NTR కిలో రెండ్రూపాయల బియ్యం స్కీమ్ వెనుక అసలు కథ ఇదీ!



ఆంధ్రుల అభిమాననటుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ అంటే తెలుగు ప్రజలకు ఒకప్పుడు ఆరాధ్యదైవం అంటే అతిశయోక్తి కాదు..అన్నగారంటే నాటికీ నేటికీ తెలుగుప్రజలకు ఎన్టీఆర్ ఒక్కరే. ఆ తర్వాత చాలామంది జనంమదిలో చోటు దక్కించుకున్నా ఎన్టీఆర్ మాత్రమే తొలిసారిగా ప్రజల మనసులో నిలిచిపోయిన రాజకీయనేత. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో జనం మెచ్చారు. ఐతే వాటిలో కొన్ని పథకాలకు మాత్రం ఆయనే బ్రాండ్ అంబాసిడర్ అన్నంతగా ప్రచారం జరిగింది కూడా..వాటిలో రూ.రెండు రూపాయలకి కిలో బియ్యం ఒకటి..ఐతే నిజంగా కిలో బియ్యం అంత తక్కువ ధరకి ఇచ్చారా..మరి అది తక్కువ ధరేనా అన్న ప్రశ్నలు ఎవర్వికీ తట్టేవి కాదు.

 ఇప్పటి ధరల ప్రకారం రెండు రూపాయలకి కిలో బియ్యం అంటే చౌకలో చౌక అనే చెప్పాలి మరి ఇదే రేటు 1983లో కూడా తక్కువ రేటేనా. ముందు ఈ స్కీమ్‌కి సంబంధించిన కొన్ని లెక్కలు చూద్దాం.. అక్షయపాత్ర పేరుతో ఎన్టీఆర్ నెలకి 25కేజీల చొప్పున రెండ్రూపాయల కిలో బియ్యం సరఫరా చేయించేవారు. దానికి పరిమితిగా వార్షికాదాయం రూ.3వేలుగా నిర్ణయించారు. ఆ తర్వాత  ఆ ఆదాయపరిమితిని రూ.6వేలకి పెంచారు. కోటి కుటుంబాలకు అలా పథకం చేరేలా చేశారని చెప్తారు. అంటే రాష్ట్రంలో ప్రతి పది కుటుంబాలలో ఏడు కుటుంబాలు ఈ పథకాన్ని వాడుకున్నాయంటారు. మరి అంతా ఈ రెండ్రూపాయల బియ్యమే తిన్నారా అంటే కాదు పైన చెప్పిన ఆదాయాలకు మించిన కుటుంబాలకు కూడా రేషన్ కార్డుల ద్వారా కేజీకి రూ.2.75 వసూలు చేసి  ఇచ్చేవారు. కానీ మరి అప్పటి మార్కెట్ రేటు చూస్తే రూ.2.46పైసలుగా తెలుస్తోంది..వాటికి చిల్లరదుకాణాల వరకూ వస్తే కిలోకి 3 రూపాయలవరకూ ఉండేదని నమ్మొచ్చు.. మరి 1983లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి కనీస జీతం ఎంతో తెలుసా..కేవలం రూ.185..మరి రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల జీతం చూస్తే..అంతకంటే కాస్త తక్కువో ఎక్కువగానో రూ.150 నుంచి 180లోపున ఉండేది. అంటే వాళ్ల జీతంలో కనీసం ఒక శాతానికి పైగానే ఖర్చు పెడితే కానీ..కిలో బియ్యం వచ్చేవి కాదన్నమాట. అలా నెలకి కనీసం ఓ ఐదు కేజీలు కొనుగోలు చేయాలన్నా కూడా పదిరూపాయలు సులభంగా ఖర్చైపోతాయ్. ఇది నెలవారీగా ఆదాయం పొందేవారి లెక్కలు..మరి ఇలా ఉద్యోగం సద్యోగం లేకుండా ఏ కూలిపనో చేసుకునేవారి పరిస్థితి ఏంటి..వాళ్లూ ఈ పథకాన్ని వాడేసుకునేవారు ఎలాగంటే..తమ కార్డులపై పాతిక కేజీలూ కొనుగోలు చేసి బైట మార్కెట్లో మూడు రూపాయలకో..ఐదురూపాయలకో అమ్ముకునేవాళ్లు ..అలా ఈ పథకం అవసరం ఉన్నవాళ్లకీ లేనివాళ్లకీ కూడా బాగా ఉపయోగపడింది. బంపర్ సక్సెస్ అయింది. కానీ అక్షయపాత్ర ప్రారంభించిన రెండో ఏడాదిలోనే జనం తాకిడి తట్టుకోలేక ప్రభుత్వం ఆర్ధిక కష్టాల్లో పడిందట. ఇది అప్పటి పేపర్లు చూస్తే తెలుస్తుంది..స్కీమ్ రేటు పెంచమనీ ఎన్టీఆర్‌పై ఒత్తిళ్లు వచ్చాయట. ఐనా ఆయన ఆ పని చేయలేదు..కానీ తర్వాతికాలంలో పాతిక కేజీలనుంచి 12కేజీలకు పరిమితి తగ్గించారని అంటారు. సో..అలా కిలో బియ్యం రెండ్రూపాయలకే ఇచ్చాం ..అది చరిత్రలోనే అంత తక్కువరేటు అని ఢంబాలు పలకడం వెనుక వాస్తవం ఇదీ..! ఇంకా ఎన్టీఆర్ ఈ పథకం ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి వారుణివాహిని పేరుతో రూపాయికి సారాయి పొట్లాలు అమ్మిన చరిత్ర కూడా ఉంది..అలాంటి అంశాల గురించి తర్వాతి స్టోరీల్లో చెప్పుకుందాం..ఇక ఆ తర్వాతి కాలంలో మళ్లీ ఎన్టీఆర్ 1994లో పదవి చేపట్టడం అప్పుడూ రెండ్రూపాయల స్కీమ్ తీసుకురావడం..అది కాంగ్రెస్ వాళ్లు రద్దు చేయడం జరిగింది..తిరిగి చంద్రబాబునాయుడు హయాం ప్రారంభమైనా దాన్ని పట్టించుకోలేదు..2008లో వైఎస్ తిరిగి ఆ పథకాన్ని రివైర్ చేయడం విశేషం..ఇంకా విభజనకి ముందు సిఎం కుర్చీ దక్కించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఏకంగా రూపాయికే కేజీ బియ్యం పథకం ప్రవేశపెట్టారు..దాంతో ఆర్ధికంగా రూ.600కోట్లవరకూ భారం పడిందన్నారు..ఐతే కాలక్రమంలో ఈ స్కీమ్‍ గత భుజకీర్తులకు గుర్తుగా భజన చేసుకోవడానికే తప్ప..ఎవరూ పట్టించుకోవడం లేదు


Comments