చేతులు పట్టుకున్నదెవరు..కాళ్లు పట్టుకున్నదెవరు


అవిశ్వాస తీర్మానం సంగతి పక్కనబెట్టి..ఇప్పుడు టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరు ఏది పట్టుకున్నారంటూ వాదనకు దిగుతున్నాయ్. ఇందులొ ముందుగా తెలుగుదేశం పార్టీ ఎంపి సిఎం రమేష్..పార్లమెంట్ ముందు శొకండాలు పెట్టే ఆడొళ్లలాగా..రామ రామ ఇదేం ఖర్మ అంటూ...పెద్ద ఎత్తున కేకలు పెట్టేసరికి అక్కడున్న జర్నలిస్టులకు ముందు ఏం చేయాలొ అర్ధం కాలేదు. ఇంతకీ విషయం ఏంటయ్యా అంటే ఇవాళ రాజ్యసభ ప్రారంభంలొ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి మొడికి సాష్టాంగనమస్కారం చేశాడట..ఇది అందరి ముందే జరిగిందంట..మీడియా కెమెరాలూ ఉన్నాయంట..ఇదీ ఈయన ఆరొపణ. అసలు అవిశ్వాసతీర్మానం పెట్టి..ఇలా కాళ్లు మొక్కడం ఏంది..తెలుగొడి ఆత్మగవురవం ఏం కావాలంటూ లబలబలాడిపొయాడు..
దీనికి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా ధీటుగానే జవాబు ఇచ్చింది..అరుణ్ జైట్లీని సుజనాచవుదరి ఎఁదుు కలిశాడొ చెప్పాలంటూ తిరుగు ప్రశ్న వేశారు. రెండు పార్టీలు బానే తిట్టుకున్నాయ్ కానీ..ముందు సిఎం రమేష్ వాదన చూస్తే..
" ఠాట్ పట్టుకుంటే గిట్టుకుంటే మొడి కాళ్లు మేమే పట్టుకొవాలి మీరేంటి పట్టుకునేది అన్నట్లుగా మాట్లాడాడు. పైగా ఇదెంత ఘొరం అఁటాడాయన. అసలు విజయసాయిరెడ్డి ఉన్న ఊపులొ.." అవును నేను నా రాష్ట్రానికి హొదా ఇవ్వాలంటూ కాళ్లు మొక్కాను..ఏం చేస్తారు " అని గనుక అని ఉంటే..సిఎం రమేష్ ఏం చేసేవాడొ..అవ్వ అవ్వ ఎంత పనిచేశాడు విజయసాయిరెడ్డి అంటూ రంకెలు వేయడం తప్ప అందులొ అవుచిత్యం ఏమి కన్పిస్తుంది..అంటే విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని టిడిపి మిషన్ ప్రారంభించిందన్నమాట..సరే అలానే అనుకుందాం..పైకి అవిశ్వాసం లొపల విశ్వాసం లా ఉన్నారనే అనుకుందాం..కానీ రమేష్ చెప్తొన్నట్లుగా..అందరి ముందే విజయసాయిరెడ్డి కాళ్లు పట్టుకున్నాడుగా...అంటే ఇది బహిరంగంగానే జరిగింది కదా..పైగా మీడియా అఁతా ఉన్నా కూడా అలా చేశాడంటే..అందులొ దాచి పెట్టడానికి ఏం లేదనేగా..మరిక్కడ సిఎం రమేష్ కూపి లాగి..స్పైయింగ్ చేసి కనిపెట్టినదేంటి..అంతా తుస్..కానీ రేపొద్దున్న పేపర్లలొ మాత్రం పెద్ద హెడ్‌లైన్స్ వేయవచ్చు..కానీ విజయసాయిరెడ్డి ఒక లెటర్ రాశాడు కదా..రాజ్యసభకి మొత్తం పుటేజీ పంపమని..అంటే..అది జరగలేదనే ధీటైన జవాబు ఇచ్చినట్లేగా..ఐతే ఆ లెటర్‌ని కూడా పట్టుకుని మార్చి నెల ని 3 ని కాస్తా...8 గా దిద్ది..పేపర్లకి వెబ్ కి లీక్ చేసిన టిడిపి లీడర్లు అడ్డంగా బుక్కయ్యారు..కింద సబ్జెక్ట్ లైన్లొ మార్చి 27న జరిగిన సభ తాలుకు ఫుటేజీ బైటికి ఇవ్వాలని కొరాడు..అఁటే ఇంకేదైనా ఫుటే‌జీ ఎవరి దగ్గరైనా ఉఁటే వారు చట్టరీత్యా నేరం పాల్పడ్డట్లే..సొ అలా టిడిపి ఇరుక్కుపొయింది..మరి అరుణ్ జైట్లీని ఎవరు కలిశారు..ఎందుకు కలిశారు..ఆసంగతి మాత్రం అందరికి కనబడేలా కాకుండా రహస్యంగా ఎందుకు కలిశారు..దానిపై యనమల హెచ్చరికలు చేయడమేంటి..తప్పుడు సంకేతాలు ఇవ్వొద్దు ఈసారి జాగ్రత్త  అఁటూ  చంద్రబాబెందుకు సవరదీశారు..ఈ ప్రశ్నలకు మాత్రం టిడిపి దగ్గర జవాబు లేదు..

Comments