రామా ఏంటీ వైపరీత్యం..కల్యాణొత్సవంలొ మరణాలేంటి


భద్రాద్రిలొ నవమి ముగిసిన వారం రొజులకు ఒంటిమిట్టలొ కల్యాణొత్సవం ఆనవాయితీ అంటూ చేస్తున్నారు..కానీ ఇవాళ వడగళ్ల వాన కురవడంతొ షార్ట్ సర్క్యూట్ అయిందని..తొక్కిసలాట అని నలుగురు చనిపొయారు..దీనికి ఎవరు బాధ్యులు..బాగా ప్రచారం చేసి భక్తులను వచ్చేలా చేయడం వరకేనా ప్రభుత్వం పని..ఇప్పుడిలా జరిగితే పరిస్థితి ఏంటని ఎందుకు ఆలొచించరు..చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఎందుకు వ్యవహరిస్తారు..అసలు ఎక్కడ రద్దీ ఉఁటుందొ అక్కడ ప్రమాదాలకు తావుంటుందనే ప్రాథమిక అఁశాన్ని ఎందుకు విస్మరిస్తారు..ఇది ఇలానే కొనసాగితే..50మంది మనుషులు ఉన్నారంటే ఇంక అక్కడికి పొవడం ప్రాణాలపై ఆశ వదిలేసుకునే వెళ్లాలేమొ

దేవుడిని చూడటానికి వచ్చి అక్కడకే వెళ్లడమంటే ఆ కుటుంబాలకు ఎంత బాధగా ఉంటుంది. ఎఁదుకు కనీసం చర్యలు తీసుకొరు..భారీ లైటింగ్ పెడుతున్నప్పుడే...ఎంతొ జాగ్రత్తగా ఉండాలని తెలియదా..పైగా ఈ మధ్యకాలంలొ ఎక్కడ పిడుగులు..పడొచ్చే తెలిపే టెక్నాలజీ వచ్చిందంటూ టివిల్లొ స్క్రొలింగులు కూడా చూస్తున్నాం కదా..మరి ఇక్కడ ఎందుకు ఊహించలేదు..పుష్కరాల్లొ సంఘటన, కృష్ణానదిలొ పుట్టి మునగడం మర్చిపొక ముందే ఇలా జరగడం ఖచ్చితంగా వ్యవస్థలలొ లొపాలన ఎత్తిచూపేవే..! భక్తులూ బహుపరాక్..మీ ప్రాణాలు మీరే కాపాడుకొండి

Comments