విజయసాయిరెడ్డి టార్గెట్ ఏంటి..చంద్రబాబుని బోనెక్కిస్తా అన్నది నిజమేనా


వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తరచూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నాడు. ఈయన రెండ్రోజుల క్రితం ఏపి సిఎం చంద్రబాబునాయుడిని బోనెక్కిస్తా అంటూ ఓ ప్రకటన చేశాడని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ప్రముఖంగా ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది. ఇది చూసినవారు ఒక నిజాయితీపరుడు రాష్ట్రంకోసం కష్టపడుతుంటే..ఇలా జైలుకి పంపిస్తా అనడం ఏంటనే ఫీలింగ్ కలిగేలా కథనం ఉంది. అసలు నిజంగా వైఎస్సార్సీపీ ఎంపి ఎందుకు ఇలా అన్నాడు..అంటే.దానికో ఎలిబీ కూడా సృష్టిస్తున్నారు..గత వారంలో ప్రధానమంత్రి కార్యాలయంలో విజయసాయిరెడ్డి..ఆయన బంధువు ఇద్దరూ కన్పించారని..విలేకరులను చూసి దాక్కున్నారంటూ ఈ పత్రికలే కథనాలు రాశాయ్. అసలు పిఎంఓలో ఫోటోలు తీసుకునే స్వేఛ్చ ఉందా లేదా అనేది వేరే విషయం. ఒక ఎంపి ప్రధానమంత్రి కార్యాలయంలోకి వెళ్లకూడదా అనేది కూడా పక్కనబెడదాం..ఇంతకీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత ఇచ్చిన వివరణ చూడండి..

" గత నాలుగేళ్లుగా ఏపీలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోంది..రూ.60వేలకోట్ల అప్పుని..రెండులక్షల కోట్లకి చేర్చడంలో ఈయన అవినీతే కారణం అంటూ ప్రధానికి ఫిర్యాదు ఇచ్చాం..అందుకోసమే పిఎంఓకి వెళ్తున్నాం"

ఐతే ఇక్కడెక్కడా..బోనెక్కిస్తా అనే పదం వాడలేదు..కానీ కింద ఇంటర్వ్యూ చూడండి..చివరిలో అసెంబ్లీలో న్యాయవ్యవస్థపై చంద్రబాబు బురద చల్లుతున్నారు..ఇదే మాట బైటికి వచ్చి అని చూడండి..నేనేం చేస్తానో చూద్దురు అని సవాల్ మాత్రం విసిరారు..అంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ గా చంద్రబాబు మాటలను విజయసాయిరెడ్డి తీసుకెళ్లబోతున్నట్లు స్పష్టంగా అర్దమవుతోంది..ఇదే అంశాన్ని చంద్రబాబు కూడా అసెంబ్లీలో ప్రకటించారు..అంటే విజయసాయిరెడ్డి మాటల అర్ధం ఆయన అనుకున్న ఎఫెక్ట్ వచ్చినట్లేగా..!

Comments