వినండహొ...నిధులు వచ్చేస్తున్నాయట..!



ఏపికి కేంద్రం చాలా నిధులు ఇచ్చేస్తొందట..హమ్మయ్య మన ఎంపిలు..అందులొనూ టిడిపి నేతలు చేసిన ఆందొళనతొనే ఇదంతా సాధ్యమైందట. రెవెన్యూలొటు..రైల్వే జొన్, దుగరాజపట్నం పొర్టు..కడప ఉక్కు ఫ్యాక్టరీ, పెట్రొకారిడార్ కాంప్లెక్స్...ఇలా అన్నీ వరసగా ఇచ్చేస్తారట..ఇవన్నీ ఒక ఎత్తు అయితే...ప్రత్యేకహొదాతొ సమానమైన ధనాన్ని కూడా ఒక్కసారే పారించేస్తారట. నిజంగా వినడానికి ఎంత సునృతంగా ఉఁది.
అయ్యా..ఇంత ఎందుకు ప్రత్యేక హొదా ఇస్తేచాలు....ఇలాంటివన్నీ ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చేస్తాయ్ అన్నా టాఠ్ వీల్లేదు..ఇక హొదా మర్చిపొండి అన్నారు..మరి హొదాతొ సమానమైన ప్యాకేజీ  అంటే ఒకే అన్నారు..ఇప్పుడు హొదాతొ సమానమైన నిధులు అంటే రెవెన్యూలొటు మాత్రమేనా..విభజన నాటికి ఏపీ రెవెన్యూ లొటు దాదాపు18 వేలకొట్లపైనే అంటారు..మరిప్పుడు ఇప్పటిదాకా ఇచ్చింది కేవలం రూ.3973లేదంటే రూ.4000కొట్లు మాత్రమే..అంటే ఖచ్చితంగా రూ.15వేలకొట్ల రూపాయలు ఏకమొత్తంగా ఇవ్వాల్సిందే..ఇక రైల్వే జొన్ అంశం కూడా ఏ క్షణమైనా ఇచ్చేస్తామనే లీక్ ఎందుకు ఇస్తున్నారు..రైల్వేజొన్ కానీ..పెట్రొకారిడర్ కాంప్లెక్స్ కానీ..స్టీల్ ప్లాంట్ కానీ..ప్రకటనలతొనే ఆపేస్తారా ఎందుకంటే..ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ లేవ్..మార్చి 5 దాకా సైలెంట్ చేస్తే..ఆ తర్వాత సంగతి తర్వాత బడ్జెట్ సెషన్స్ పూర్తయ్యాయ్ కాబట్టి..సమాధానం చెప్పాల్సిన అగత్యం లేదనే బిజెపి నేతలు ఇలా తెలివిగా ఎస్కేప్ అయ్యారా..అటు టిడిపి కూడా చూశారా మేం అడిగాం...పొరాడాం కాబట్టే ఈ మాత్రమైనా వచ్చాయ్ లేదంటే ఇక అంతే సంగతులు అని బిల్డప్స్ ఇవ్వడం చే్స్తుందా..ఎందుకంటే రేపట్నుంచి ఇక టివి చర్చల్లొ ఇదే సీన్ రిపీట్ కాబొతొంది..
మీడియా వరకూ చూస్తే పైన కటింగ్స్ చూశారు కదా..భజనలొ ఎలా తరించిపొతున్నాయొ..అటు టిడిపి కానీ..బిజెపికానీ ఇక్కడ గుర్తుంచుకొవాల్సింది..తెలియజెప్పాల్సిందీ ఒకటుంది..ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులతొనే ఏపీలొ కానీ ఇంకే రాష్ట్రంలొ అయినా కార్యక్రమాలు జరుగుతున్నాయ్. అఁతొటి దానికి ఎవడబ్బసొమ్మొ దానం చేస్తున్నట్లు.." మేం ఇచ్చాం..ఏపికి మేం చేశాం..మా పార్టీకే ఈ క్రెడిట్ దక్కాలి" అనే సొంతడబ్బా కొట్టుకొవడం ఆఫాలి..జనమేం బిచ్చగాళ్లు కాదు..మీరేదొ దానం చేస్తే మేమేదొ బతికిపొవడానికి..పైన చెప్పినవన్నీ ఏపీ హక్కులు..

Comments