శ్రీదేవి కనుక ఆ ఒక్క సినిమా చేసి ఉంటే..!



నటిగా శ్రీదేవి చేయని పాత్ర లేదని మాట వరసకు అందరూ అంటుంటారు. కానీ ఆమె చేయని..చేజార్చుకున్న పాత్రలు కూడా ఉన్నాయని కొంతమంది ఇప్పుడు చెప్తున్నారు. మరణించిన తర్వాత ప్రముఖ వ్యక్తుల గురించి కొన్ని రోజుల పాటు జ్ఞాపకాల్లో తేలియాడటం, వారి గురించిన విషయాలు కొన్ని రోజులు వార్తల్లోకి ఎక్కడం మామూలే..ఇప్పుడు శ్రీదేవికి సంబంధించిన విషయాల్లో ఒకటి అలానే తెలిసింది. శ్రీదేవి అవి హిందీ సినిమాల్లో బాగా బిజీగా ఉన్న రోజులు..అప్పటికే మిస్టర్ ఇండియా రిలీజై సూపర్ హిట్టై స్టార్ డమ్ ఎక్కడకో వెళ్లిపోయింది..తెలుగులో ఒక్క కృష్ణ పక్కన తప్ప ఇంకెవరికీ అందుబాటులో లేదు ఆ రోజుల్లో ఆమె. ఆ సమయంలో పరుచూరి బ్రదర్స్  జయం మనదేకి పని చేస్తున్నారు.

.అప్పుడే సెట్స్‌పై మాట్లాడుతుండగా..ఒక కథ చెప్పారట. అది బాగా నచ్చి ఈ కథ నాకివ్వండి నేను కమల్ హసన్ చేసుకుంటాం అని శ్రీదేవి చెప్పారట. సరే అని పరుచూరి గోపాలకృష్ణ  ఓకే చెప్పారు కానీ.. ఆ తర్వాత ఆ ప్రస్తావన రాకపోవడంతో అది కాస్తా వేరే నిర్మాత శోభన్ బాబు భానుప్రియతో చేశారు. ఐతే శోభనబాబుకి తగ్గట్లుగా మార్పులు చేశారట.

ఆ సిినిమా మీకీపాటికి గుర్తుకు వచ్చి ఉంటుంది..అదే కార్తీకపౌర్ణమి సినిమా..దానికి మాతృక నవల నల్లపూసలు..ఇది డైలీ సీరియల్‌గా వచ్చింది. మీరీ సినిమా కనుక చూసి ఉంటే..ఆ పాత్రల్లో కమల్ హసన్ శ్రీదేవి చేసి ఉంటే ఏ రేంజ్‌కి వెళ్లి ఉండేదో అంచనా వేయవచ్చు. ఆ కథని  నిర్మాత శివప్రసాదరెడ్డికి దర్శకుడు కోదండరామిరెడ్డి చెప్పడం ఒప్పించడంతో అలా పక్కదారి పట్టిపోయింది కానీ..ఆ కథని చేయలేకపోయినందుకు శ్రీదేవి చాలా ఫీలైందని పరుచూరి గోపాలకృష్ణ చెప్తుంటారు. ఇలా తన నటన ప్రదర్శించడానికి అవకాశం ఉన్న పాత్రలు ఇవ్వడం లేదని ఆమె చాలా బాధపడేదట. ఇందుకు కారణాలూ ఉన్నాయ్. జయం మనదే లాంటి సినేమాల్లో పెద్దగా ఎక్స్‌పోజింగ్ లేకుండా చేస్తే ఫ్యాన్స్ ఈ మాత్రం దానికి శ్రీదేవి ఎందుకు సుహాసినిలాంటి వాళ్లున్నారు కదా అనే కామెంట్లు వచ్చేవట..అలాంటివి విన్నతర్వాతే తాను కేవలం అందగత్తెనే కాదు మంచినటిని కూడా అని ప్రూవ్ చేసుకునేందుకే ఇలా మంచి కథలపై ఆసక్తి చూపేదని చెప్తుంటారు..ఐతే ఆ తర్వాతి కాలంలో ఖుదాగవా, ఆఖరిపోరాటం, క్షణక్షణం,చాందిని, చాల్ బాజ్ లాంటి చాలా సినిమాల్లోని పాత్రలతో తనలోని నటిని పరిపూర్ణంగా ఆవిష్కరించింది. కెరీర్ చివరిరోజుల్లో ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ తో అది పరాకాష్టకి చేరినట్లే అనుకోవాలి.మనవాళ్లకి నటులు ఎవరైనా బతికి ఉన్నప్పుడు మహానటి మహానటుడు అనడానికి చాదస్తాలు అడ్డొస్తాయ్ అందుకే ఇప్పుడు శ్రీదేవి చనిపోయింది కాబట్టి..ఇక మహానటి అని పిలవడానికి ఎవరకీ అభ్యంతరం లేదనుకుంటా..

Comments