బాండ్లలొ తప్పులేదు..వడ్డీ ఎక్కువిస్తాననడంలొనూ లేదు


ఏపి సిఎం చంద్రబాబునాయుడు ఏ పని చేసినా విమర్శించడం తగదు. కానీ ఆయన  చేసే పనులు సకాలంలొ చేయకనే ఇలా విమర్శల పాలవుతుంటాయ్. ఎప్పుడొ హొదా ఇవ్వమని తేల్చిన కేంద్రంపై నాలుగేళ్ల తర్వాత ఒంటికాలిపై లేవడం..అందులొ ఒకటి. అలానే ఇప్పుడు రాష్ట్రరాజధానికి బిజెపి నిధులు ఇవ్వడం లేదని గర్జిస్తుూ..ఎహ మీ అవసరం లేదు మాకు..మా ప్రజలే మాకు రక్ష..వాళ్లే మాకు డబ్బులిస్తారు..మేం వాళ్లకి వడ్డీ(మాత్రమే) ఎక్కువ ఇస్తాం అని ఒక ప్రకటన వదిలేశారు..ఇది ఎప్పుడొ చేసినట్లైతే..ఈపాటికి కొట్లకి కొట్లు వచ్చి పడేవి..సరే అందులొ అమరావతి నిర్మాణం కొసం అంటూ హుండీ పెట్టడం తీసేయడం వంటి గత జ్ఞాపకాలు వదిలేద్దాం
కానీ బ్యాంకుల కంటే వడ్డీ ఎక్కువ ఎలా ఇస్తావయ్యా బాబూ అంటూ విపక్షాలు వాదించడం ప్రశ్నించడం మాత్రం తగవు.ఎందుకంటే అక్కడికి బ్యాంకులేమీ లక్షలకు లక్షలు వడ్డీలు తగలెయ్యడం లేదు..పైగా అక్కవుంట్లలొ బ్యాలెన్స్ ఉంచితే చాలు..నెలాఖరికి వచ్చేసరికి అన్ని ఛార్జీలు కలిపి నిల్ బ్యాలెన్స్ చేసేస్తున్నాయ్. మహా అయితే 80 పైసలు వడ్డీ కూడా డిపాజిట్లపై గిట్టుబాటు కావడంలేదు. అలాంటిది దాని కంటే ఒక్క ఐదుపైసలు ఎక్కువ వడ్డీ ఇవ్వడం గగనం కాదు కదా..అందుకని ఈ పాయింటు పట్టుకునిజనం దగ్గర సొమ్ము కొసం ప్రభుత్వం ఆరాటపడుతుందని విమర్శించడం తగదు..నిజంగానే రాష్ట్ర నిర్మాణం కొసం చిత్తశుధ్దితొ ముందుకు వస్తే..ఆహ్వానించాలి..పైగా ప్రభుత్వ బాండ్లంటే సురక్షితంగా ఉంటాయి కాబట్టి..సొమ్ము భద్రంగానే ఉండొచ్చు.
ఐతే ఇది విదేశాల్లొ ఉన్న మన నాన్ రెసిడెండ్ కేలు..అంటే నాన్ రెసిడెంట్ కమ్మ నేతలు..తమ బ్లాక్ మనీని బాండ్లలొకి మార్చుకొవడానికి వాడుతున్నారనే అనుమానాలు అప్పుడే బయల్దేరాయ్. ఎందుకంటే ఇదివరకే అమరావతిలొ ఎన్ఆర్ఏపిలు అంటూ హడావుడి చేస్తూ..వాళ్లేదొ స్టార్టప్ సెంటర్లు పెడుతున్నట్లు..అందుకొసం భూమి ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టేశారు. దీంతొ చాలా తక్కువ కారు చవక రేట్లకు రాజధానిలొ భూమి ఇచ్చేసినట్లైంది..ఇప్పుడు వాళ్లే ఈ బాండ్లు కొనుగొలు చేసేట్లయితే..నల్లధనం వైట్ అవుతుందని కొందరు విమర్శిస్తున్నారు..ఐతే ఆధారాలు లేని విమర్శలు అలానే మిగిలిపొతాయ్. సాక్ష్యాలు ఉన్నవాటినే మనం పరిగణించాలి
ఐతే నిర్మాణం కొసం అప్పు ఇవ్వమని అడుగుతున్న సందర్భంగా చంద్రబాబు జగన్ , జనసేన, జాతీయ పార్టీలను
తిరిగి అఖిలపక్షానికి ఆహ్వానిస్తామన్నారు..ఇది మంచి పరిణామం..ముందు మీటింగ్ కి వెళ్లాలి..అక్కడే తన అభ్యంతరాలను ఏకరువు పెట్టి బైటికి రావాలి తప్ప..అసలు మీటింగ్‌లకు వెళ్లకుండా ఉఁడటం ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పు..ఎంత చెప్పినా...ప్రభుత్వంతొ కలిసి పొరాడితేనే అధికారికంగా నిధులు వచ్చేది..అదిప్పుడు వదిలేసి ఎప్పుడొ ఎన్నికల సమయంలొ చేయాల్సిన ఫైట్లు ఇప్పుడే చేసుకొవడం రాష్ట్రప్రయొజనం దృష్ట్యా మంచిది కాదు

Comments