ఆంధ్రప్రదేశ్‌లొ ఒక దృశ్యం..నిత్యకృత్యం అనాలేమొ..!

వేరే కాప్షన్లూ..హెడ్డింగులూ ఏం అవసరం లేదు..ఇదీ ప్రస్తుతం చాలా ఊళ్లలొ పరిస్థితి..గుంటూరు జిల్లాలొ డయేరియా ధాటికి  ఎంతమంది రాలారొ చూశారు కదా..ఇప్పుడు ప్రకాశం జిల్లాలొని ఒక ఊరిలొ ఒక ఆస్పత్రిలొ సీన్ ఇది..పైన ఫొటొ చదివినా చాలు..ఫొటొ చదవడం ఏంటంటారా...వివరాలు కూడా ఉన్నాయ్ కదా..మన ఊరే..మన పత్రికే..ఐతే ఏంటి ఇలా వసతులు లేని ప్రవేట్ ఆస్పత్రులతొ ప్రభుత్వాలకు ఏం సంబంధం అంటారా...ప్రవేట్ ఆస్పత్రుల్లొనే దృశ్యం ఇలా ఉంటే..ఇక ప్రభుత్వాసుపత్రి సంగతి చెప్పాలా...జొరం వస్తే నాలుగు సుద్ద ముక్కల్లాంటి పారాసిటమాల్..లేదంటే సూదిమందూ..ఇవేగా..ఎక్కడైనా వేసేది..ఇక్కడైతే కాస్త పిలవగానే వచ్చి సెలైన్ పీకుతారనే నమ్మకంతొ ఇలా ప్రవేట్ ఆస ్పత్రులొళ్లని కొటీశ్వరులను చేస్తూ..తాము మాత్రం జబ్బులకొసం డబ్బులు సంపాదించుకుంటూ బతుకు బండి లాగించేత్తన్నారు..మరి ఆరొగ్యబీమాలు..ఆరొగ్యశ్రీలు పని చేయవేమొ ఇలాంటొళ్లకి..ఇప్పుడనిపించదూ..అసలు ఏ రొగం వచ్చినా బిల్లంతా సర్కారే కట్టుకుంటే..ఎంత బావుండని..చూద్దాం ఆ పథకాలతొ ఎవరన్నా దిగబడతారేమొ...!

Comments