తెలిసిందిలే..అప్పురాజా..నీ రూపు తెలిసిందిలే


భారతీయ సినిమాల్లో విచిత్రసోదరులు సినిమాకి ఒక ప్రత్యేకత ఉంది. అందులో కమల్ హసన్ త్రిబుల్ రోల్ చేశారు.
తండ్రి కమల్ హసన్‌కి ఇద్దరు కొడుకులైతే..వారిలో ఒకరు విలన్లు చేసిన పనికి మరుగుజ్జుగా పుడతారు. గర్భిణిగా ఉన్న శ్రీవిద్యకి విషం తాగించడంతో మరుగుజ్జుగా పుట్టిన కమల్ అప్పురాజాగా పెరుగుతాడు. ఇంకొకరు మెకానిక్‌గా పెద్దవుతాడు. ఐతే ఈ సినిమా అంతా కూడా కమల్ హసన్ అంత పొట్టిగా నటించడం ఎలా కుదిరిందనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే..అప్పట్లోనే తిరిగి కమల్ లా చేద్దామని చాలామంది ట్రై చేశారు కానీ కుదరలేదు.

మన తెలుగు డైరక్టర్ వంశీ రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో తెరకెక్కించిన వైఫాఫ్ వరప్రసాద్ సినిమాలోని ఓ పాటలో జెడి చక్రవర్తి ఇలా పొట్టిగా కన్పిస్తాడు. విచిత్రసోదరులు సినిమా డైరక్టర్ సింగీతం శ్రీనివాసరావ్..ఆయన చిత్రాలన్నీ విభిన్నంగా ఉంటాయ్. ఇప్పుడంటే గ్రాఫిక్స్ మాయాజాలంతో ఎలాంటి క్యారెక్టరైనా సృష్టించవచ్చు కానీ..ఆ రోజుల్లో కమల్ హసన్‌ని చూపించారంటే వారి ప్రతిభని అర్థం చేసుకోవచ్చు..ఇంతకీ కమల్ హసన్ ఎలా పొట్టిగా కన్పించాడంటే ఆ సీక్రెట్ ఇప్పుడు తెలిసిపోయింది. ఇది గతంలో చాలాసార్లు ఆయన చెప్పినా..స్కెచ్ సాయంతో కూడా చెప్పడం ఇదే ప్రథమం .ఓ ఎఁటర్ టైన్మెంట్ శాటిలైట్ ఛానల్ లో పుష్పకవిమానం పేరుతో ఓ షో వస్తోంది.అందులోనే ఆయన ఈ సినిమాలో మరుగుజ్జు కమల్ హసన్ క్యారెక్టర్ షూటింగ్ ఎలా చేశాడో తెలిపారు.
 ముందుగా అప్పురాజా ఉన్న అన్ని సీన్లూ 18 అంగుళాల ట్రెంచ్ అంటే లాంగ్ పిట్ ఒకటి తయారు చేసి..వాటిలో అప్పు నడిచేలా డిజైన్ ఛేసారు. అఁటే మధ్యలో బోలుగా ఉఁడే ఓ వేదిక లాంటి నిర్మాణం. కమల్ మోకాళ్లకి ఓ షూ కట్టేవారు..దాంతో ఆయన నడుస్తుండటం పొట్టిగా ఉన్న వ్యక్తి నడుస్తున్నట్లే కన్పించేది. దీనికంతటికీ జపాన్ అనే సెట్ బాయ్ రూపకల్పనలో జరిగిందట. ముందుకు పక్కకు నడుస్తున్నప్పుడు మాత్రం ఈ ట్రెంచ్ కి సమాంతరంగా మరో ట్రెంచ్ నిర్మించి మధ్యలో కెమెరా పైకి ప్యాన్ చేసి షాట్లు తీసేవాళ్లట..అలా పొట్టి కమల్ ఉన్న ప్రతి సీన్లో ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా ట్రిక్ వర్క్‌తోనే మేనేజ్ చేశారట.


 ఇక చేతుల విషయానికి వస్తే..మనిషి కాళ్లకిందకు తగిలేలా కన్పించకూడదు కాబట్టి...ప్రతి సీన్లో పొట్టి కమల్ చేతులు పైకి ఉండే మేనరిజమ్ మెయిన్ టైన్ చేశారు. ఈ సినిమాలో కమల్ హసన్‌ భారీ షూస్‌ని వాసుదేవన్ అనే ఇంజనీర్ రూపొందించగా..కుర్చీలో కూర్చుని ఉండే సీన్లలో వాటిని వైర్ సాయంతో కదిలించేలా పూర్ణ అనే సింగీతం మేనల్లుడు ఆపరేట్ చేశాడట. ఐతే ఈ సిత్రాలు బైటపెట్టకముందు కూడా కొంతమంది ఔత్సాహికులు చెన్నైలో వివిధ ఫంక్షన్లలో అప్పురాజా ఎలా మేకప్ చేసుకున్నాడో చూపించేవారు..ఆ కష్టం చూస్తే ఎవరైనా చప్పట్లు కొట్టకుండా ఉఁడరు..ఎందుకంటే సినిమాల్లో అంటే ఎన్నో షాట్లు..ట్రెంచ్ ల ఏర్పాట్లు ఉండగా..ఈ లోకల్ టాలెంట్ మాత్రం ఏ సాయం లేకుండా అలా కాళ్లు వెనక్కి గట్టుకుని పొట్టి వ్యక్తులుగా మారిపోయి అలరించడం విశేషం..ఐతే విచిత్రసోదరులు వరకూ ఎంత చెప్పినా..అలా కష్టపడి చేసిన కమల్..దర్శకత్వం వహించిన సింగీతాన్ని అభినందించకుండా ఉండలేరు.Comments