రవిశంకర్..పండితుడెట్లా అయ్యాడు?


ఎప్పటిదో సమస్య..ఇప్పుడెందుకు గెలికి..వెలికి తీయాలనుకుంటున్నాడో తెలీదు కానీ..రవిశంకర్ చేసిన ఓ వివాదస్పద వ్యాఖ్య ఇప్పుడు ఆయనంటే ఉన్న గౌరవం కాస్తా..మంటగలసిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని..రామ్ మందిర్-బాబ్రీ మసీద్‌పై ఆయన ఈ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానంటూ బైల్దేరాడు. పిలిచింది లేదూ..పెట్టింది లేదు..ఐనా తనకి తానే పెద్దరికం ఆపాదించుకున్నాడు ఈ విషయంలో..ఆయన ఎంత పెద్ద ఆధ్యాత్మిక ప్రసంగాలు  చేసినారెండు మతాలకు సంబందించిన అంశం కావడంతో ఇక్కడ బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించాలి..మనసులో ఏది ఉన్నా..ఇంకో పక్షానికి కారం పూసుకున్నట్లు అన్పించే కామెంట్లు చేయడానికి లేదు.

కానీ ఆయన రామజన్మభూమిలో శ్రీరాముడి దేవాలయం కట్టకపోతే భారతదేశం మరో సిరియా అవుతుందని అన్నాడు ఇలా అనడానికి ఆయనకి ఉన్న ఆధారాలు తెలీదు. ఎలాంటి అర్ధంలో చేశాడో తర్వాత చెప్పినంత మాత్రాన ఆయన మాటలు మంటలు రేపకుండా ఉంటాయా..?
అందుకే యావత్ ముస్లిం ప్రపంచానికి తానే ఓ ప్రాక్సీ అనుకునే అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగాడు..ఆయనపై కేసు పెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేశారు అసలు భారతదేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా..ఎలాంటి తప్పులు జరుగుతున్నా ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అత్యంత ప్రశాంతమైన  దేశం అనడంలో సందేహం లేదు..అలాంటి దేశాన్ని మరో సిరియా అవుతుందని హెచ్చరించడమేంటి..ఇలాంటి వ్యక్తినా పండిట్ గా..గురువుగా ఇన్నాళ్లూ చూసిందని ఖచ్చితంగా ఈసడించుకుంటున్నారు. దానికి ఆయన వ్యవహారశైలే కారణం.
హిందువులలో దేవుడంటే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరి మదిలో శ్రీరాముడు ఉండొచ్చు..అంత మాత్రాన ప్రతి ఒక్కళ్లూ అయోధ్యలో గుడి కడితేనే జన్మలకు సార్ధకత అని అనుకోవడం లేదు. ప్రపంచం అంతా తేడాలు లేకుండా బతుకుతుంటే..ఇప్పుడిలా ఒక గుడి కట్టకపోతేనే..దేశం రక్తపాతంతో నిండిపోతుందని అనడం ఖచ్చితంగా
వాచాలత్వమే..మరి జీవనరహస్యాలు చెప్పే ఈ పండితుడికి ఈ విషయం ఎప్పుడు అర్ధం అవుతుంది..దేశంలో ప్రశాంతత లేకుండా గ్లోబల్ పీస్ అంటూ హడావుడి చేస్తే సరిపోతుందా..దయచేసి ఆలోచించండి

Comments

  1. " ప్రపంచంలోని అన్ని దేశాలకంటే అత్యంత ప్రశాంతమైన దేశం అనడంలో సందేహం లేదు"

    ఇది నిజంకాదు. జర్మనీ, నార్వే, స్వీడన్ దేశాలు అత్యంత ప్రశాంతమైన దేశలు. జపాన్, మలేసియాలు మనకంటే మెరుగేననుకుంటాను. అమెరికాకూడా మెరుగేననుకుంటాను (మనపేపర్లలో మరీ సెన్సేషనలైజ్ చేస్తున్నప్పటికీ).

    ReplyDelete

Post a Comment