ఈ చాయ్‌వాలా చాలా స్ట్రాంగ్ గురూ..నెలకి 12లక్షల సంపాదన


దేశంలో మంచినీళ్లు ఎలాగైతే తాగుతారో..టీ చుక్క లేనిదే పూట మొదలుపెట్టని జీవులు కూడా కొన్ని ఉంటాయ్. అయితే ఇలాంటి టీ స్టాల్స్ ఎంత రాబడి తెచ్చినా..వాటిపై కొద్దిగా చీప్ లుక్ ఉంది. కానీ పుణెలో నవ్ నాధ్ ఏవ్లే అనే వ్యక్తి  మాత్రం తన సంపాదనతో  అందరి నోళ్లూ తెరిచేలా చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్లో ఓ రేంజ్ వాళ్లే సాధించగలే స్థాయి ఆదాయం తెచ్చుకుంటున్నాడు. ఏకంగా నెలకు రూ.12లక్షలు చాయ్ అమ్మి వెనకేసుకుంటున్నాడు

అసలు మామూలుగా రోజూ టీ అమ్మి సంపాదించడం అంటే రోజుకో రెండువేల రూపాయలంటే ఎక్కువ. కానీ నవ్ నాధ్ ఎలా ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడో తెలుసుకుందాం.  2011లో పూణెలో చెట్టుకింద టీస్టాల్ గా ప్రారంభించాడు. అక్కడ్నుంచే అసలు జనానికి ఎలాంటి టీ అంటే ఇష్టం..అవి ఎన్నిరకాలుగా చేయొచ్చు అనే విషయంపై పరిశోధించాడట. మహారాష్ట్రంలో రోహిత్ వాడేవాలా అనే బ్రాండ్ బాగా అమ్ముడుపోతోందట. పూణే వాసులకు అది పరిచయం చేశాడు నవ్ నాధ్..అంతే..ఇక పూణేజనం రోహిత్ వాడేవాలా బ్రాండ్ కి దాసోహం అయిపోయారట. అక్కడ్నుంచి ఇక నవ్ నాధ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు రోజుకు మనోడి టీ స్టాల్‌లో 3వేల నుంచి 4వేల కప్పుల టీ సేలవుతోందట. దీంతో రానున్న రోజుల్లో మరో రెండు చాయ్ దుకాణాలు
ఓపెన్ చేయబోతున్నాడు. ఐతే మనోడి టార్గెట్ ఈ రెండు స్టాల్సే కాదు..దేశం మొత్తంగా తన టీ స్టాల్స్‌ని విస్తరించే వ్యూహం ఉందట..ఇక తన టీ స్టాళ్లకి ఎందుకింత ఆదరణ అంటే..తన కస్టమర్లకు బిపి,షుగర్ లాంటి వ్యాధులను దృష్టిలో పెట్టుకుని టీ తయారు చేస్తాం అంటాడు. నవ్‌నాధ్ స్టోరీ చూసిన తర్వాత ఇంకెవరైనా చాయ్ దుకాణాలను చీప్ గా చూస్తారా.

Comments