రూ.10కే జియో డిటిహెచ్ వెనుక అసలు నిజం ఇదే


జియో ఫోన్ లేదంటే డైరక్ట్ టు హోమ్ ద్వారా కేవలం పదిరూపాయలకే టివిఛానళ్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కొన్ని రోజులుగా ఓ ఎస్ఎంఎస్ హడావుడి చేస్తోంది. దీంతో చాలామంది ఈ ఆఫర్ వస్తే బావుండని కోరుకున్నారు. కానీ అందులో వాస్తవం ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో అప్పటిదాకా ఉన్న లెక్కలన్నీ మారిపోయాయ్. ఇంటర్నెట్ వాడకం మొబైల్ ఫోన్స్‌లో పెద్దగా లేదు. కానీ జియో రాకతో ఈ వాడకం అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉన్నవాళ్లలో ఇంటర్నెట్ వాడని
వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత జియో డిటిహెచ్ రంగంలోకి వస్తుందని ప్రచారం జరిగింది. దీన్ని ఆసరగా తీసుకునే కొంతమంది మోసగాళ్లు బయలుదేరారు. జియో డిటిహెచ్ కావాలా.. ఫ్రీ ఛానళ్లన్నీ కేవలం పది రూపాయలకే అంటూ ప్రచారం లేవదీశారు. ఇందుకోసం సదరు వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ డీటైల్స్ ఇవ్వాలంటూ నమ్మబలుకుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకంగా వారి దగ్గర వివరాలు తస్కరించి వాళ్ల ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు. ఈ మోసాల కోసం ముందుగా ఎస్ఎంఎస్ పంపి అందులోని లింక్ క్లిక్ చేయమని అడుగుతారు. అందులో ఎస్ఎంఎస్ ఇలా ఉంటుంది. జియో ఫోన్ మరియు డిటిహెచ్ కేవలం పదిరూపాయలకే ఇది కూడా లైఫ్ టైమ్ ..ఈ అవకాశం ముందుగా వచ్చిన 1000 కస్టమర్లకే పరిమితం అంటూ ఊరిస్తుంది.  ఇది చూసిన ఎవరైనా వెంటనే దాన్ని క్లిక్ చేస్తారు.  ఆ లింక్ యుఆర్ఎల్ జియోడివైజెస్ డాట్ ఆన్ లైన్(
Jiodevices.online) అనే సైట్‌కి తీసుకెళ్తుంది.
అది అచ్చంగా ఒరిజినల్ జియో సైట్లలానే డిజైన్ చేసి ఉండటంతో ఎవరూ అనుమానించరు. అక్కడ సదరు ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి క్లిక్ బటన్ ప్రెస్ చేయమని సూచిస్తుంది. అది జరగగానే..ఆ తర్వాత  సీక్రెట్ గా ఉంచాల్సిన పేరు, డేట్ ఆఫ్ బర్త్ ,  క్రెడిట్ కార్డ్ నంబర్స్, పిన్ నంబర్, సివివి నంబర్లు కూడా పొందుపరచమని అడుగుతుంది. దీంతో ఈ వివరాలు అందజేసిన కస్టమర్ల ఖాతాలు ప్రమాదంలో పడిపోతాయ్. 
పోనీ పేమెంట్ బటన్ క్లిక్ చేద్దామనుకున్నా..అది పని చేయదు..అక్కడే ఎర్రర్ మెసేజ్ వస్తుంది. అంటే వారికి కావాల్సిన వివరాలు వారికి అందుకున్న తర్వాత ఇక మీరిచ్చే పదిరూపాయల పేమెంట్ తో వారికి అవసరం ఏముంది.  ఇందులో ప్రమాదం ఏముంది మనకో ఓటిపి వస్తుంది కదా..పేమెంట్ కోసమని..అది మనకి ఒక్కళ్లకే కదా వచ్చేది కాబట్టి సేఫ్ అని ఎంతమాత్రం అనుకోవద్దు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్ పిన్ నంబర్స్ సివివితో సహా తెలిసిపోయినప్పుడు ఇక మోసగాళ్లకి మీ ఓటిపిని బైపాస్ చేయడం పెద్ద విషయమేం కాదు. మొబైల్ నంబర్ మార్చేసి..ఓటిపీని వారి మొబైల్ నంబర్‌కి జత చేసుకుంటారు. అన్నింటికన్నా వాస్తవం రిలయన్స్ జియో డిటిహెచ్ సర్వీసు ఇంకా ప్రారంభించలేదు. జియో ఫోన్ ద్వారానే ఈ సేవలు ప్రస్తుతానికి పాక్షికంగా అందుతున్నాయ్. అదీ కాకుండా ఈ సైట్ కేవలం ఎస్ఎంఎస్‌లో ఇచ్చిన లింక్స్ ద్వారానే ఓపెన్ అవుతుంది..మనకి మనంగా ఇంటర్నెట్‌లో ఓపెన్ చేయాలని చూస్తే తెరుచుకోదు. ఇది నిజమైన సైటే  అయితే అలా జరగదు కదా.. అసలు ఒక సురక్షితమైన సైటుకి ఉండాల్సిన లక్షణమైన Https సెక్యూరిటీ ఫీచర్ ఈ జియోడివైజెస్ డాట్ ఆన్‌లైన్ కి లేదు. కాబట్టి ఇక్కడ వివరాలు జోడించిన వారి ఖాతాలు పూర్తిగా ప్రమాదంలో ఉన్నట్లే కాబట్టి ఎవరైనా జియో డిటిహెచ్ పదిరూపాయలకే వస్తుందంటే నమ్మవద్దు. ఇప్పటికే ఎవరైనా ఈ దొంగసైట్లో వివరాలు నమోదు చేసి ఉంటే. వెంటనే మీ మీ ఆన్ లైన్ ఖాతాల పాస్ వర్డ్స్ మార్చుకోండి..అనుమానించదగిన లావాదేవీలు చోటు చేసుకుని ఉంటే, సంబంధితశాఖలకు కంప్లైంట్ చేయండి

Comments

  1. మంచి సమాచారం. ధన్యవాదాలు!!!
    అందరూ చదవండి, "రూ.10కే జియో డిటిహెచ్" అంటూ ఎవరికైనా ఎలాంటి ఆఫర్ వచ్చినా జాగ్రత్త. నమ్మకండి!

    ReplyDelete

Post a Comment