ఇదే నా చివరి సినిమా- కల్యాణ్ రామ్ అలా అన్నాడా?


కొన్ని సినిమాలు ఆడకపొతే, ఇక సినిమాలకు గుడ్‌బై చెప్తానంటూ నటులు చెప్తుండటం అప్పుడప్పుడూ వింటుంటాం. దీనికి ఎన్‌టిఆర్ నుంచి నేటి తరం వారి వరకూ ఎవరూ అతీతులు కాదు..ఐతే అంత గొప్ప నమ్మకం పెట్టుకున్న సినిమాలు దెబ్బతిని..ఆ తర్వాత మరొ సినిమా హిట్టవడం వంటి సిత్రాలు కూడా ఇండస్ట్రీలొ మామూలే..ఆ తర్వాత వారిని ఏ జర్నలిస్టూ..అలా శపధం చేశారు కదా..మళ్లీ ఎఁదుకు సిినిమాలు చేస్తున్నారని అడగరు..అదే పొలిటికల్ లీడర్లు నొరు జారితే మాత్రం గుర్తొచ్చినప్పుడల్లా గుచ్చే..రిపొర్టర్లు వీళ్ల జొలికి మాత్రం వెళ్లరు ఎందుకంటే..ఇక్కడ రాసుకునే ప్యాకేజీలు వేరే ఉఁటాయ్ కాబట్టి.. గతంలొ ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర గురించి, సామ్రాట్ అశొక గురించి ఇలానే వీరాలాపాలు ఆలపించారు. కృష్ణ తన రక్తతర్పణం సినిమా విషయంలొనూ ఇలానే శపధం చేశాడు. నాగార్జున కిల్లర్, బాలకృష్ణ( పాపం తన సినిమాలు ఒకటి ఆడిందంటే దాదాపుగా పదేళ్ల తర్వాత కానీ ఇఁకొ హిట్ రావడం లేదీ మధ్య)కూడా తన సినిమాల విషయంలొ శపధం చేయడు కానీ..ప్రగల్భాలు పలుకుతుంటాడు. చిరంజీవి మెకానిక్ అల్లుడు విడుదలకి ముందే నా ఒక్కొ పాటా ఒక్కొ కొటి రూపాయలు కలెక్ట్ చేస్తుందంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు తీరా రిలీజయ్యాక వారానికే బాక్సులు టపా కట్టేశాయ్..ఇక అప్పట్నుంచీ అతగాడు ఎక్కడా ఇలాంటి ఛాలెంజులు విసర్లేదు. తమిళనాట రజనీకాంత్ కూడా బాబా విషయంలొ ఇదే నా ఆఖరి సినిమా..కెరీర్ ని విజయవంతంగా ముగిస్తా..ఇకపై చేయను అన్నాడు..ఇలా అంటున్నా కాబట్టి ఫ్లాప్ చేయొద్దంటూ కూడా అదే వేదికపై ప్రకటించాడు. ఐతే ఆ తర్వాత అది నిలబెట్టుకొకుండా చంద్రముఖి, శివాజీ, కథానాయకుడు, రొబొ, లింగ, కొచ్చడయాన్, కబాలి..ఇలా తీసుకుంటూ పొయాడు. డైరక్టర్లలొ కూడా ఇలాంటి సవాళ్లు విసిరినవాళ్లు ఉన్నారు..ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లవుతున్నా హిట్ లేక అలమటిస్తొన్న సాగర్..దాడి అనే సినిమా హిట్ కాకపొతే గుడ్ బై అన్నాడు..కానీ అది జరగలేదు. ఆ తర్వాత అమ్మదొంగాతొ తన కెరీర్ కి ఊపందుకుని..ఆ తర్వాతే సక్సెస్ ఫుల్ డైరక్టర్ అన్పించుకున్నాడు..దీనికితొడు, అర్రర్రే ఇది మనొడి చివరి సినిమా అంటరా..పాపం చూద్దాం అనే ఆలొచన వస్తే..ఒపెనింగ్స్ అయినా బావుంటాయి కదా అనేది మరొ వ్యూహం

ఇప్పటి మన తాజా కథనానికి వస్తే..నందమూరి కల్యాణ్ రామ్ ఇఁడస్ట్రీకి వచ్చి 16 ఏళ్లైంది..ఇంతవరకూ ఇఁడస్ట్రీని షేక్ చేసిన హిట్ ఒకటి లేదు..అతనొక్కడే యావరేజ్‌గా ఆడగా..కెరీర్‌ని వంశబలంతొ నెట్టుకొస్తున్నాడు. మధ్యలొ పటాస్ అనే సినిమా బాగా  ఆడిందంటాడు. వాచకంలొ నత్తి కన్పించే కల్యాణ్‌రామ్ ఎంతమందితొ తన లక్ ట్రై చేసుకున్నా లాభం లేకపొయింది. తాజాగా మనొడు ఎంఎల్ఏ అంటూ జనంపైకి దాడి చేయడానికి రెడీ అయ్యాడు.  ఇది కనుక ఆడకపొతే ఇంక సినిమాలకు గుడ్ బై చెప్తానంటూ వాపొతున్నాడని ఇప్పుడు టాక్ నడుస్తొంది. అసలు మనొడు సినిమాలు తీస్తుందే మూడేళ్లకి ఒకటి..2010 తర్వాత ఇదే జరుగుతూ వస్తొంది..జూనియర్ ఎన్టీఆర్ అంటే డ్యాన్సులు, తాతపొలికలు, నందమూరి వంశాభిమానుల అండతొ బాగా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఒక రకంగా తాత ఎన్టీఆర్‌కి వారసుడనిపించదగ్గ హిట్లు ఇతగాడే కొడుతున్నాడు..బాలయ్యకి వయసు మీరడంతొ రానున్న కాలంలొ  ఒక పది సినిమాలకు మించి తీయకపొవచ్చు..ఇది బాలయ్య ఫ్యాన్స్‌కి నచ్చకపొవచ్చు కానీ ఆయన వయసు రీత్యా అదే నిజం. ఏకబిగిన సినిమాలు తీయడానికి ప్లాన్ చేయొచ్చు కానీ..అక్కడ నిర్మాతలు వరసగా పడుతొన్న దెబ్బలకు కకావికలు అవుతున్నారు. బాలయ్య ఇక్కడే తన తెలివిని ప్రదర్శిస్తుంటాడు..సొంతంగా ఏ సినిమా నిర్మించడు..ఒక్క ఎన్టీఆర్ అనే సిినిమాకి ఎక్సెప్షన్ ఇక్కడ. ఇలాంటి సమయంలొ మొక్షజ్ఞని తయారు చేసే పని కూడా ఉఁది..అతని ఎంట్రీవరకూ బాలయ్య తీస్తూనే ఉఁటాడు.  కల్యాణ్ రామ్ కూడా తెలివిగా మూడేళ్లకొ సినిమా చేసుకుంటూ..మధ్యలొ నిర్మాతగా సినిమాలు చేస్తున్నాడు..ఈ దశలొ ఎంఎల్ఏ కనుక ఫ్లాప్ అయితే మరొ మూడేళ్ల వరకూ సినిమా ఉఁడదు..అప్పటికి అతగాడికి 43 ఏళ్లు వచ్చేస్తాయ్. అందుకే ఇప్పుడు ఇలా నిష్క్రమణకి సంబంధించిన ఆలొచన చేస్తున్నాడని అంటున్నారు..ఐతే మన తెలుగు ప్రేక్షకులు చాలా ఉదారులు..ఒక్కసారి అభిమానించడం మొదలెడితే పాపం కనీసం ఒక పాతికేళ్లు అయినా మొయడానికి సిధ్దంగా ఉఁటారు. వాళ్లకి కావాల్సిందల్లా ఒక్క హిట్..మరిప్పుడు కల్యాణ్ రామ్‌కి దొరుకుతుందా..?

Comments