వీడేం లెక్చరర్..ఇవేం మాటలు


పదవికి తగ్గట్లుగా ప్రవర్తించకపోవడం కొన్నిసార్లు విపరీతాలకు దారి తీస్తుంది. అందులో ఫేస్‌బుక్ లాంటి సోషల్ నెట్వర్క్ సైట్ ఉన్నప్పుడు జనం పోయే విపరీత పోకడలకు అంతులేదు. కేరళలో ఒక లెక్చరర్...అక్కడి స్టూడెంట్లపై నీచపు వ్యాఖ్యలు చేశాడు..తమ దుస్తులు సరిగా ధరించపోవడంతో వారి హృదయభాగాలు అవకరంగా కన్పిస్తున్నాయని కామెంట్ చేశాడు. దానికి తోడు వాటిని ఆయన సగం కోసిన పుచ్చకాయలతో పోల్చాడు..ఒక టీచర్ ట్రైనింగ్ సెంటర్ లో ఛాత్రోపాద్యాయులకు..అంటే ట్రైనీ టీచర్లకు ఇలాంటి బోధలు చేయడం విమర్శలకు తావిచ్చేదే..అందులో ఆతను చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా వళ్లు మండించేవే..అందుకే ఈ కామెంట్లకు గురైన స్టూడెంట్లలో ఒక మహిళ తన అర్ధనగ్నశరీరాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది... ఈమెకి తోడుగా మరి కొంతమంది కూడా న్యూడ్ ఫోటోలు పోస్ట్ చేశారు. ఐతే ఫేస్ బుక్ వాటిని డిలీట్ చేసేసిందనుకోండి


ఈ మధ్యనే ఓ మోడల్ ఓ చంటి పిల్లవాడికి పాలు ఇస్తూ మేగజైన్ కవర్ ఫోటోలు పబ్లిష్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. చూసే కోణాన్ని బట్టే..ఏదైనా ఉఁటుందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది..ఈ నేపధ్యంలో సదరు లెక్చరర్ ఇలాంటి కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. దీనికి వ్యతిరేకంగానే ఈ పని చేసినట్లు ఫేస్ బుక్‌లో ఫోటోలు పోస్ట్ చేసిన వారు చెప్పారు. ఐతే  సదరు ప్రొఫెసర్ ను కాలేజీ యాజమాన్యం వెనకేసుకొచ్చింది. అతడు మాట్లాడిన కొన్ని భాగాలను మాత్రమే కట్ చేసి ఇలా వక్రీకరించారనీ, పైగా అతడు మాట్లాడింది కూడా కాలేజీలో కాదంటూ బుకాయించింది. ఐతే కాలేజీలో కానంత మాత్రాన మాటలు తేడా కాకుండా పోతాయా..అందుకే స్థానిక మహిళలు అతనిపై కేసు పెట్టేందుకు సిధ్దమయ్యారు

Comments