సెల్‌ఫోన్‌ క్లిక్‌తోనే ఇన్‌స్టంట్ లోన్ సాధ్యమేనా..చూడండి ఈ సంగతి


వాలెట్ కంపెనీల్లో మొబిక్విక్ ఇప్పుడు సంచలనానికి తెరతీయనుంది. మిగిలిన వాలెట్లు పేమెంట్ బ్యాంకులుగా రూపొందుతుంటే, మొబిక్విక్ మాత్రం ఋణాలు కూడా ఇవ్వనుంది. అంటే ఒక్క మొబైల్‌తోనే కాలు కదపకుండా లోన్ తీసుకోవచ్చన్నమాట. ఈ ఫీచర్ ఒక్క నెలరోజుల్లోనే యాడ్ చేయబోతోంది.  ఇన్‌స్టంట్ క్రెడిట్ ప్రొడక్ట్  ఇలా ఒక యాప్ ఇవ్వడం తొలిసారి కావచ్చని అంచనా న్యూ టు క్రెడిట్(ఎన్‌టిసి) కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని కొత్త సదుపాయాన్ని  జోడిస్తున్నట్లు కంపెనీ కో ఫౌండర్ ఉపాసన టాకు చెప్తున్నారు.

మోబిక్విక్ దేశంలోనే రెండో అతి పెద్ద మొబైల్ వాలెట్ కంపెనీ. కొత్త ఫీచర్ ద్వారా చిన్న మొత్తాల నుంచి, భారీ మొత్తం వరకూ అప్పు మంజూరు చేస్తామని మొబిక్విక్ చెప్తోంది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే..ఇంతవరకూ ఏ లోనూ తీసుకోని కస్టమర్‌కి కూడా మొబిక్విక్ రుణం ఇస్తుంది. సాధారణంగా ఇటువంటి కస్టమర్లకి మిగిలిన బ్యాంకులు అప్పులు ఇవ్వడం కష్టసాధ్యం. క్రెడిట్ స్కోర్ వారికి ఉండదు కాబట్టి..ఈ దిశగా ఆలోచించవు కూడా..ఐతే న్యూ టు క్రెడిట్ కస్టమర్లకి తాము అప్పు ఇచ్చే ప్రక్రియ సులభంగా ఇస్తామని చెప్తోంది. అది కూడా అప్పటికప్పుడే ఋణం మంజూరు చేస్తుందటఈ ప్రక్రియ ప్రారంభించేందుకు మోబిక్విక్ ఇప్పటికే సహా రెండు మూడు బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలతో చర్చలు జరుపుతోంది. ఐతే మోబిక్విక్ కూడా తన వినియోగదారులను మోబీస్కోర్ అనే విధానం ఆధారంగా రుణాలను మంజూరు చేస్తుంది. దానికి 400 అంశాలు ప్రాతిపదికగా
తీసుకుంటుంది.
"గత 9నెలలుగా ఇందుకోసం కస్టమర్లు, వ్యాపారుల అవసరాలను తెలుసుకుంటున్నాం, కేవలం ఆర్ధిక పరమైన సేవలే కాకుండా..ఇతర ఆర్ధిక ఉత్పత్తుల పంపిణీలో కూడా బోలెడంత అవకాశాలు గమనించాం" అని చెప్పారు ఉపాసనా టాకు. అందుకు అనుగుణంగానే మ్యూచువల్ ఫండ్ల అమ్మకం కూడా చేస్తామని చెప్తున్నారామె.

మోబిక్విక్ రానున్న కాలంలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో కూడా భాగస్వామ్యం కోసం ప్రణాళికలు సిధ్దం చేసుకుంటోంది. బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బిఎస్ఎన్ఎల్ వంటి సంస్థలతో ఇప్పటికే ఈ యాప్ బేస్డ్ వాలెట్‌కు ఒప్పందం ఉంది. kyc నిబంధన విధించడం తమకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తోంది. ఎంతమంది కస్టమర్లు ఉన్నారనే కంటే..ఎంతమంది లావాదేవీలు చేసుకునేందుకు అర్హత సాధించారనేది ముఖ్యంగా మొబిక్విక్ చెప్తోంది. ఐతే సుప్రీంకోర్టు ఇచ్చిన సడలింపు తమకి వర్తించదని..కేవలం బ్యాంకులకు మాత్రమే ఆధార్ సీడింగ్ వాయిదా సడలింపు దక్కుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం పేమెంట్ యాప్స్‌కి కస్టమర్ల వివరాలతో పాటు, ఆధార్ కార్డు అనుసంధానం చేయకపోతే సర్వీసులు పని చేయడం లేదు. దీంతో చాలామంది కస్టమర్లు పేమెంట్ యాప్స్ వాడకం మానేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆధార్ లింకేజీ ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. ఎప్పుడో ఆధార్ కార్డులో పొందుపరిచిన ఫోన్ నంబర్ ఇప్పుడు పని చేయకపోవడం. లేదంటే మనుగడలో లేకపోవడం వంటి కారణాలతో లింకు చేసే ప్రక్రియలో ముఖ్యమైన OTP-వన్ టైమ్ పాస్‌వర్డ్ వినియోగదారులకు చేరడం లేదు. దీంతో అనుసంధానప్రక్రియ అసంపూర్తిగా నిలిచిపోతుంది. దీంతో నిజంగా ఆధార్ లింకేజీ కుదరక పేమెంట్ వాలెట్లకు కస్టమర్లు దూరం అవుతున్నారు. వీటి సంగతి ఎలా ఉన్నా..పదివేల రూపాయల లోన్ కోసం కూడా పది డాక్యుమెంట్లు తీసుకుని నెలరోజులు తిప్పించుకునే బ్యాంకులకంటే..అతి తక్కువ సమయంలోనే ఇలా మొబైల్ క్లిక్‌తోనే లోన్ ఇవ్వగలిగితే అదో శుభపరిణామంగానే చెప్పాలి.

Comments