కిరణ్ బేడీని ఏపీకి పంపుతున్నారా..నిజమేనా..అసలేంటి ఆమె స్పెషాల్టీ




బాబు బెండు తీసే గవర్నర్‌ని పంపుతున్నారనే వాదనలో నిజమెంత..కిరణ్ బేడీ లైఫ్ హిస్టరీ చూస్తే ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పని చేసేందుకు కిరణ్ బేడీని గవర్నర్‌గా పంపుతున్నారనే వార్త హడావుడి చేస్తోంది. ఇంతకీ కిరణ్ బేడీ ప్రత్యేకతలు ఏంటి..ఆమెనే ఎందుకు పంపాలనుకుంటున్నారో ఓ సారి చూద్దాం. స్ట్రాంగ్ పోలీస్ అంటే ముందుగా గుర్తొచ్చేది కిరణ్ బేడీనే..అసలు ఓ లేడీ ఐపిఎస్ కావడమనేది ఆమెతోనే మొదలైంది.


68 ఏళ్ల కిరణ్ బేడీ అమృత్‌సర్‌లో పుట్టింది. ఆమె భర్త బ్రిజ్ బేడీ ఈయన 2016లో చనిపోయారు. పెషావర్ నుంచి అమృత్‌సర్‌కు తాతలకాలంలో కిరణ్ బేడీ కుటుంబం  వలస వచ్చింది. సిక్కు మతంలో పుట్టినా హిందూ సంప్రదాయంలో పెరిగిన కిరణ్ బేడీ చిన్ననాడు బాగా సిగ్గరి. సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ అనే క్రిస్టియన్ స్కూల్లో ఆమె విద్యాభ్యాసం తన ముగ్గురు తోబుట్టువులతో సాగింది. మొదట్లో ఇందుకు ఆమె తాతగారు మునీలాల్ ఒప్పుకోకపోయినా..ఆ తర్వాత స్కూల్‌లోని విధానాలు నచ్చి కంటిన్యూచేశారట. అక్కడే ఆ స్కూల్లో చదువుతుండగానే కిరణ్ బేడీ లైఫ్ టర్నింగ్ అయిందని చెప్పుకోవాలి.



నేషనల్ కాడెట్ కార్ప్స్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవడంతో సమాజంపట్ల , సమస్యల పట్ల ఆమెకి అవగాహతో పాటు ఏదైనా చేయాలనే తపన కలిగిందని చెప్తారు. ఆ తర్వాత కేంబ్రిడ్జ్ కాలేజీలో సైన్స్ పాఠాలు నేర్చుకోవడం తటస్థించింది. 1968లో బీఏ ఆనర్స్‌లో పట్టా తీసుకున్న కిరణ్ బేడీ ఆ ఏడాదే నేషనల్ కాడెట్ ఆఫీసర్స్ అవార్డ్ సాధించింది. 1970లో పంజాబ్ నేషనల్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ తీసుకోగా, ఆ తర్వాత రెండేళ్లు.ఖల్సా కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు చెప్పిందామె. ఇదే ఆమె తొలి ఉద్యోగం. ఈ అనుభవమే ఆ తర్వాతికాలంలోనూ కిరణ్ బేడీ అప్పుడప్పుడూ వివిధ కళాశాలల్లో యువతకి పాఠాలు చెప్పడానికి ఉపయోగపడిందనుకోవచ్చు. ఐపిఎస్‌కి ఎన్నికైన తర్వాత కూడా...అంటే 1988లో లా కూడా కిరణ్ బేడీ పూర్తి చేయడం విశేషం. ఆటల విషయానికి వస్తే టెన్నిస్‌ అంటే విపరీతమైన ఇష్టం ప్రదర్శించే కిరణ్ బేడీ అందులో కనీసం ఏడు నేషనల్ టైటిల్స్ సాధించడం విశేషం. టెన్నిస్‌లో తన సాటి క్రీడాకారుడు రాజ్ బేడీని ఆమె పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది.







 1972 ముస్సోరిలోని ఐపిఎస్ ట్రైనింగ్ తీసుకున్న కిరణ్ బేడీ, ఆ బ్యాచ్‌ మొత్తంలో తొలి మహిళ కావడం విశేషం. ఐపిఎస్‌కి సెలక్టైన తర్వాత 6 నెలల ప్రొబేషన్ కోర్సు..9నెలల మౌంట్ అబులో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆమె ఆన్ డ్యూటీ ట్రైనింగ్  అరుణాచల్ ప్రదేశ్ గోవా మిజోరం కేంద్రపాలిత ప్రాంతంలో వేశారు. ఫస్ట్ పోస్టింగ్ మాత్రం దేశరాజధాని ఢిల్లీలో కావడం ఆమె జీవితంలో మరో టర్నింగ్ పాయింట్ గా చెప్పాలి. చాణక్యపురి సబ్‌డివిజన్‌లో 1975లో పోస్టింగ్ అవగా..అదే ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో మొత్తం కంటింజెంట్ పరేడ్‌ను లీడ్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. పోస్టింగ్ దక్కిన తొలి సంవత్సరంలోనే ఆమెకి సుకృతి అనే కుమార్తె జన్మించింది. కిరణ్ బేడీ పోస్టింగ్ తీసుకున్న చాణక్యపురి పార్లమెంట్ కి దగ్గర్లో ఉండటంతో బాగా రద్దీ ఏరియాగా మారింది. అక్కడక్కడే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతుండేవి..నిరంకారి, అకాలీ సిక్కుల మధ్య గొడవలూ ఎక్కువగా ఉండేవి. 1978లో ఇండియా గేట్ దగ్గర ఈ రెండు వర్గాల పెద్ద గొడవ జరగగా..కిరణ్ బేడీనే అక్కడ యాక్షన్ పార్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే ఓ దుండగుడు ఆమెపైకి పెద్ద కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించగా..కిరణ్ బేడీ ఓ చిన్న చెరుకు కర్రతో దాన్ని తిప్పి కొట్టాల్సి వచ్చింది. దాదాపు 700మంది ఆందోళనకారులను సమర్థవంతంగా తిప్పి పంపడంతో ఆ ఏడాది రాష్ట్రపతి సాహస పురస్కారం కిరణ్ బేడీని వరించింది. ఇక ఆ తర్వాత ఢిల్లీ పశ్చిమ నియోజకవర్గంలోనూ కిరణ్ బేడీ తన తెగువ చూపించింది










అక్రమ మద్యం వ్యాపారం సహా చాలా దొమ్మీలను నివారించడానికి బీట్ బాక్స్ సిస్టమ్ ప్రవేశపెట్టింది. ప్రతి ఏరియాలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయగా..అందులో ఎలాంటికంప్లైంట్లను ఆ ఏరియా బీట్ కానిస్టేబుల్స్ పరిష్కరించాలి. అలానే బీట్ కానిస్టేబుల్స్ ఆ బాక్స్ దగ్గరే లంచ్ చేయాలని విధిగా కండిషన్ పెట్టిందామె. అలానే స్వయంగా బీట్
కానిస్టేబుల్స్‌తో కలిసి వీధుల్లో తిరుగుతూ వారిలో జనంలో స్థైర్యం పెంచే ప్రయత్నం చేసింది. ఇవన్నీ కలిపి జనంలో ఆమెకి మంచి పేరు తెచ్చాయి. ఇక ఈవ్‌టీజర్లకు ఆమె  ఏరియాలో అల్లర్లకి దిగాలంటే ప్యాంట్ తడిచిపోయేది. అలాంటి కిరణ్ బేడీ 1981లో ఢిల్లీ ట్రాఫిక్ డిసిపిగా అప్పాయింట్ అయింది. ఇది ఆమె జీవితంలో అనేక మార్పులు తీసుకువచ్చింది ఏషియన్ గేమ్స్ జరిగిన సందర్భంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం స్పాట్ చలానాలు రాయించింది. ఈ సమయంలోనే ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఓ అంబాసిడర్ కారుకికూడా జరిమానా విధించారు. ఎక్కడైనా ట్రాఫిక్‌కి అడ్డంగా వాహనాలు నిలిపితే తొలగించడానికి 6 క్రేన్లతో కూడిన యూనిట్ ఒకటి వాడేవాళ్లు..అలా కిరణ్ బేడీకి క్రేన్ బేడీ అనే నిక్‌నేమ్ కూడా వచ్చింది. ట్రాఫిక్ మేనేజ్ చేసేందుకు అవసరమైన యంత్రాలకి ఖర్చు కావాలి కాబట్టి..అందుకోసం లోకల్ బిజినెస్ మెన్ తో ఏషియన్ గేమ్స్ కి స్పాన్సర్ షిప్స్ ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా ఆమే. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆమె అప్పటి సిబిఐ డైరక్టర్ వాహనాన్ని కూడా వదలకుండా జరిమానా విధించింది. ఇదే అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహారించే చాలామంది కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదు. ఆర్, కేధావన్, యశ్ పాల్ కపూర్ వంటి వాళ్లు ఆమెని గోవాకి ట్రాన్సఫర్ చేయించారని అంటారు.
అలా గోవాకి వెళ్లడానికి కిరణ్ బేడికి ఉన్న అభ్యంతరం..ఆమె కూతురు అప్పుడు అనారోగ్యంతో ఉంది..పాపని వదిలేసి వెళ్లలేని స్థితి. కనీసం కొన్నాళ్లు ట్రాన్స్‌ఫర్ వాయిదా వేయమన్నా కుదరకపోవడంతో పాపని ఢిల్లీలోనే వదిలేసి గోవాకి వెళ్లారు. అక్కడా ఆమెకి వేధింపులు తప్పలేదు. పదేళ్ల కెరీర్లో ఎక్కడా సెలవు వాడని కిరణ్ బేడీ తన పాప అనారోగ్యం తిరగబెట్టడంతో ఢిల్లీ వెళ్లేందుకు గోవా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నా పట్టించుకోకుండా కక్షసాధింపుకి దిగారు. అప్పటి గోవా ముఖ్యమంత్రి ప్రతాప్ సింగ్ రాణే సెలవు ఇవ్వకుండా వేధించడంతో కిరణ్ బేడీ ఢిల్లీకి వెళ్లిపోయారు. అప్పుడు ఆమె ఎవరికీ ఎటువంటి సమాచారం లేకుండా పరార్ అయినట్లు ప్రచారం చేశారు. యునైటెడ్ నేషన్స్ ఆప్ ఇండియా అనే పత్రిక ఈ ఉదంతాన్ని విమర్శిస్తూ  పెద్ద కథనాన్ని రాసింది. ఆతర్వాత కిరణ్ బేడీ ఆర్నెల్లు ఎక్కడా పని చేయకుండా చేశారు ప్రభుత్వ పెద్దలు. ఎప్పుడైతే కిరణ్ బేడీ అప్పటి కేంద్రహోంమంత్రి కార్యదర్శి టిఎన్ చతుర్వేదిని కలిసిందో..అప్పుడే మళ్లీ ఆమెకి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఓ అప్రాధాన్య పోస్ట్‌కి బదిలీ చేశారు. 1986లో ఢిల్లీలో నార్కోటిక్స్ వింగ్‌లో జాయిన్ అయిన తర్వాత డ్రగ్స్‌కి వ్యతిరేకంగా పని చేయడమే కాకుండా..డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేశారు.  ఆ తర్వాత 1992లో తీహార్ జైలుకి జనరల్‌గా వెళ్లిందామె..అక్కడా అప్పుడు జైలు కెపాసిటీకి మించి అంటే..2500మంది పట్టే జైలులో 9వేలమంది వరకూ ఖైదీలు, విచారణ ఎదుర్కొంటున్న నిందితులతో కిటకిటలాడేది. అలాంటి చోట ఆమె కరడుగట్టిన నేరస్థులకు..విచారణ ఎదుర్కొంటున్న నిందితులు..సామాన్య జైలుశిక్ష అనుభవిస్తున్న వారికి మధ్య తేడాకోసం బ్యారెక్‌ల ఏర్పాటుకి కృషి చేసింది. దీంతో జైలులో ఉండే సమస్యలు దాదాపు తగ్గిపోయాయ్. వారికోసం మెడిటేషన్, ప్లంబింగ్, గార్డెనింగ్ వంటి ఇతర కార్యక్రమాల ఏర్పాటూ చేసిందామె.దీనికి ఎంత గుర్తింపు వచ్చిందో గిట్టని ఆఫీసర్ల ద్వారా అంత అడ్డంకులూ ఎదుర్కొన్నది..ఆమె చేసిన పనులకు రామన్ మెగసేసే అవార్డూ లభించింది. ఏకంగా బిల్ క్లింటన్ నేషనల్ ప్రేయర్ బ్రేక్ ఫాస్ట్ కోసం వాషింగ్టన్ డిసికి రావాల్సిందిగా ఇన్విటేషన్ పంపినా..దాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి మదన్ లాల ఖురానా అడ్డుకున్నారు. తిరిగి 1995లో క్లింటన్ రెండో ఆహ్వానం పంపారు. ఈ సారి కేంద్రంలోని రాజేష్ పైలట్ ప్రత్యేక అనుమతిపై ఆమెని అక్కడకి పంపారు. దీంతో మదన్ లాల్ ఖురానా మేం అంటే లెక్కలేనప్పుడు మా ప్రభుత్వానికి పని చేయాల్సిన అవసరం లేదంటూ రుసరుసలాడారు. ఆ తర్వాత చంఢీఘడ్‌కి ఐజిగా..యునైటెడ్ నేషన్స్ కి సివిలియన్  అడ్వైజర్‌గా పని చేసిన ఏకైక మహిళ కిరణ్ బేడీనే.. ఇంత సుదీర్ఘమైన కెరీర్ ఉన్న కిరణ్ బేడీ 2007లో ఐపిఎస్ పదవి నుంచి స్వచ్చందంగా విరమణ తీసుకున్నారు.

2015 జనవరిలో బిజెపిలో చేరి ఢిల్లీ ఎన్నికలకు బిజెపి తరపున ముఖ్యమంత్రి కాండిడేట్‌గా బరిలో దిగిందామె.  ఐతే
ఎన్నికలలో పరాజయం పాలవడంతో అనూహ్యామైన షాక్ తిన్నారు. మే 22 2016 నుంచి పుదుచ్చేరి అనబడి పాండిచేరి కి లెటినెంట్ గవర్నర్ గా పని చేస్తున్నారు..ఇక్కడా తనదైన శైలిలో పనిచేయడంతో అక్కడి ముఖ్యమంత్రికీ ఈమెకీ పొసగలేదు. ఇప్పుడు ఏపీకి వస్తున్నారనే సమాచారంతో పెద్ద కలకలం రేగుతోంది

Comments