అమితాబ్ జబ్బు తిరగబెట్టింది ఎందుకొ తెలుసా..ఎన్నిసార్లు ఇలా గాయపడ్డాడొ తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు


అమితాబ్ బచ్చన్ ఆరోగ్యానికి ఏమైంది...ఎందుకిలా తరచుగా అనారోగ్యం బారినపడుతున్నారు. ఇవీ ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ని కలవరపరిచే ప్రశ్నలు. .మళ్లీ షూటింగ్స్ కి హాజరవుతున్నారు కానీ  ప్రతి ఏటా ఏదోక జబ్బు పాలవడం ఆందోళన
కలిగించే అంశమే. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ షూటింగ్‌లో ఉన్న అమితాబ్ అకస్మాత్తుగా అనారోగ్యం పాలయ్యాడంటూ వార్తలు రావడం వైద్యులు చికిత్స చేయడం వెంట వెంటనే జరిగిపోయాయ్. ఐతే అంతే త్వరగా కోలుకోవడం మాత్రం బిగ్ బికే సాధ్యమని చెప్పాలి.  ఇదే సినిమా చిత్రీకరణలోనే అమితాబ్ పక్కటెముకలు ఫ్రాక్చర్ అయ్యాయి కూడా..అప్పట్నుంచే తిరిగి ఆయన పాత నొప్పులన్నీ బాధించడం ప్రారంభించాయట. దానికి తోడు భారీ కాస్ట్యూమ్స్ కూడా ఆయన నొప్పులని ఎక్కువ చేశాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇవేవీ కాకుండా గత ముఫ్పై ఏళ్లనుంచీ అమితాబ్ టిబి వ్యాధితో బాధపడ్డారని చెప్తుంటారు. ఇన్ని వ్యాధులు ఉన్నా కూడా ఏకధాటిగా నటించడం ఆయనకే సాధ్యం..ఇప్పటిదాకా అంటే కుదిరింది కానీ ఇకపై ఇలా అవిశ్రాంతంగా పని చేయడం సాధ్యం కాదని డాక్టర్లు అమితాబ్‌కి చెప్పేశారు. కొన్నేళ్ల క్రితమే అమితాబ్ కి నివారించలేని హెపటైటిస్ బి కూడా సోకింది. ఐనా ఆయన ఎక్కడా ఆ విషయంపై పబ్లిక్ గా స్పందించింది లేదు. హెపటైటిస్ బి నివారణ కోసం ప్రభుత్వం ప్రచార కార్యక్రమాలు రూపొందించిన సమయంలోనే దాన్ని బైటపెట్టారాయన. ఐతే దీనికి అసలు కారణం మాత్రం 1982లో జరిగిన ఓ ప్రమాదమే. కూలీ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్ బచ్చన్ బాగా గాయపడ్డాడని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ అప్పుడు ఏం జరిగిందో చూడండి. కూలీ సినిమా లో విలన్‌గా పునీత్ ఇస్సార్ నటించగా..వీరిద్దరి మధ్యా ఓ ఫైటింగ్ సీన్ చిత్రీకరిస్తున్నారు. అప్పుడు సన్నివేశంలో భాగంగా అమితాబ్ బచ్చన్ ఓ టేబుల్ పై పడి.. ఆ తర్వాత కిందపడాలి..కానీ టేబుల్‌పై పడిన సమయంలోనే ఆ బల్ల అంచు చెక్క విరిగి అమితాబ్ శరీరంలో దిగబడింది. అది కూడా కాలేయం ఉన్న ప్రదేశంలో కావడంతో వెంటనే శరీరమంతా విషతుల్యం అయిపోయింది. క్లోమ అవయవంలో కొంత భాగం తొలగించాల్సి వచ్చింది. ఆ సర్జరీ జరిగిన కొన్ని నెలల పాటు అమితాబ్ బచ్చన్ హాస్పటల్ బెడ్‌పైనే ఉండాల్సి వచ్చింది. ఓ దశలో కోమాలోకి కూడా వెళ్లాడంటారు. అలా పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డ అమితాబ్ ఆ గాయంవల్లనే మయస్థీనియా గ్రేవిస్ అనే జబ్బు బారిన పడ్డాడు. అదే ఆయన్ని మానసికంగా, శారీరకంగా బాగా కుంగదీసిందని చెప్తారు. కొన్నాళ్లు సినిమాలకూ దూరమయ్యాడు. రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఆ వైపూ దృష్టి మళ్లించినా..తిరిగి 1988లో రీ ఎంట్రీ ఇచ్చాడు. షహెన్షా సినిమాతో ఘనంగా పునరాగమనం చాటాడు. ఐతే ఆ తర్వాతా  భరించలేనంత వెన్నునొప్పి సహా అనేక శారీరక రుగ్మతలు భాదిస్తున్నా షూటింగ్స్‌లో పాల్గొంటూ వచ్చారు. ఏ పాత్ర పోషించినా తిరుగులేని ముద్ర వేసారు..కానీ ఇప్పుడు వయసు మీదపడటంతో అమితాబ్ అనివార్యంగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తోంది. అందుకే ఈ మధ్య ఇజ్రాయిల్ ప్రధాని ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు ఆయనతో అప్పాయింట్ మెంట్ ఉన్నా..కలవడం కుదరలేదని చెప్తారు. ఐతే ఎంత అనారోగ్యం ఉన్నా..ఎక్కడా తన నిర్మాతలకు నష్టం కలిగించకుండా..ఒక్క వివాదంలోనూ ఇరుక్కోకుండా సుదీర్ఘమైన నటప్రస్థానం సాగించడం బిగ్‌బికే చెల్లిందనుకోవాలి

Comments