చంద్రబాబంటే..నాకు ఇందుకూ అసహ్యం..కుండబద్దలు కొట్టేసిన పొసాని


పొసాని కృష్ణ మురళి ఇవాళ చంద్రబాబు భాగొతం..(ఆయన మాటే) బైటపెట్టాడు..అచ్చంగా బట్టలు ఊడదీశి మరీ కొట్టాడు అంటారే..అలాగ చేశాడు. సాధారణంగా ఒకే కులానికి చెందిన వాళ్లు 70శాతం తమవారిని వెనుకేసుకుని వస్తూ ఉంటారు..విమర్శలు చేసుకున్నా..ఒక స్థాయి దాటరు..కూడు పెట్టకపొయినా...ఎక్కడొ అక్కడ ఆదుకుంటుందనే దూరపుటాలొచనతొ కులగజ్జిని పెంచుకుంటూ ఉంటారు. అలాంటిది పొసాని కృష్ణమురళి ఎందుకు చంద్రబాబుపై వంటి కాలిపై లేస్తుంటాడు..అతని కొడుకు లొకేశ్‌ని కూడా ఎందుకు అడ్డూ అదుపూ లేకుండా విమర్శిస్తుంటాడనే  విషయానికి ఇవాళ జవాబు దొరికింది
ఒక టివి ఛానల్ చర్చా కార్యక్రమానికి పిలిచుకుని మరీ బుక్కయ్యారు సదరు సంస్థ నిర్వాహకులు..ఏకంగా సదరు అనుసంధానకర్తతొ పాటు, అందరికీ కావాల్సినంత గడ్డి పెట్టాడు పొసాని..అప్పటికే కావాల్సినంత రగిలిపొయిన కృష్ణమురళి అసలు మీకెందుకు చంద్రబాబుతొ అంత వ్యక్తిగత వైరం అన్న ప్రశ్న రాగానే...కట్టలు తెచ్చుకున్న ఆవేశంతొ ఊగిపొతూ చెప్పిన జవాబు వింటే యాంకర్ తొ పాటు ఆడియెన్స్ కూడా షాక్ తిన్నారు. ప్రజారాజ్యం పెట్టిన సమయంలొ చిరంజీవి ఫ్యామిలీని కూడా వదిలిపెట్టకుండా టిడిపి నేతలు వెంటాడి వేధించారని..దానికి చంద్రబాబు సపొర్ట్ గా ఉన్నాడని పొసాని చెప్పారు. రాజకీయంగా వేరే పార్టీ పెట్టినంత మాత్రాన ఇలా చేస్తారా అఁటూ తాను ఎంతొ ఏడ్చానని..ఆ రొజు నుంచే తనకి చంద్రబాబంటే అసహ్యం వేసిందని చెప్పాడు. పైగా ఈ విషయం తన అమ్మానాన్నపై ఒట్టేసి మరీ చెప్తున్నానంటూ ఊగిపొయాడు..దీంతొ అందరికీ దిమ్మ తిరిగినంత పనైంది. ఇంత అనైతికానికి చంద్రబాబు పాల్పడ్డాడు కాబట్టే..తాను ఆయన్ని విడిచిపెట్టానని పొసాని చెప్పాడు. తన జీవితంలొ ప్రజారాజ్యం తప్ప ఇంకే పార్టీలొ ఇప్పటిదాకా చేరలేదని..జెండాలు మార్చలేదని కూడా స్పష్టం చేశాడు..మొత్తాని అలా పొసాని ఆగ్రహం వెనుక ఎంత ఆవేదన ఉందొ బైటికి తెలిసింది..ఐతే ఇంత ఆవేశమున్న పొసానికే చంద్రబాబంటే అంత అసహ్యమైతే..సొంత కుటుంబసభ్యుడైన పవన్ కల్యాణ్ మాత్రం చంద్రబాబుకి గత ఎన్నికల్లొ మద్దతు ఇవ్వడం తలచుకుంటే ఆశ్చర్యం అన్పించకమానదు. అఁదుకే ఇప్పుడు పొసాని ఇమేజ్ కొంతమంది దృష్టిలొ ఇంకాస్త పెరిగింది

Comments