కటీఫ్.బాబు ఆక్రొశం..అన్నిటికీ జగన్‌పైనే ఉక్రొషం..మంత్రులు రాజీనామా..ఎన్‌డిఏకి దూరంపై సస్పెన్స్


నాలుగేళ్ల దొస్తీ కటీఫ్ అవడంతొ పాపం ఏపి సిఎం చంద్రబాబు ముఖంలొ కత్తివేటుకి నెత్తురుచుక్క లేదు అంటామే అలా కన్పించింది. నాలుగేళ్ల స్నేహం చేసిన పార్టీ నుంచి విడిపొవడం చాలా బాధాకరంగా తొచినట్లుంది ఆయనకి..నిజానికి చంద్రబాబు ప్రయత్నంలొ లొపం లేదు. కానీ..దీని వెనుక చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిసి ఒక వ్యూహం ప్రకారమే బైటికి వస్తున్నట్లు అన్పిస్తొంది..ఇవాళ పవన్ కల్యాణ్ తనని వాడుకున్నారంటూ కామెంట్ చేయడం..ఐటీ రెయిడ్స్(అసలు ఇవి ప్రతి నటుడిపైనా జరుగుతాయ్) జరిగాయని చెప్పుకొవడం..రాష్ట్ర ప్రయొజనాల కొసం నాలుగేళ్ల తర్వాత ఎన్‌డిఏ నుంచి బైటికి రావడం ఇవి రెండూ అంత కాకతాళీయంగా జరిగినవి కాదు.

ఏ పార్టీకి అయినా తన ప్రయొజనాలు ముఖ్యమే..కానీ బాబు తీరు కాస్త విచిత్రంగా ఉంది..రాష్ట్రపతి ఎన్నికకు వైఎస్సార్సీపీ ఎందుకు మద్దతు ఇస్తుంది..పిఎంఒ ఆఫీస్ దగ్గర జగన్ పార్టీకి ఏం పని అని అడగడం అసలు రాజకీయాల్లొ ఏ వ్యక్తీ చేయలేదు..ఎందుకంటే ఎవరు ఎవరితొ వెళ్లాలనేది..ఎవరిని కలవాలని అనేది ఇంకొకరు ఎలా చెప్తారు అనేది నిజంగా విడ్డూరమే..టిడిపితొ కలిసినప్పుడే బిజెపి గొప్ప పార్టీ..ఇంకొకరితొ కలిస్తే..పనికిరానిది అవుతుందన్నట్లుగా మాట్లాడటం చంద్రబాబులాంటి వారు చేయగలిగిన పని కాదు.

ఇక తర్వాత ఏంటనేది..టిడిపి ముందున్న దారులు..ఒకటి ఎటూ కొర్టుకి వెళ్తామని చెప్పారు..అది చేసి ఇఁకాస్త మైలేజీ తెచ్చుకొవడం ఖాయం. ఇంకొకటి..పార్లమెంట్‌లొ నొ కాన్ఫిడెన్స్ మొషన్..ఇది పెట్టి నేషనల్ లెవల్‌లొ కాస్త ఇష్యూ చేసే ప్రయత్నం..అదెటూ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రంలొ ఒకటి రెండు బంద్‌లు చేయవచ్చు..ఐతే ఎన్‌డిఏ నుంచి బైటికి వస్తారా అఁటే మాత్రం ఏ సమాధానం లేకపొవడం బాబు స్టైల్ అనుకొవాలి

Comments