జగన్, చంద్రబాబు చేతులు కలిపితే..మోడీ ఏం చేస్తాడు..దారులేంటి




కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వేదికగా చంద్రబాబు, జగన్ ఒకే బాటలో నడుస్తున్నారు. ముందుగా ఇందులో జగన్ మోహన్ రెడ్డి..నో కాన్ఫిడెన్స్ మోషన్ మీరు పెట్టినా నే మద్దతిస్తా..నేను పెట్టినా మీరు మద్దతు ఇవ్వండి అంటూ పిలుపు ఇవ్వడమే కీలకం.ఇక అక్కడ్నుంచి వైఎస్సార్సీపీ ఎంపిలు ఎక్కడా తగ్గకుండా స్పీకర్ కార్యాలయానికి నోటీసు అందించడంతో ఓ అంకం పూర్తైంది. ఆ తర్వాత చంద్రబాబు కూడా అదే లైన్లో ముందుకు వెెళ్లడంతో ఈ ఇద్దరూ చేతులు కలిపినట్లైంది..ఈ రెండు పార్టీల నోటీసులలో ఎవరిది స్పీకర్ చర్చకు స్వీకరించినా ఇఁకొకరు మద్దతు ఇవ్వడం ఖాయం. దీంతో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అధికారపక్షం, ప్రతిపక్షం కలిసి ఒక అంశంపై పోరాడినట్లవుతోంది. అది కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపైనే కావడంతో జనరల్ ఆడియెన్స్  హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల కార్యకర్తలు ఎవరికి వారే క్రెడిట్ కోసం ఆరాటపడవచ్చు.. ఐతే  టిడిపి, వైఎస్సార్సీపీ
ఇస్తోన్న ఈ సంకేతం కేంద్రంలోని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్లే..ఎందుకంటే ఇప్పటిదాకా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రాంతీయపార్టీలు పోరాడిన దాఖలాలు ఈ మధ్యకాలంలో ఏపీలో లేవ్. టిడిపికి బిజెపి హైకమాండ్ కాకపోయినా..ఎన్డీఏలో భాగంగా ఉండటంతో అది కుదరలేదు. ఇప్పుడు  ఎన్డీఏ నుంచి కూడా బైటికి రావడంతో టిడిపికి స్వేఛ్చగా ప్రవర్తించే వీలు దక్కింది. మరోవైపు అసలు అవిశ్వాస తీర్మానంతో ఏమొస్తుంది ఎఁదుకు ఈ పనికిమాలిన ఆలోచన అన్న నోటితోనే చంద్రబాబునాయుడు స్వయంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టించిన, పెట్టే పరిస్థితిలోకి నెట్టిన క్రెడిట్ మాత్రం వైెఎస్సార్సీపీదే. ఇక ఇప్పుడు మోడీ ఏం చేయబోతున్నాడన్నదే కీలకంగా మారింది. ఎఁదుకంటే ఈ నోటీసులపై చర్చకు స్వీకరించినా..ఓటింగ్ జరిగినా బిజెపి ప్రభుత్వానికి వచ్చిన 
నష్టం ఏం లేదు. అనూహ్యంగా అవిశ్వాసానికి మద్దతు దొరికి ప్రభుత్వం పడిపోయినా...ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కనీసం ఆర్నెల్లు అందుకు గడువు కావాలి. అంటే 2018 సెప్టెంబర్ అవుతుంది. దాదాపుగా బిెజెపి ఈ సమయంలోనే ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉందంటారు. కాబట్టి ఏతావాతా బిజెపికి నష్టం లేదు. బిజెపి ముందున్న మరో మార్గం. ఇక్కడ స్పీకర్  ఈ నోటీసులను అబయన్స్‌లో ఉంచేసి సభని వాయిదా వేయవచ్చు.
ఇక అప్పుడు అవిశ్వాసమనే అంశం మరో ఆర్నెల్లవరకూ మూలనపడినట్లే..అప్పుడైనా చర్చకి స్వీకరించినా ముందు చెప్పుకున్న పరిస్థితే ఉత్పన్నమవుతుంది. అవిశ్వాస తీర్మానం వ్యవహారం తేలిన తర్వాత ఇక ఎంపిల రాజీనామాలంటూ వైెఎస్సార్సీపీ పొలిటికల్‌గా కూడా ప్రెజర్ పెంచే ప్రయత్నం చేస్తోంది..సాంకేతికంగా ఎలాంటి నష్టం ఉండదు కానీ..పొలిటికల్‌గా మాత్రం లాభం పొందేందుకు జగన్ పార్టీ ముందు ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక తప్పని స్థితిలో టిడిపి ఎంపిలు కూాడ రాజీనామా చేయాల్సి రావచ్చు. ఎఁదుకంటే పవన్ కల్యాణ్ దూకుడు పెంచాడు. మాటలతో బాబుని చీకాకు పెట్టించడంతో,. అసెంబ్లీలో కూడా చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడం చూడొచ్చు..అందుకే ఇప్పుడు అవిశ్వాసతీర్మానంపై ఒక రకంగా దేశం అంతా చర్చ జరుగుతుందనడంలో సందేహం లేదు

Comments