తిరిగి పుట్టడం నిషేధం..చైనాలొ వింత నిబంధన..అసలు పునర్జన్మ ఉందా


చైనా ప్రభుత్వం అసలు పునర్జన్మ ఎత్తేవారెవరైనా..తమ అనుమతి తీసుకోవాలంటూ ఒక ఆదేశం జారీ చేసింది. ఇది హాస్యాస్పదంగా అన్పించినా..బౌద్దులు మాత్రం దీనిపై విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు ప్రపంచం అంతా కూడా పునర్జన్మ, దేవుడు అనే అంశాలపై ఎప్పుడూ  రెండుగా చీలుతూనే ఉంటుంది. ఈ జన్మనే పట్టించుకోని వారుంటే..మరో జన్మ గురించి నమ్మకం ఎలా కలుగుతుందని హేతువాదుల ప్రశ్న..ఐతే ప్రతి అంశాన్ని
సైన్స్ చట్రంలో బిగించి..నిరూపించడం సాధ్యమయ్యేది కాదు. పంచన్ లామా, దలైలామాల పునర్జన్మలు సంభవిస్తుంటాయని గత 600 ఏళ్లుగా నమ్మతూనే ఉన్నారు
దీనికి సంబంధించి వారు అనుసరించే పద్దతులు కూడా ప్రత్యేకంగా ఉంటాయ్.  ప్రస్తుతం ఉన్న దలైలామా 14 జన్మగా భావిస్తారు. ఈయన్ని 1937లో తర్వాతి లామాగా మాంక్స్  గుర్తించారు. ఐతే  1989లో చనిపోయిన పంచన్‌లామా ఆ తర్వాతి కాలంలో ఓ బాలుడిగా జన్మించాడని అన్నారు. అప్పటికే ఆయన 11సార్లు  జన్మించాడని టిబెట్ సన్యాసులు నమ్ముతారు. పంచన్ లామా గా భావించిన ఓ పిల్లాడు అదృశ్యం కావడంతో ఈ వ్యవహారం బాగా రచ్చకెక్కింది. ఆ బాలుడిని గుర్తించడంలో సాయపడిన బౌధ్దసన్యాసులను కూడా జైల్లో వేసింది అక్కడి ప్రభుత్వం.ఈ పరిణామాల తర్వాత టిబెట్ బౌద్ద సన్యాసుల పాత్ర, ప్రాధాన్యత తగ్గించడంలో భాగంగానే చైనా ఈ నిబంధన తీసుకువచ్చిందంటారు. అసలు పునర్జన్మ ఉందా లేదా అనే అంశం ఎప్పటికీ ఎడతెగని అంశమే

...లామాని గుర్తించే తంతుకి ప్రధాన మార్గాలు..బటర్ ల్యాంప్ గిరగిర తిరిగే ఆధారంగా కొన్ని సంకేతాలు ఆధారంగా బౌధ్దసన్యాసులు పిల్లలను అన్వేషించేందుకు బయల్దేరుతారు. ఇప్పటిదలైలామాని 21నెలల వయసులో కనుగొన్నారు. దలైలామాకి ముందున్న లామా అలవాట్లని ఈయన కూడా ప్రదర్శించాడని చెప్పారు. రింపోచీ ఎలా ఎడమచేతితో తన జపమాలను పట్టుకునేవాడో అలానే ఆ బాలుడు కూడా చేశాడట. తన ముందున్న జపమాలల్లో ఖచ్చితంగా అంతకి ముందు రింపోచీ ఏ జపమాలని వాడేవారో అదే పట్టుకున్నాడట. అందులో ఉన్న బీడ్స్‌లో ఇరవైఐదింటినే లెక్కపెట్టాడట
అసలు మన దేశంలోనూ ఇలానే తిరిగి జన్మించామనే వ్యక్తులు ఉన్నారు. వారికి ఇలా జన్మించామనే వాదన నమ్మడానికి పునర్జన్మలపై రీసెర్చ్ చేసిన డా. ఇయాన్ స్టీవెన్‌సన్ కొన్ని ఆధారాలు చెప్తారు
తిరిగి పుట్టానని చెప్తున్న వ్యక్తి..గతజన్మలోని ప్రదేశాలు..సంఘటనలు గురించి స్పష్టంగా చెప్పడం అప్పటి జన్మలోని వ్యక్తులతో పరిచయం..వారితో ఉన్న అనుబంధం, సంబంధం, వారితో మాత్రమే తెలిసి ఉన్న వ్యక్తిగత విషయాలు చెప్పడం వంటి అంశాలు ఉంటాయని స్టీవెన్ సన్ చెప్తారు. అలానే చిన్నవయసుస్లోనే అసాధారణ ప్రవర్తన కూడా ఇలాంటి అంశాలకు ఆధారభూతం అవుతాయ్. గత జన్మలో కొన్ని విషయాలు వస్తువుల పట్ల భయం, ఇష్టం కలిగి ఉండటం..అవే వాసనలు ఈ జన్మలోనూ అబ్బడం కూడా ఆధారాలుగా తీసుకోవచ్చని స్టీవెన్ సన్ చెప్పారు. గతంలో ప్రస్తుత వ్యక్తులకెప్పుడూ పరిచయం లేని ప్రదేశాలను గుర్తు పట్టడం అక్కడ దాచి ఉంచిన వస్తువులను ఇప్పుడు వెలికి తీయడం పునర్జన్మకి తిరుగులేని ఆధారంగా చెప్పొచ్చు. ఇవే కాకుండా గత జన్మలో సంబంధం ఉన్న వ్యక్తులతో కలిసి మాట్లాడటం ద్వారా ఇప్పటి ఈ వ్యక్తి చెప్తున్న అఁశాలు నిజమా కాదా అనేది కూడా గుర్తించవచ్చని డాక్టర్ చెప్పారు.



ఉదాహరణకు సుమిత్ర అనే మహిళ తాను సుమిత్ర కాదని..శివ  అనే మహిళను అని మాట్లాడటం జరిగింది. తన గత జన్మలోని తండ్రిని గుర్తుపట్టింది. తల్లిని గుర్తింస్తుందో లేదో అనే విషయం తెలుసుకోవడానికి వేరే గదిలో ఉండి..ఇతర కుటుంబసభ్యుల్లో గుర్తించమని అడగగా..తల్లి ఇక్కడ లేదని..వేరేగదిలోకి వెళ్లి గుర్తించిందట..నిజానికి సుమిత్ర చెప్పిన శివ అనే మహిళ తన భర్త చేతిలో హత్యకి గురైందట. కట్నం కోసం ఈ హత్య జరగగా..ఆత్మహత్యగా అప్పట్లో చిత్రీకరించారు. సుమిత్ర తన జ్ఞాపకాలు గుర్తొచ్చిన తర్వాత ఇక తిరిగి గత జన్మలో ఎలా బతికిందో అలానే ప్రవర్తించడం ప్రారంభించిందట..ఇలాంటి సంఘటనలు పునర్జన్మఅనేది ఉందని చెప్పడానికి నిదర్శనాలంటారు. ఐతే ఈ నమ్మకాలు, అనుభవాలతో సంబంధం లేకుండా...తిరిగి జన్మించడానికి పర్మిషన్ కావాలనడమే..అన్నింటికన్నా అసలు మూర్ఖత్వం అనడంలో సందేహం లేదు

Comments

  1. బ్రతికి ఉండటానికి అక్కడ ఎలాగూ ప్రభుత్వం వారి అనుమతి కావాలి కదా!

    ReplyDelete
    Replies
    1. సారీ..నేను హెడ్డింగ్ పెట్టడంలొ కాస్త పొరబాటు పడ్డా...నిషేధం కాదు..అనుమతి కావాలట..పాత విషయమే కానీ..రాత్రి సుమ క్యాష్ ప్రొగ్రామ్‌ల ఒ ప్రశ్న అడగడంతొ ఈ విషయంపై ఆసక్తి పుట్టి రాయాలనిపించి వ్రాసా..

      Delete

Post a Comment