సుదీప్ చెంప చెళ్లుమందా


రాధికా ఆప్టేచేత చెంపదెబ్బ తిన్నదెవరు. ఫస్ట్ డే షూటింగ్‌లోనే ఆమెతో అలా అసభ్యంగా బిహేవ్ చేసింది ఎవరు..ఇదీ రెగ్యులర్ ఆడియెన్స్‌లో ఇప్పుడు లేటెస్ట్ డౌట్. ఎందుకంటే  రెండేళ్లక్రితమే ఓ సూపర్ స్టార్ తనని బెడ్‌రూమ్‌కి రమ్మన్నట్లుగా చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ భామ. అప్పట్నుంచీ ఎవరికి తోచిన పేర్లు వాళ్లు ఊహించుకున్నారు. ఇప్పుడు me too అంటూ స్త్రీలు
తాము వివిధ సందర్భాలలో ఎదుర్కొన్న వేధింపులపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. సామాన్యుల సంగతి ఎలా ఉన్నా, సెలబ్రెటీలు కూడా తాము ఫేస్ చేసిన లైంగికదాడులు, అత్యాచారాలను బైటపెడుతున్నారు..దీంతో ఎప్పటివో సంఘటనలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయ్.
 ఈ నేపధ్యంలోనే రాధికా ఆప్టే మరోసారి అప్పటి సంఘటనని గుర్తు చేసింది. బాలీవుడ్ నటి నేహా ధూపియాతో ఓ షోలో మాట్లాడుతూ..సౌతిండియాలో తాను చేసిిన ఫస్ట్ సిినిమా ఫస్ట్ డే షూటింగ్ లోనే ఇలాంటి అనుభవం ఎదుర్కొన్నట్లుగా చెప్పింది. ఛైర్ లో కూర్చున్న తనని సదరు స్టార్ హీరో కాలితో గోకాడని..వెంటనే చెంప చెళ్లుమనిపించానని చెప్పింది..ఈమె చెప్పిన ప్రకారం ఆలోచిస్తే సదరు హీరో ఎవరో  వెంటనే అర్ధం కాదు , పైగా సౌతిండియా సూపర్ స్టార్ అంటే బాలకృష్ణ అంటూ పాపం అనవసరంగా దురభిమానులు ఆడిపోసుకున్నారు కానీ..అసలు ఆ హీరో ఎవరయ్యా అంటే ఇంకెవరో కాదు సుదీప్ కన్నడనాట మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ  హీరో..తెరపైనే కాదు తెరవెనుకా రాసలీలలు చేస్తూ అప్పుడప్పుడూ భంగపడుతుంటాడు..ఇలాంటి చిన్నెలు పడే ఓసారి తన భార్యతో చివాట్లు కూడా తిన్నాడు. రక్తచరిత్ర సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసిన రాధికా ఆప్టే అఁదులో పరిటాల రవి భార్య పాత్ర పోషించింది.  అందులోనే సుదీప్ చిన్న క్యారెక్టర్ చేశాడు. హీరో సూర్య రెండ ో సినిమాలో ఎంట్రీ ఇస్తాడు. వివేక్ ఓబెరాయ్ రాధికా ఆప్టే భార్యగా నటించింది. ఈ కాంబినేషన్‌ ఉన్న సీన్లోనే సుదీప్ కన్పిస్తాడు. ఈ సందర్భంలోనే సుదీప్ ఈ చిత్తకార్తె పని చేసాడని టాక్. సో ..అలా రాధికా ఆప్టే చెప్తోన్న హీరో సుదీప్ గా కన్ఫామ్ చేసుకోవచ్చు





Comments