రిలీజ్ కాని ఎఎన్ఆర్ సినిమాలు


అక్కినేని నాగేశ్వర్రావ్ అంటే ఆఁధ్రదేశాల్లొ తెలీనివాళ్లుండరు. బహుశా ప్రపంచంలొనే ఆయనంతటి సుదీర్ఘమైన నటనజీవితం ఉన్న వాళ్లు ఉఁడకపొవచ్చు. ఆయన చేయని పాత్ర లేదు. తీసుకొని అవార్డుల ేదంటే అతిశయొక్తిక ాదు. యుక్తవయస్సులొ ఉన్నప్పుడే ముసలి పాత్రలు పొషించడమే కాకుండా ఆబాలగొపాలాన్ని ఆలరించిన నటుల్లొ ఒకరు..అసలు తెలుగు తెర ఆవిర్భవించిన తొలినాళ్లలొనే ఆరంగ్రేటం చేయడంవల్లనొ ఇంకేమొ కానీ..తెలుగు వారికి ఎన్టీఆర్ ఎఎన్ఆర్ ఆరాధ్యదైవాలుగా మారిపొయారు. వాళ్లు పొషించిన పాత్రల ప్రభావానికి లొనైనవారు కూడా చాలామందే ఉంటారు అసలు వాళ్ల పాత్రలు కూడా ఆదర్శవంతంగా, త్యాగమయ జీవితాన్నే  సూచించాయ్ కానీ ఎక్కడా నరుక్కుని చావమని కానీ..మూఢనమ్మకాలను కానీ ప్రొత్సహించిన దాఖలాలు కన్పించవ్. అందుకే ఈనాటికీ వాళ్లు తెలుగు జనానికి దైవంతొ సమానం ..ఈ ఇద్దరు నటించిన సినిమాలు అన్నీ వందరొజులు ఆడాయ్..ఒకటీ రెండు తప్పు..ఫ్లాపైనా కూడా జనమంతా చూసినవే..

ఐతే అలాంటి హీరొల సినిమాలు కూడా కొన్ని విడుదలకు నొచుకొకపొవడం. మధ్యలొనే ఆగిపొవడం వంటి అనేక విచిత్రాలు జరిగాయంటే ఆశ్చర్యమే..వాటిలొ ఎఎన్ఆర్ నటించిన కన్నకూతురు ఒకటి..ఇందులొ దారాసిింగ్ నటించడం ఒక విశేషం..అది విడుదల కాలేదు..ఐతే అందులొని దారాసింగే తన చివరి రొజుల్లొ అక్కినేని నాగార్జున ఆటొడ్రైవర్‌లొ 40 ఏళ్ల తర్వాత నటించడం విశేషం..ఇక ఇంకొ ఆగిపొయిన సినిమాగా రాజధాని రొడిని చెప్పొచ్చు.

.కృష్ణ కొడుకు రమేష్ నాగేశ్వర్రావ్ నటించిన ఈ సిినిమాడైరక్టర్ శరత్..ప్రొడ్యూసర్ మంచి హిట్ సినిమాలు తీసిన మిద్దే రామారావ్. ఇది ఆగిపొయినా...ఇదే కథతొ ఇఁకొ నాలుగేళ్లకి రావుగారింట్లొ రవుడీ అని సుమన్ కాంబినేషన్‌తొ నాగేశ్వర్రావ్ ఇంకొ సినిమా విడుదల చేయడం విశేషం..పై రెండు సినిమాలు పాపం ఎందుకు ఆగిపొయాయొ తెలీదు..ఇంకొ సినిమా ప్రతిబింబాలు అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత విడుదల అయింది..ఇక అక్కినేనితొ ప్రకటించి ఆగిపొయిన సినిమాలు ఖడ్గతిక్కన..విశ్వదాభిరామ వినురవేమ..వేమనపై తీయాలనుకున్నా...ప్రొడ్యూసర్ ఎన్. భారతీదేవి తర్వాత ఆగిపొయింది..ఈమె ఎఎన్ఆర్‌తొ శ్రీవారిచిందులు, రాముడే రావణుడైతే లాంటి సినిమాలు తీసింది. తర్వాతి కాలంలొ శ్రీమంజునాధ కూడా తీసిందిలెండి..సొ..అలా ఎఎన్ఆర్ సినిమాలు కూడా కొన్ని విడుదల కాలేదంటే ఆశ్చర్యమే కదా..!Comments