రాజేంద్రప్రసాద్‌కి ఫుల్ల్‌గా దూల తీర్చేసిన తమ్మారెడ్డి, పోసాని, రంగంలోకి మురళీమోహన్


తెలుగు రాజకీయాల్లో నోటి దూల ఉన్నోళ్ల లిస్టు తీస్తే..అందులో ముందుగా కన్పించేది కృష్ణా జిల్లాకి చెందిన టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముందుంటాడు. ఇందులో సందేహం ఏం అవసరంలేదు..ఈ విషయంపై కోర్టులకెళ్లినా..ఇది నిజమని రుజువు చేయడానికి బోలెడన్ని ఉదాహరణలు చెప్పుకొవచ్చు..తాజాగా అతనికి పుట్టిన బుద్దో..లేక ఆయన పార్టీని మోసే ఒక గోడపత్రిక ఎండికి ఉన్న బుద్దో కానీ..అనవసరంగా సినిమావాళ్లని గెలికేశాడు. " అసలు జనమంతా..సస్తా ఉంటే మీరు మాత్రం ఏసీ గదుల్లో కులుకుతారా..మీ హీరోలుండారంటే..దేనికి పనికిరారు జఘనాలు..బొడ్డు సూపించడానికి తప్ప.." అంటూ ఇంకా ఏదేదో నోటికి వచ్చినట్లు ప్రేలాపన చేశాడు..

దీంతో తెలుగుచిత్రపరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కళ్లకీ ఎక్కడో కాలింది..వెంటనే తమ్మారెడ్డి భరద్వాజ సరైన రీతిలో స్పందించాడు.."ముందు మీ పార్టీలోనూ మవాళ్లు చాలామంది ఉన్నారు కదా వాళ్లచేత మాట్లాడించి..తర్వాత మా దగ్గరకి రా " అంటూ డైరక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. పనిలో పనిగా నంది అవార్డులు పంచేసుకున్నారు కదా వాళ్లకి చెప్పు నీ కబుర్లు అంటూ చెడా మడా వాయించేశాడు..

అంతటితో ఊరుకోకుండా..పోసాని కృష్ణ మురళి కూడా తనదైన స్టైల్‌లో ఏకంగా చంద్రబాబునే టార్గెట్ చేసుకున్నాడు. చంద్రబాబు ఒక రాజకీయబ్రోకర్ అని జగన్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని ఆరోపించాడు. "  జగన్ ఆర్ధిక నేరగాడు అంటున్నావ్..మరి నీ సుజనా చౌదరి పరిస్థితి ఏంటి..నీ ఈనాడు పత్రికే పెద్ద పెద్ద అక్షరాలతో రాసిందిగా..మరి నువ్వెందుకు సుజనా చౌదరికి రాజ్యసభ సీటిచ్చావ్..మంత్రిగా పంపించావ్ " అంటూ రెచ్చిపోయాడు


ఇప్పుడు ఎక్కడ ఈ వ్యవహారం తనపైకి వస్తుందేమో అన్నట్లుగా..మురళీమోహన్ కూడా చంద్రబాబుకి రాజేంద్రప్రసాద్‌పై కంప్లైంట్ చేశాడంటూ లీకులు వచ్చాయ్.
టాలీవుడ్‌లో మెజార్టీ నటులు టిడిపితోనే ఉన్నారని..రాజేంద్రప్రసాద్ తీరు సరిగా లేదని చెప్పాడని అంటున్నారు.  దీంతో చంద్రబాబుకి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కి క్లాసు పీకక తప్పని స్థితి ఏర్పడింది. అసలు తెలుగు చిత్రపరిశ్రమ పెద్దల్లో చాలామంది టిడిపి సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో మిగిలిన
కులాల వారూ తమ ప్రాతినిధ్యం పెంచుకుంటున్నారు..ఐనా అధికారంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీతో చిత్రపరిశ్రమ సన్నిహితంగా ఉంటూ వస్తోంది. దానికి పెద్ద రహస్యాలేం లేవ్..వ్యక్తిగతంగా ఎవరు ఏ పార్టికి సపోర్ట్ చేసినా...టాలీవుడ్‌లో అదో పాలసీగా వస్తోంది. తమ పనులు..పరిశ్రమ పనుల కోసం ఇదో విధానంగా అమలు
చేస్తూ వచ్చారు. ఐతే ఒక పత్రికాధిపతి మాత్రం ఈ సినిమా ఇండస్ట్రీ అంటేనే అఁతా ఏదో పుచ్చిపోయినట్లు..అంతా తనకి తెలిసినట్లు రకరకాల వ్యాఖ్యానాలు అసందర్భంగా చేస్తుంటాడు. బహుశా ఆయన పరోక్ష ప్రభావంతోనే...టిడిపి లీడర్ రాజేంద్రప్రసాద్ చులకనగా మాట్లాడారని విన్పిస్తోంది..ఐతే సరైనరీతిలో తమ్మారెడ్డి, పోసాని రెస్పాండ్ అవడంతో
టిడిపి నేతలకు మైండ్ బ్లాక్ అయిందని..అందుకే మురళీమోహన్‌ని రంగంలోకి దించారని టాక్

Comments