సొము వీర్రాజు ఒక్కడే తుస్సుమనిపించాడు. అంత సీన్ లేదని..టిడిపితొ కలిసి ఉండాల్సిన అగత్యం తమకి లేదంటూ ఇన్‌డైరక్ట్‌గా చంద్రబాబునే టార్గెట్ చేశాడు
రాజ్ నాధ్ సింగ్ ఫొన్ చేస్తే నాకేంటి..ప్రధాని మాటగా చూడమని చెప్పొచ్చాడా..నేను చూడొచ్చానా అనుకున్నాడొ ఏమొ కానీ ఒంగొలులొ ఏకంగా ధర్నానే చేసి పారేశాడితగాడు

ఒకరకంగా ఇలాంటి నేతలు కాస్త లైమ్ లైట్‌లొకి రావడానికి బిజెపి-టిడిపి పొత్తే కారణం. గెలిచింది నలుగురు ఎమ్మెల్యేలే అయినా ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వాల్సి వచ్చింది. ఐనా పాపం చంద్రబాబంటే వీసమెత్తైనా రెస్పెక్టే లేదాయె..ఎహ పొండి..నా మంత్రి పదవి వదిలేస్తేనా...నాకంటే పెద్ద ఇదిగాడు లేడన్నట్లు ఈ మధ్యనే మాణిక్యాలరావ్ మాట్లాడితే..ఇప్పుడు వీర్రాజు వీరాలాపాలకు అంతేలేదు. " రెండు ఎకరాల ఆస్తి తొ వచ్చి..ఇప్పుడు లక్షకొట్లు ఎలా సంపాదించావొ చెప్పు..మేం నిప్పులాంటొళ్లం..నువ్ కాదు..అసలు పొలవరం కాంట్రాక్టర్‌ని ఎఁదుకు మార్చుతున్నావ్"  అఁటూ పాపం చంద్రబాబుని ఎడాపెడా వాయించి వదిలిపెట్టాడు.

ఇక్కడ టిడిపిది ఇరకాటంలొ పడ్డ ఎలకలాంటి సిచ్యుయేషన్ ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు ఆయనకి ఉన్నఆబ్లిగేషన్స్, స్ట్రాటజీలతొ ఆగ్రహం, నిరసన వ్యక్తం చేయగలడు కానీ...ఒపెన్‌గా విమర్శలు  చేయలేడు..పాపం ఆయన పార్టీ అభిమానులు కూడా అదిగొ మావాళ్లు రాజీనామాలు చేసేస్తున్నారు..మంత్రిపదవులనీ వదిలేస్తున్నారు..చూస్కొండి అనుకుని సంబరపడ్డారు కానీ..సినిమా అంత లేదుకదా..! ఇంత చేసినా కూటమి నుంచి బైటికి పొడేం అంటూ బిజెపి నేతలు అవాక్కవుతున్నారు..వీర్రాజులాంటివాళ్లని ఉసిగొలుపుతున్నారు. టిడిపి నేతలేమొ ఇదెక్కడి గొడవరా బాబూ అంటూ బిత్తరపొతున్నారు..ఇదివరకటిలా సన్నాయి నొక్కులు నొక్కడానికి బొంకయ్యనాయుడైనా  లేడాయే అనుకుని ఉస్సూరంటున్నారు..వీర్రాజు మాటలు చూస్తుంటే అసలు వీళ్లది మిత్రపక్షమేనా..లేక అసలు సిసలు ప్రతిపక్షమా అనుకొకతప్పదు..అందుకే పొమ్మని పొగబెట్టినా పొడేంట్రా బాబూ అని బిజెపిలొ ఇన్‌సైడ్ టాక్ ప్రారంభమైంది.

Comments