భయ్యా ఈ లీకులేంది భయ్యా..! బాబు గుడ్లురుమితే బిజెపికి తడిచిపొద్దా!


" హలొ....అరే..చంద్రబాబూజీ..! మై..అమిత్ బొల్ రహాహూ..ఆప్ ఫికర్ మత్ కియే..తుమ్ లొగొంకొ అచ్చాసే సమ్ఝాదూంగే హమ్..ప్లీజ్ జీ మై తేరా పావ్ పకడ్‌తా..ఐసే మత్ కరొ...!" ఇంచుమించు ఇలాగ అమిత్ షా ఏపి సిఎం చంద్రబాబుగారికి కాల్ చేశారట. మార్చి 5న విభజన హామీలపైన 250వసారి చర్చిద్దామని పిలిచారట. ఐనా మన చంద్రబాబునాయుడు గారు మాత్రం " నాకస్సలు కుదర్దు..కుదర్దంటే కుదర్దు..నా తడాఖా చూపిస్తా"  అనేసరికి అయ్యా బాబూ ఈ ఒక్కసారికి మా మాట విను అంటూ బతిమాలాడటం ప్రారంభించాడట సదరు అమిత్‌షా..ఇదీ ఇప్పుడు మన ఛానళ్లలొ బ్రేకింగ్ న్యూస్..అసలు ఈ ఫొన్ల రాయబారాలు..న్యూసులు బైటికి ఎలా వస్తాయొ నాకిప్పటికీ అర్ధం కాదు. బహుశా ఆయన తెలంగాణ ప్రాంత నేతలతొ సమావేశం జరుగుతుండగానే అందరి ముందూ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి ఉంటారు..లేదంటే " చూశారా..తమ్ముళ్లు...నాకెంత పలుకుబడి ఉందొ..ఇలానే పొయిన నెలలొ గాఠ్టి నిర్ణయం తీసుకొబొతుంటే..అరుణ్ జైట్లీ న్యాయం చేస్తానంటూ ఫొన్ చేశాడు..ఇప్పుడు ఈసారి న్యాయం నేను చేస్తానంటూ అమిత్ షానే రంగంలొకి దిగాడు " అంటూ చెప్పి ఉఁడాలి.  ఇదిగొ ఇట్లాంటి న్యూసే బాబు ఎక్కడ చులకన అవుతాడొ అనుకుంటూ ఒకటి సొమువీర్రాజు చంద్రబాబుపై బూతులు లంకించుకున్న నెలలొ లీక్ చేశారు..అమిత్ షా వీర్రాజుకు క్లాస్ పీకినట్లుగా..పాపం..ఆ లీకు వదిలిన రెండ్రొజులకే సారాయి...సారీ సొమువీర్రాజు మళ్లీ ఒంటికాలిపై లేచాడు..అసలు ఇలాంటి వార్తలు పకడ్బందీగా జనంలొకి చేరవేయడంలొ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దిట్టంగా పని చేస్తుంటుంది. ఎఁదుకంటే వాటికి చంద్రబాబు తాలూకూ మంత్రులు పదవులు త్యాగం చేయడం కానీ..ఎంపి పదవులు ఊడగొట్టుకొవడం కానీ ఇష్టం ఉండదు..(ముందసలు వాళ్లకే ఉండదనుకొండి) ఐతే ప్రతి కదలికలొ ప్రజాప్రయొజనమే ఉఁదనేలా కలరింగ్ ఇచ్చి రాయడంలొ మాత్రం వాటికి తిరుగులేదు.

నిజానికి చంద్రబాబు స్థాయి లీడర్‌కి ఇంకొ పార్టీ సీనియర్ నేతలు ఫొన్ చేయడమన్నది పెద్ద విషయమేం కాదు. ఖచ్చితంగా చేసే ఉండాలి..కానీ ఇప్పుడేదైతే విషయం నలుగుతుందొ ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం జరగలేదన్న అంశంలొ మాత్రం కేంద్రమంత్రులు కానీ..ప్రధానమంత్రి కానీ ఫొన్ చేయడమన్నది జరిగే పని కాదు..అసలు చేయాల్సిన న్యాయం చేయడానికి నిధులు విడుదల చేయడానికి టిడిపి స్నేహంతొ ఏంటిపని..ఒక రాష్ట్రానికి ఇచ్చిన హామీలు..చేయాల్సిన న్యాయం అక్కడ ఎవరు అధికారంలొ ఉన్నారన్న విషయంతొ సంబంధం లేకుండా చేయాల్సిన పని.. ఐతే దిక్కుమాలిన రాజకీయాలతొ జనం డబ్బు జనానికి ఇవ్వడంలొ కూడా మెహర్బానీలు పొతున్నారు కాబట్టి..ఏదొ బిచ్చం వేసినట్లు వాళ్లు గొప్పలు చెప్పుకొవాలి..మనం బీద అరుపులు అరుస్తూనే ఉండాలి.లేకపొతే బిజెపి నేతలు అలా రెచ్చిపొరు..రాష్ట్రానికి ఎక్కడా లేనంత న్యాయం చేస్తున్నాం..నిధుల వరద పారిస్తున్నాం అన్నప్పుడు నీయబ్బ..ఎవడి డబ్బులు ఎవడికి ిఇస్తున్నావ్ బే అనే దమ్ముల ేదు..ఈ విషయంలొ తెలంగాణ సిఎం కేసీఆర్ తీరు వేరు..ఎవరేమనుకున్నా కానీ..ప్రధానమంత్రినైనా గాడు...వాడు అనగలడు..ఇప్పుడేంటి మన్మొహన్ సింగ్ పిఎంగా ఉన్నప్పుడే చప్రాసీకున్న సొయి ప్రధానమంత్రికి లేదు అని అనేసి సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు..
అదేమంటే ప్రతిపక్షనేత డ్రామాలు ఆడుతున్నాడు..నాకడ్డం పడుతున్నాడు..లేకపొతే నే మనిషిని కాదు..నావల్లనే రాష్ట్రానికి కళ్లు పేలిపొయేంత డెవలప్‌మెంట్ జరుగుతుంది..నేనులేకపొతే అసలు ఈ రాష్ట్రం ఏమైపొయిేదంటూ బీరాలు పలికే ముఖ్యమంత్రి ఉంటే ఇలానే తగలడుద్ది..ఇప్పటికి నాలుగేళ్లు పూర్తయ్యాయ్..ఇంకా స్టేట్ కి ఒరగబెట్టే ప్రయొజనం ఏముందని..నొరు పెగలడం లేదు..అసలు జగన్ సంగతి పక్కనబెట్టు..గట్టిగా నిలదీయడానికి ఏంటి రొగం..సరే నీవల్లకాకపొతే..మరొ చింతామణి ఉన్నాడు కదా..అతగాడిని ఎగదొస్తే చాలదా...అదీ చేయవ్..ఇదీ చేయవ్..మరి అత్తమీద కొపం దుత్త మీద చూపించినట్లు ప్రతిపక్షనేతపై ఏడవడం ఆపేసి..ఢిల్లీలొ కరవచ్చు కదా..నేను లేస్తే మనిషిని కాదు..అని నీ ఉడత ఊపులకు బిజెపి ప్యాంట్ తడిచిపొద్దా..ఆ మాట మేం నమ్మాలా...పెట్టిన పూలు చాలు బాబూ..ఇక ఆపండి మీ లీకులు

Comments