ఇందుకూ కేసీఆర్ అంటే ఏపీజనం ఇష్టపడుతుంది..జగన్‌తొ కలిసి నడుస్తాడా


గత కొన్ని రొజులుగా టిఆర్ఎస్ పార్టీ తీరుల ొ చాలా మార్పులు వచ్చాయ్. క్లియర్‌గా చెప్తొన్న మాటలు..కుండబద్దలు కొడుతూ ఏపీ జనం వాదన వేదనకి మద్దతిస్తొన్న తీరుతొ రానున్న రొజుల్లొ ఆంధ్రప్రదేశ్‌లొ కూడా పొటీ చేస్తుందా అన్నంతగా పార్లమెంట్‌లొ ఏపి ఎంపిల వాదనకు మద్దతు పలుకుతున్నారు టిఆర్ఎస్ ఎంపిలు..ఇప్పుడు ఇవాళ సిఎం కేసీఆర్ స్ట్రైట్ గా ఒకటే మాట అడిగారు.." ఏపీకి ప్రత్యేక హొదా ఇస్తామన్నారు ఇస్తావా..ఇవ్వవా..చెప్పు " అంటూ సూటిగా ప్రధానమంత్రి మొడీని అడిగిన తీరు చప్పట్లు కొట్టించేలా ఉఁది.

అంతకు ముందు కూడా సిఎం కేసీఆర్ అమరావతి నిర్మాణానికి తాను ఎలా కొద్ది సాయమైనా ప్రకటించాలని అనుకుందీ..దానికి మొడీ మట్టీ నీళ్లూ తీసుకురావడంతొ..ఎలా గప్‌చిప్ అయిందీ కూడా చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలొ అధికారంలొ ఉన్న పార్టీకి  అడిగే దమ్ము లేకుండా పొయింది..అడిగేవాళ్లని ఎగతాళి చేయడం మామూలైపొయిన తరుణంలొ కేసీఆర్ ఇలా నేరుగా నిలదీయడం..దేశంలొ మరొ ఫ్రంట్ ఏర్పాటు దిశగా సంకేతాలు ఇవ్వడం రానున్న కాలంలొ కొత్త పొత్తులకు తెరతీసే అవకాశాలు కన్పిస్తున్నాయ్. అందులొనూ మొదటి నుంచీ ( తెలంగాణ ఏర్పడిన తర్వాత) వైఎస్ జగన్‌కి సానుకూలంగా మాట్లాడుతున్న కేసీఆర్..ఖచ్చితంగా అటు పార్లమెంట్‌లొ కానీ..2019 ఎన్నికల సమయంలొ కానీ వైఎస్సార్సీపీతొ దొస్తీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయ్

Comments