ఇర్ఫాన్ ఖాన్ చివరి రోజుల్లో ఉన్నాడా..అతని జబ్బేంటో చెప్పేశాడు


హిందీ చిత్రసీమలో విలక్షణ నటులకు కొదవ లేదు. ఈ తరంలో అలాంటి నటులలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. ఎక్కువగా వివాదాల పాలు కాని ఈ నటుడు ప్రాణాంతకమైన జబ్బుతో బాధపడుతున్నాడని తెలిసిందే. ఐతే ఆ వ్యాధి గురించే తాను అమెరికా వెళ్తున్నానని..ఈలోపు ఎవరూ అతిగా ఆలోచించవద్దని విజ్ఞప్తి చేశాడాయన. ఇప్పుడు ఆయనే స్వయంగా తనకి న్యూరో ఎండోక్రైన్ క్యాన్సర్ సోకిందని చెప్పాడు. దీంతో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానించేవారు కూడా విషాదంలో మునిగిపోయారు. ఈ మద్యనే చిత్రవిమర్శకుడు సంధూ కూడా ఇర్ఫాన్ ఖాన్ కోలుకోవడం కష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. న్యూరో ఎండోక్రైన్ అంటే మెదడుకి మాత్రమే సంబంధించినది కాదు..హార్మోన్లను స్రవించే వ్యవస్థ కూడా అలాంటి జబ్బు సోకడంతో మంచి వైద్యంకోసం ప్రస్తుతం అమెరికాలో ఇర్ఫాన్ ఖాన్ ఉన్నాడు. బాడీ అంతా ఈ వ్యాధి వ్యాపిస్తుందని..ఆయనే చెప్పాడు..కాబట్టి ఇర్ఫాన్ ఖాన్ రోజులు లెక్కపెట్టుకుంటున్నాడనే వాళ్లు ఉన్నారు. ఐతే వైద్యశాస్త్రం అభివృధ్ది చెందిన తీరు చూస్తే..ఏ వ్యాధినీ నిర్మూలించకుండా ఉండదు..అలానే ఇర్ఫాన్ కూడా తన జబ్బుని జయించాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆయన భార్య, స్నేహితులు కూడా గుర్తు చేస్తున్నారు. ఇర్ఫాన్ మాత్రం నిబ్బరంగా తనకి చివరిరోజుల్లో అందరి మద్దతు కావాలని..తన కోసం భగవంతుడిని ప్రార్థించమని చెప్తున్నాడు. ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఒకటి మనసులను కదలిస్తోంది.. మనం కోరిందే జీవితం ఎప్పుడూ ఇవ్వదు..అలానే జరిగే ప్రతి సంఘటనకి జీవితం బాధ్యత వహించదు అంటూ విత్ ది విండ్ అనే ప్రఖ్యాత నవలలోని ఓ వ్యాక్యాన్ని కోట్ చేశారాయన. ఇందుకు తోడు తానింక ఎక్కువ రోజులు ఉండననే విషయాన్ని నమ్మడానికి మనసు అంగీకరించడం లేదని కూడా ఇర్ఫాన్ చెప్పడం ఆవేదనకు గురి చేసేదే..ఐతే నా గురించి ఆలోచించేవాళ్ల కోసం తిరిగి వస్తానని ఆశిస్తున్నా ఇర్ఫాన్ చెప్పడం కాస్త ఆశ కలిగించే విషయం
 ఇర్ఫాన్ ఖాన్ నటజీవితం విషయానికి వస్తే..నాటకరంగంనుంచి వచ్చిన ఇర్ఫాన్ సలాంబాంబే మూవీతో వెండితెర ప్రేక్షకులను అలరించడం ప్రారంభమైంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో విద్యాభ్యాసం కూడా చేసిన ఇర్ఫాన్..చాణక్య , భారత్ ఏక్ ఖోజ్ వంటి టివి సీరియళ్లతో బిగ్ స్క్రీన్‌పై ఎంట్రీకి ముందే పేరు తెచ్చుకున్నాడు. అలానే స్టార్ ప్లస్‌లో స్టార్ బెస్ట్ సెల్లర్స్ అనే కార్యక్రమం కూడా చేశాడాయన.. ముందు చెప్పుకున్న సలాంబాంబే అకాడమీ అవార్డు వరకూ వెళ్లినా ఇర్ఫాన్ రోల్ మాత్రం సినిమానుంచి ఎడిట్ చేశారు. ఎక్ డాక్టర్ కీ మౌత్, సచ్ ఏ లాంగ్ జర్నీ లాంటి సినిమాల్లో నటించినా..సక్సెస్ మాత్రం దక్కలేదాయనకు. ది వారియర్ అనే సినిమానే అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించిన తర్వాతే ఈ నటుడికి హిందీలోనూ ఆఫర్లు రావడానికి కారణమైంది. రోడ్ టు లడఖ్ అనే మూవీ కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైంది. 2005లో వచ్చిన రోగ్ సినిమాతో మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోనూ ఆయనకి ఆపర్లు రావడం ప్రారంభం కాగా..ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమా సైనికుడిలో కూడా విలన్‌గా నటించాడు. మహేష్ బాబు ఇందులో హీరోకాగా..ప్రతినాయకుడైన రాజకీయనేతగా నటించారాయన. ఈ సందర్భంలోనే మహేష్ బాబు తనకి అత్యంత అభిమాననటుడిగా ఇర్ఫాన్ ఖాన్‌ని పేర్కొనడం జరిగింది. ఒక్క మహేష్ బాబే కాకుండా..చాలామందికి ఇర్ఫాన్ ఖాన్ విలక్షణ నటన అంటే అభిమానం. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మూవీస్ అయిన స్లమ్ డాగ్ మిలీయనీర్, లైఫ్ ఆఫ్ పై లో కూడా మంచి పాత్రలు పోషించారు ఇర్ఫాన్. అమితాబ్, దీపికా పడుకునేతో వచ్చిన పీకూ, 2015లో వచ్చిన జురాసిక్ వరల్డ్ లో నటించిన ఇర్ఫాన్..ఎక్కువగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న చిత్రాలతోనే పేరు తెచ్చుకున్నారు. అందుకే భారత్ నుంచి వచ్చిన అంతర్జాతీయ నటులలో ఇర్ఫాన్ కూడా ఒకరని హాలీవుడ్ వర్గాలు చెప్తుంటాయ్

Comments