బ్బాబ్బూ...మీ త్యాగం అసంబద్దం..అసంపూర్ణం


అతి ధీమాతొనొ లేక అజ్ఞానంతొనొ కొందరు యధాలాపంగా కొన్ని మాటలు  అనేస్తుంటారు.
వాటిల ొ కొన్ని నిజాలు ఉంటాయి. కొన్ని సామాన్యులెవరూ నమ్మలేనివి కూడా ఉంటాయి. ఏపీ  రాజకీయాల వరకూ సిఎం చంద్రబాబునాయుడుగారు చెప్పే మాటలు కొటలు దాటుతుంటాయని ప్రత్యర్ధి పార్టీలు విమర్శిస్తుంటాయి. కానీ చంద్రబాబునాయుడు చెప్పే మాటల్లొ కొంత సత్యం ఉంటుంది. ఎవరు అవునన్నా కాదన్నా..హైదరాబాద్‌లొ ఐటీ పరిశ్రమలు వచ్చినవి ఆయన పరిపాలన చేస్తున్న సమయంలొనే. దీనిని ఎవరూ తప్పుబట్టలేరు. అలానే అటు జగన్ పార్టీ, ఇటు కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ కలిసి చుట్టూ చేరి కాకుల్లా పొడిచి పొడిచి తెలంగాణపై వైఖరి చెప్పమన్నా..ఎంతొ సహనంతొ తన టైమ్ వచ్చేవరకూ ఎదురు చూసిన వ్యక్తి చంద్రబాబు..టీఅర్ఎస్ కొట్టిన దెబ్బలకు ఇప్పుడంటే తెలంగాణలొ టిడిపి అయిపూ అజా ల ేకుండా ఉంది కానీ..ఒకప్పుడు టిడిపి చాలా స్ట్రాంగ్ పార్టీ..వస్తున్నా మీకొసం అఁటూ ఆయన 62 ఏళ్ల వయసులొ చేసిన పాదయాత్ర కూడా సామాన్యమైనది కాదు..అందుకే ప్రజలు ఆయనకి పట్టం గట్టడానికి ఒక కారణంగా చెప్పాలి. ఇంతవరకూ బాగానే ఉంటుంది..కష్టకాలంల ొ ఆయన సహనంతొ ఎదురు చూసే తీరు ఎవరికైనా ఆదర్శమే..దానికి తిరుగులేదు..ఇదే మాట అసెంబ్లీలొ ఆయన కుమారుడు లొకేశ్ చెప్పాడు..కొడుకు తండ్రిని పొగుడుతూ ఉఁటే చూసే అదృష్టం రాజకీయాల్లొ అంత త్వరగా ఎవరికీ దక్కదు..అఁదుకే ఈ సందర్భంలొ చంద్రబాబు చాలాసార్లు కంటతడి పెట్టడం కూడా ఈ వీడియొలొ కన్పిస్తుంది..చూడండి వీడియొ...



ఐతే ఇక్కడే లొకేశ్ అపరిపక్వత బైటపడింది..రాజకీయనేతలు, సినిమా స్టార్లు, ఆ మాటకి వస్తే ప్రతినిత్యం తమ తమ వ్యాపకాల్లొ బిజీగా ఉండే ప్రజలు కూడా చాలామంది తమ కుటుంబజీవితానికి దూరంగానే ఉఁడాల్సి వస్తుంది. అంతెందుకు జర్నలిస్టులు, పొలీసులు, ట్రాఫిక్ పొలీసులు వీళ్లకినిజంగా సెలవులు అనేవి ఉంటాయా...అంత మాత్రాన దాన్ని ఒక త్యాగంగా చెప్పుకుంటే అపహాస్యం పాలవకతప్పదు..ఇప్పుడూ అదే జరుగుతొంది..లొకేష్ అన్నాడొ లేడొ తెలీని కొన్ని మాటలను కూడా కొన్ని పేపర్లు రాయడం..(స్వామిభక్తి కదా) జాకీలని వదిలేసి క్రేన్లని తెచ్చి మరీ ఇమేజిని పైకి లేపే ప్రయత్నం చేశాయ్..ఇప్పుడు వాటిపై సొషల్ మీడియాలొ రచ్చ రచ్చ అవుతొంది..ఉదాహరణకు కింద ఫొటొ చూడండి

చంద్రబాబుని 1983లొ పుట్టిన లొకేష్ 1995 వరకూ చూడలేదట..ఇదీ ఆ రాత..ఎవరికైనా ఇది చూస్తే ఒకటి జాలి వేస్తుంది..రెండొది ఛత్..నీ..ఏంట్రా ఈ భజన అన్పించకమానదు..అసలు సీమంతం అనేది స్త్రీల పండగ..కుటుంబపెద్దలుగా అత్తమామలు ఉంటే ఉండొచ్చుకానీ..ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఐదు నిమిషాలకు మించి అక్కడ ఉఁటారనుకొవడం దేనికి సంకేతం..ఇక్కడ లొకేష్ తన తండ్రి నిబద్దతను పొగుడుకొవడానికి ఈ సందర్భం వాడుకొన్నాడు కానీ..అది అసందర్భం. దానికంటే మా పుట్టినరొజులు కూడా మేం తండ్రితొ గడపలేదు.. ఉదయం సాయంత్రం టిఫిన్ భొజనం కలిసి చేయం..వంటివి చెప్పుకుంటే కాస్తలొ కాస్త సబబుగా ఉఁటుంది. అందుకే అనేది నేతలను తయారు చేస్తే అవరు..స్వతహాగా ఆ లక్షణాలు ఉఁడాలి అని..

Comments