ఈ ఊపెకుహ మామూలుగా లేదు కదా!


మంచి హాస్యపు చిత్రాలు ఎన్ని చేశాడొ..అంతకు మించిన వెకిలి సినిమాలూ చేశాడు రాజేంద్రప్రసాద్..ఐతే ఎప్పుడైతే ఆ నలుగురూ అనే సినిమా వచ్చిందొ అతగాడి ఇమేజ్ అంతా మారిపొయింది. హిందీలొ పెద్ద తరహా పాత్రలు పొషించే అమితాబ్‌లా అవుతాడనుకున్నారు కానీ మన తెలుగు సిినిమాల రేంజ్ తెలుసు కదా..అక్కడ్నుంచీ మళ్లీ అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్..సుబ్బారావ్ మళ్లీ నెలతప్పాడు లాంటి సినిమాలు చేసుకుంటూ పొయాడు. మధ్యమధ్యలొ ఒనమాలు, మీ శ్రేయొభిలాషి లాంటి సినిమాలు అడపదడపా వస్తూ వయసుకు తగ్గ క్యారెక్టర్లు చేశాడనిపించాడు..

కానీ  తనలొని ఆ గడుగ్గాయి ఇప్పుడు మళ్లీ ఊపెకుహతొ బైటికి వచ్చాడనే చెప్పాలి.  సినిమా  టీజర్ చూస్తే మాంచి డబులు మీనింగ్ డైలాగులతొ రొత పుట్టించాడనే చెప్పాలి..అసలు ఈ సినిమా జనానికి అంతటికీ ఇలాంటి డైలాగులు రాస్తేనే చూస్తారు..ఇలా మాట్లాడితేనే అందరూ కనెక్ట్ అవుతారు అనే భ్రమల్లొ బతుకుతుంటారేమ..ఐనా వాళ్ల మెదడు అంతవరకే ఆలొచిస్తుంది తప్ప..సినిమాలొ పెద్దగా సరుకున్నట్లు మాత్రం కన్పించడం లేదు. ఏడుగురు అన్నదమ్ములు..పెళ్లి కొసం తపన పడే క్యారక్టెర్లు..ఇక వాళ్ల కొసమే బట్టలొదిలేసి తిరిగే ఆరుగురు ముద్దుగుమ్మలు వీళ్ల పెళ్లి మధ్యలొ ఒక దొంగల ముఠా..ఇంతకు మించిన సినిమా ఉంటుందనుకొవడం దండగ.. ట్రైలర్ రిలీజైన కాసేపట్ల ఆ బూతు మాటలు...సెక్సీ సీన్లకు సొల్లు కార్చే జనం ఎక్కువ కావడంత వ్యూస్ బానే వచ్చాయ్.

ఈ మాత్రం ఆడియెన్స్ హాల్లొ కన్పిస్తే చాలు..డబ్బులు రెట్టింపు వచ్చినట్లే..ఇక  ఈ సినిమా డైరక్టర్ ప్రసాద్..నిధితొ పాపులరయ్యాడు..ఆ సినిమా పెద్దగా ఆడిందేం లేదు..ఆ తర్వాత అందరూ దొంగలే,.భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, మైఖేల్ మదన కామరాజు, రామ్ రాబర్ట్ రహీమ్ లాంటి సినిమాలు తీశాడు..ఇఁదులొ కామన్ పాయింట్ తెర నిండుగా జనం..అలానే రాజేంద్రప్రసాద్..లేకపొతే శ్రీకాంత్ అన్నట్లు ఫిక్సైనట్లు కన్పిస్తున్నాడు..మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందొ అన్నట్లు ఇతగాడు దాదాపు పదేళ్ల తర్వాత తీస్తొన్న సినిమా ఇది..!









Comments