బాబూ చిట్టీ.. ! శ్రీలక్ష్మి ఎలా ఉందో తెలుసా


ఈమె పేరు వింటేనే చాలు..మనకి వెంటనే పెదవులపై చిరునవ్వు తోసుకువస్తుంది. తాను అస్సలు నవ్వకుండా పిచ్చ సీరియస్‌గా బోలెడంత హాస్యం పండించడంలో ఈమెకి సాటి ఎవరూ లేరు. ఐతే ఇప్పుడు మాత్రం ఆమెకి ఒక్క క్యారెక్టర్ లేదు. అక్కడికి ఆమెకి పెద్దగా వయసు అయిపోయింది లేదు. కానీ ఆమె పరిస్థితి చివరకు టీవీసీరియళ్లలో అనామక పాత్రలకు జారిపోయింది. ఆమే..శ్రీలక్ష్మి లక్షణంగా తెలుగు పేరుతో ఉన్న ఈమె బ్యాక్ గ్రౌండ్ కూడా అల్లాటప్పా ఏం కాదు. తన తండ్రి ఒక హీరో..పౌరాణిక పాత్రలలో నటించిన ఘనత కూడా
సొంతం.


శ్రీలక్ష్మి తండ్రి అమరనాధ్ 1958లోనే రామాంజనేయయుధ్దం అనే సినిమాలో శ్రీరాముడి క్యారెక్టర్‌లో మెప్పించారుఅమరసందేశం  అనే సినిమాను నిర్మించారు కూడా..ఈ దశలోనే ఆయన అవకాశాలు రాకపోయినా..తనకు వేరే దారి లేకపోవడంతో సినిమాలను నిర్మించడం మొదలుపెట్టారట. అలా ఉన్న డబ్బంతా పోవడంతో పాటు చెన్నైలో ఉన్న ఆస్తులన్నీ కరిగిపోవడంతో వేరేదారి లేక శ్రీలక్ష్మి కూడా నటన బాటే పట్టారట. ఐతే ఎంత ప్రయత్నించినా..క్యారెక్టర్లే వచ్చేవి కాదట. అలా అలా విసిగి వేసారిన సమయంలో చిన్న చిన్న క్యారెక్టర్లు రావడంతో వాటితోనే సరిపెట్టుకునేవారట. ఐతే దర్శకుడు జంధ్యాల ఆమెలోని హాస్యరసాన్ని గమనించి నాలుగు స్తంభాలాటలో సుత్తివేలు భార్యగా ఒక క్యారెక్టర్ ఇవ్వడంతో భుక్తికి లోటు లేకుండా పోయిందట. ఐతే ఆ సమయంలోనే శ్రీలక్ష్మి తమ్ముడు ఈమె ధరించే పాత్రలకు అభ్యంతరం పెట్టాడట..ఈ తమ్ముడెవరనుకుంటున్నారా..అతనే రాజేష్..రెండుజళ్లసీతలో ఒక హీరోగా పరిచయమయ్యాడు ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా..చాలా సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించాడు కూడా.



తెలుగుతెరపై అందమైన విలన్లలో రాజేష్ కూడా ఒకడంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే సెట్లపై రాజేష్ శ్రీలక్ష్మి అంటే మండిపడేవాడట. ఎందుకంటే ఆడవాళ్లు సినిమాల్లో నటించడమంటే అందరూ చీప్ గా మాట్లాడుకుంటారని..పైగా ఇది హీరోయిన్ క్యారెక్టర్ కూడా కాదని వాదించేవాడట. దీంతో వళ్లు మండిన శ్రీలక్ష్మీ..చూడు రాజేష్ నీ క్యారెక్టర్ నీకు ఎంత గొప్పదో..నా పాత్ర నాకు అంత గొప్పది నీ దారి నీది నా దారి నాది అనవసరంగా నా జోలికి రాకు అని స్ట్రాంగ్‌గా చెప్పిందట. అప్పట్నుంచీ సినిమాల్లో నటిస్తున్నా, ఈ ఇద్దరూ పెద్దగా మాట్లాడుకునేవారు కాదట అలా హాస్యరస పాత్రలతో పాటు క్యారెక్టర్ యాక్ట్రెస్‌గా కూడా రాణించిందామె. సుత్తి వీరభద్రరావ్, గొల్లపూడి, సుత్తివేలు, కోటశ్రీనివాసరావ్, బ్రహ్మానందం ఇలా ప్రతితరం హాస్యనటులకు జోడీగా నటించి ఒప్పించారు. జంధ్యాల సినిమాల్లో అయితే ఆమెకి తప్పనిసరిగా ఓ మేనరిజం పెట్టేవారు.ఎంత హాస్యం పండిస్తున్నా..ఆమె మాత్రం నవ్వకపోవడం ఆయా పాత్రల ప్రత్యేకత.  నే కవిని కాదన్నవాడిని రాయెత్తి కొడతా, నేనే గనుక పతివ్రతనైతే...అబ్బజబ్బదబ్బ అంటూ తెగ నవ్వించేంది. వీటితో పాటు విస్సాటివిలో స్వయంగా ఆమే రూపొందించిన ఒక పొలిటికల్ సెటైర్ కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకునేది. ప్రతి ఎపిసోడ్‌కి డిఫరెంట్ గెటప్స్‌తో యాంకరింగ్ చేయడం ఆ కార్యక్రమం ప్రత్యేకత. ఇప్పటి జబర్దస్త్ లాంటి ప్రొగ్రామ్స్ ఆమె ఇరవైఏళ్ల క్రితమే చేసింది కూడా..ఐతే ఇదంతా గతం..ఇప్పుడు శ్రీలక్ష్మి అంటే టీవీ సీరియళ్లలో అడపాదడపా కన్పించే నటి మాత్రమే. ఆమెకన్నా జూనియర్ హాస్యనటులు కూడా ఆమెని లెక్కచేయడం లేదట. మద్రాసులో ఉన్నప్పుడే తమని పట్టించుకునేవారని.. ఇండస్ట్రీ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిన తర్వాతే తమకి ఇలాంటి దుస్థితి పట్టిందని శ్రీలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పబ్లిసిటీకి దూరంగా ఉఁడే శ్రీలక్ష్మి తత్వం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు..ఐతే చాలాసార్లు ఈ విషయంపై తెలుగు సినీ పరిశ్రమపెద్దలకు చెప్పినా పట్టించుకోలేదని శ్రీలక్ష్మి చాలా ఇఁటర్వ్యూల్లో చెప్పారు.. కొన్నేళ్ల క్రితం శ్రీలక్ష్మి, మరో నటి అన్నపూర్ణతో కలిసి యూసఫ్ గూడలో షాపింగ్‌కి వెళ్లి వస్తుంటే ఓ దొంగ వాళ్ల మెడల్లోని బంగారం దొంగిలించుకుపోయాడు. ఈ సంఘటన తర్వాత శ్రీలక్ష్మీ ఆర్ధికస్థితి గురించి తెలియజేసింది.అప్పటిదాకా ఆమె ఏదో కోట్లు వెనకేసి ఉంటుందన్న భ్రమలో ఉన్న తెలుగు ప్రేక్షకులుకు మధ్యతరగతి జీవితం గడుపుతున్న వైనం తెలిసింది. ఐతే శ్రీలక్ష్మి కూతుళ్లు కూడా టివిరంగంలో రాణిస్తున్నారని చెప్తారు.ఐతే ఆమెకి అసలు పెళ్లి కాలేదనే వాళ్లూ ఉన్నారు..ఐతే ఇన్నేళ్ల కెరీర్లో ఆమె ఎక్కడా తన కుటుంబం గురించి బైటికి తెలియనీయకపోవడం గమనించాలి. అందుకే ఈమె కుటుంబసభ్యుల గురించి కూడా బైటికి పెద్దగా తెలీకుండా పోయింది. అసలు శ్రీలక్ష్మి కెరీర్ బిగినింగ్ లో ఎలా ఉందో..ఇప్పటికీ అలానే ఉండటం విశేషం. అందుకే శ్రీలక్ష్మి వయస్సు ఎంతనేది కూడా మనం ఊహించలేం. అంత టాలెంట్ ఉన్న శ్రీలక్ష్మిని ఇప్పటి దర్శకులు గుర్తించకపోవడం తెలుగు చిత్రాలకే లోటు తప్ప ఆమె ఘనత ఏమీ తగ్గదని ప్రేక్షకులు అంటున్నారు.

Comments