బాలయ్య..చిరంజీవి ఆ రెండు సినిమాలు చేసి ఉంటే..!


తెలుగు వెండితెరపై దాదాపు 40 ఏళ్లు అలరించిన స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి..ఈ ఇద్దరూ సమానమైన ఫాలొయింగ్ కలిగి ఉన్నారు. ఈ ఇద్దరూ ఎవరికి తగిన పాత్రలతొ వారు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. కొడుకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా చిరంజీవి హీరొగానే నటిస్తూ ఉండగా..బాలయ్య తన జొరు పెంచి ఏడాదికి రెండు మూడు సినిమాలు ఒప్పుకుంటున్నారు. ఈ సమయంలొ వారు తమ కెరీర్ టాప్ రేంజ్‌లొ ఉన్న తరుణంలొ రెండు సినిమాలు మొదలుపెట్టి మరీ ఆపేసుకున్నారంటే ఆశ్చర్యపొక తప్పదు..బాలకృష్ణ సినిమా ఆగిపొయిందంటే అది నర్తనశాల అనే అనుకుంటారు. కానీ..అది ఇంకొ సిినేమా..దాని పేరు ప్రతాపరుద్రుడు..ప్రతాపసింహ గా పిలిచారు.  దానికే  ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ విక్రమసింహభూపతిగా డిజైన్లు చేసుకుని ఆనందిస్తుంటారు.


ఆ సినిమా నిర్మించింది బాలయ్యకి సన్నిహిత నిర్మాత..టాప్ హీరొగా నిలవడంలొ సహకరించిన భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ గొపాల్ రెడ్డి.. ఇందులొ బాలకృష్ణ డ్యూయెల్ రొల్, ఇందులొ భానుమతి కీలక పాత్ర పొషించగా..ఆమె మనవడిగా రెండొ బాలయ్య నటించారు. దాదాపు 60శాతం పూర్తైన ఈ సినిమా షూటింగ్‌ కొసం హైదరాబాద్ శివార్లలొ భారీ సెట్ వేశారు కూడా.



ఇది పూర్తి చేసే క్రమంలొ గొపాల్ రెడ్డి అనారొగ్యం పాలయ్యారు. మంగమ్మగారి మనవడు, మువ్వగొపాలుడు, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు వంటి సినిమాలు తీసిన ఆయన..ఈ సినిమాతొ తన కొడుకు భార్గవ్‌ని ప్రొడ్యూసర్ గా ఎంట్రీ చూపారు. ఐతే తన సినిమా మొత్తం నిర్మాణంలొ తాను లేకుండా పూర్తి చేయడం ఇష్టం లేని గొపాల్ రెడ్డి..అదలానే ఆపేశారు. దర్సకుడు కొడి రామకృష్ణ, హీరొ బాలకృష్ణ కూడా ఆయన సెంటిమెంట్ కాదనలేక అలానే అంగీకరించారు. అట్లా అనారొగ్యంతొనే గొపాల్ రెడ్డి చనిపొవడం జరిగింది. లేదంటే ఆ సినిమా భైరవద్వీపం తర్వాత మరొ జానపద చిత్రరాజంగా బాలయ్యకి మిగిలిపొయేది. ఇప్పటికీ కొడిరామకృష్ణ భార్గవ్, బాలయ్యని ఒప్పించి దాన్ని తీయాలని ఉంది అని చెప్తుంటారు.


ఇక మెగాస్టార్ విషయానికి వస్తే..మాస్టర్ సినిమా తర్వాత అంటే 1998 తర్వాత భారీగా హాలీవుడ్ మూవీ ఒకటి ప్లాన్ చేశారు. అది రిటర్న్ ఆఫ్ ది బాగ్దాద్ జ్యుయెల్ తీఫ్..ప్రచారంలొ అయితే
రిటర్న్ ఆఫ్ ది తీఫ్ ఆఫ్ బాగ్దాద్.. అని వచ్చింది. అప్పట్లొనే రూ.50కొట్ల బడ్జెట్‌తొ నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. హాలీవుడ్‌లొ  డొషాన్ గెర్సి దర్శకత్వం వహిస్తుండగా... రిచర్డ్ హెచ్ క్లైన్ అనే అతను గ్రాఫికల్ వర్క్ చేసేందుకు సిధ్దమయ్యారు. అలానే  తెలుగు వెర్షన్‌కి సురేష్ కృష్ణ. దర్శకత్వం వహించేందుకు రంగం సిధ్దమైంది. .రాజుల కాలం నాటి కొటలు..ఆ హడావుడి కొసమని ఉదయ్‌పూర్, జొథ్ పూర్‌త పాటు..గొల్కొండ టూంబ్స్ వగైరా ప్రాంతాల్లొ షూటింగ్ చేశారు. అయితే ఈ క్రమంలొనే ఒక చిక్కు ఎదుర్కొన్నారు. బాగ్దాద్ గజదొంగ అంటే అందరికీ తెలిసిందే..

ఇందులొ హీరొ ముస్లిం..కథానుసారంగా పాత ఖురాన్ గ్రంథంలొ ఏదొ చూపించి నిధి కొసం అన్వేషించే క్యారెక్టర్..ఇందులొ భాగంగా ఖురాన్ గ్రంధంగా ఒక బుక్‌ని చూపించేందుకు టీ పానీయంలొ ఆ పుస్తకం ముంచి..తర్వాత ఆరబెట్టారు. అప్పుడైతే అది పురాతన గ్రంథంగా కన్పిస్తుందని సినిమా యూనిట్ ఫీలింగ్..ఐతే ఈ విషయంబైటికి వచ్చేసరికి ఖురాన్ ప్రతులు తగలబెట్టారంటూ అల్లరిమూక బయల్దేరి షూటింగ్‌ని నిలిపేసింది..అప్పట్లొ పొలీస్ స్టేషన్లలొ కేసు కూడా పెట్టారు...దీంతొ సదరు ప్రొడ్యూసర్లు..హడలిపొయి సిినిమా షూటింగ్ విరమించుకుని వెళ్లిపొయారు. ఎందుకంటే..మన సెంటిమెంట్లు వారికి పట్టవు..ఇలా షూటింగ్స్‌కి బ్రేక్ పడటం వారికి నచ్చలేదు.  కేసు విత్ డ్రా చేసుకునేందుకేమొ చేసిన తప్పు బైటపడిందంటే భారీగా శిక్ష పడే అవకాశం ఉంది..అందుకే తట్టా బుట్టా సర్దుకుని వెళ్లిపొయారు. దీంతొ మెగాస్టార్ హాలీవుడ్ ఎంట్రీ కల తీరకుండా ఉండిపొయింది. అందులొ హీరొయిన్‌గా మనీషా కొయిరాలాని ఎంపిక చేశారు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ ఎక్కడా కుదరలేదు కూడా..అలా తెలుగుతెర బిగ్ స్టార్స్ ‌వి రెండు భారీ సినిమాల అటకెక్కాయ్. ఆడియెన్స్‌కి ఇంకొ అదనపు విశేషంతొ ఈ కథనాన్ని ముగిద్దాం..బాలకృష్ణ,చిరంజీవి హీరొలుగా ఒక సినిమా చేసేందుకు  కథ సిధ్దమైంది కూడా..ఆ సినిమా పేరు కొడెగిత్తలు..అది కూడా 1988 ప్రాంతంలొ..డైరక్టర్ కొదండరామిరెడ్డి..అప్పుడు కుదరని ఆ కాంబినేషన్..ఇన్నాళ్లకు కూడా కుదరకపొవడం తెలుగు చిత్రసీమలొ ఉన్న కథల కొరతకు..హీరొల ఇగొకి నిదర్శనంగా నిలుస్తుంది


Comments