అడ్డంగా దొరికిపొయిన టిడిపి..ఊపు కొనసాగించాలంటొన్న బాబు


ఇవాళ పార్లమెంట్‌లొ టిడిపి అడ్డంగా దొరికిపొయింది. మళ్లీ ఆ సంగతిని వాళ్లే వాళ్ల నొటి వెంట బయటపెట్టుకుని మరింత చులకన అయ్యారు. ఇప్పటిదాకా బిజెపిపై నొ కాన్ఫిడెన్స్ మొషన్‌ని తెగ సీరియస్‌గా తీసుకుంది..ఇక తాడొ పేడొ.. అవకపొయినా..మొడీకి ఇంత పేడ మాత్రం పూస్తారని ఆశించారు..కానీ తీరా చూస్తే..ఆ పేడ కాస్త టిడిపికే అంటుకునేట్లు ఉఁది. ఎందుకంటే ఇవాళ దేశంలొ చాలామంది టిడిపిది కానీ..జగన్ పార్టీది కానీ ఎవరొ ఒకరి అవిశ్వాస తీర్మానాల ప్రసక్తి వస్తుంది అని అనుకున్నారు. కానీ సభ మళ్లీ మంగళవారానికి వాయిదా పడింది. దీంతొ దాదాపు డజను రొజులు ఇదే తంతు నడుస్తున్నట్లైంది.
ఐతే రాత్రికల్లా మన గొట్టాల హడావుడికి టిడిపి లీకులు ప్రారంభమయ్యాయ్..అక్కడికేదొ విపరీతమైన పొరాటం చేస్తున్నట్లు..దానికి చంద్రబాబు శభాష్ అన్నట్లు కథనాలు వండి వార్చుకున్న ఛానళ్లు పెట్టిన బ్రేకింగులు.
." సభ జరిగిన తీరు టెలికాన్ఫరెన్స్‌లొొ టిడిపిఎంపిలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు"
" మన వెనుక 5 కొట్లమంది జనం ఉన్నారు వెనక్కి తగ్గొద్దు"
"సభలొ హాజరు తగ్గకుండా చూసుకొండి..ఇతర పార్టీల ఎంపిలను టచ్‌లొ ఉంచండి"
"బాగా పొరాడారు"
దేశం మొత్తం మనపై సానుభూతితొ ఉంది.." 
ఇదీ బాబు తరపు బ్రేకింగులు...ఇంతకన్నా చొద్యం ఉఁదా..పార్లమెంట్ బయట నినాదాలు...ఎంపిలవైతే ఏంటి..ఇంకొకరివైతే ఏంటి..ఇక లొపల పొరాటం ఏముంది..ఖచ్చితంగా 50 సెకన్లలొ సభ వాయిదా పడింది..దానికి కారణం ఎవరొ తెలుసా...తెలుగుదేశం ఎంపిలే...వాళ్లే ప్లేకార్డులతొ స్పీకర్ ని చుట్టుముట్టారు..అంతకుముందే అన్నాడిఎంకే సభ్యులూ ఉన్నారు..నిజంగా మన పొరాటాలకు(టిడిపి ఎంపిల) దేశం మొత్తం మద్దతే ఉంటే..అన్నాడిఎంకే, డిఎంకేలను ఎందుకు ఒప్పించలేకపొతున్నారు..సరే ఆ విషయం వదిలేస్తే..ఈ లీకు బ్రేకింగుల పరంపరలొ చంద్రబాబుగారి టెలికాన్పరెన్స్‌లొ పాపం కొన్ని బ్రేకింగులు టిడిపి అడ్డంగా బుక్కైన సంగతి వాళ్లంత వాళ్లే బైట పెట్టుకున్నారు..అవేమిటొ చూడండి

" విజయసాయిరెడ్డి, టిడిపి ఎఁపిలు స్పీకర్ వెల్‌లొకి వెళ్లారు..సభ వాయిదాకి వాళ్లే కారణమంటూ ప్రచారం చేస్తున్నాడు నమ్మొద్దు..అసలు లొక్ సభలొ ఎవరు ఎక్కడున్నారొ ఒక రాజ్యసభ సభ్యుడు చెప్పడమేంటంటూ." 
ఒక టిడిపి ఎంపి చంద్రబాబుతొ కాన్ఫరెన్స్‌లొ చెప్పారట..ఇవీ ఆ బ్రేకింగులు..ఇప్పటిదాకా విజయసాయిరెడ్డి అలా అన్నాడొ లేదొ కానీ...ఈ విషయంతొనే టిడిపి ఎంపిలు వెల్ లొకి వెళ్లిన సంగతి వాళ్లే బైటపెట్టుకున్నారు..ఇవాళ్టి సభ క్లిప్పింగులు చూస్తే..క్లియర్ గా అర్ధమవుతుంది..ముందు స్పీకర్ కి ఎదురుగా ప్లకార్డులు పట్టుకుని ఉన్నది మాగంటి బాబే..పైగా పచ్చగా పార్టీ కండువాలు కప్పుకుని మరీ సభలొ ఉన్నారు కదా..వెంటనే గుర్తుపట్టొచ్చు కూడా..ఇక  రాజ్యసభలొనూ స్వెట్టర్ వేసుకుని టిడిపి ఎంపి సిఎఁ రమేష్ వెంక్యానాయుడి ముందే ఉన్నాడు
ఫొటొలు ఉన్నాయి చూడండి

పైగా లొక్ సభ అయితే మరీ దారుణం స్పీకర్ వచ్చి ఇంకా కూర్చొకముందే...నమస్కారం చేస్తుండగానే ఎలా వెళ్లి నిలబడ్డారొ చూడండి..ముందు మాగంటి బాబు, పక్కనే కొనకళ్ల వెనుకగా.... ముందుకు నడుస్తొన్న రవీంద్రబాబు..ఇఁకాస్త వెనుక రామ్మొహన్ నాయుడు ...రాజ్యసభలొ సిఎం రమేష్ ఆయనకి పొటీగా కేవీపీ...కన్పిస్తారు.. ఇప్పుడు చెప్పండి ఎవరి వాదన సమంజసం..ఇవేం గ్రాఫిక్స్ ఫొటొలు కావు..ఇవాళ్టి సభ సమావేశాలు..ఏ యూట్యూబ్లొ వెతికినా కన్పించేస్తాయ్..

Comments