రాజశేఖరా...నీకు మోజు తీరలేదురా


తన ముఫ్పై ఏళ్ల కెరీర్లో హిట్లు..సూపర్ హిట్లు కొట్టిన రాజశేఖర్ ఇప్పుడు కొత్త కోణం చూపించేందుకు సిధ్దమయ్యారు. గత కొద్దికాలంగా ఫ్లాపులు ఎదుర్కొని దాదాపు తెరమరుగు అయిన రాజశేఖర్..గరుడవేగాతో మళ్లీ ప్రేక్షకులని అలరించారు. ఇదే ఊపులో మరిన్ని సినిమాలు చేస్తారని అంతా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఐతే ఆఫర్లు మాత్రం ఆస్థాయిలో రాలేదు..ఇంతలోనే రాజమౌళి డైరక్షన్లో విలన్‌గా నటిస్తున్నాడనే సమాచారంతో ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. అసలు రాజశేఖర్ సినిమాఎంట్రీనే తమాషాగా జరిగింది. తమిళనాడులో పుట్టి డాక్టర్ కోర్సు కూడా పూర్తి చేసారు రాజశేఖర్..సి వరదరాజన్ ఆయన తండ్రి..ఆయనో పోలీస్ ఆఫీసర్..అందుకనో ఏమో కానీ..
తన కెరీర్లో యాంగ్రీ యంగ్ మేన్ ఇమేజ్ తెచ్చిపెట్టిన పోలీస్ క్యారెక్టర్లలో రాజశేఖర్ ఇమిడిపోయేవాడు. 1984లో పుదుమై పెన్ తో ఆరంగ్రేటం చేసిన రాజశేఖర్ ..1985లో పుదియతీర్పుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..ఇదే సినిమా మనకి విస్సా ఛానల్ లో ఇదే నా తీర్పు పేరుతో అప్పుడప్పుడూ ప్రదర్శితమవుతుంటుంది చూడొచ్చు.
మద్రాసులో తెలుగు చిత్రపరిశ్రమ ఉన్న రోజుల్లో టీ.కృష్ణ ఆ సినిమా చూడటం తన ప్రతిఘటన, వందేమాతరం కి వరసగా బుక్ చేయడంతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజశేఖర్..ఆ తర్వాత ఇక వెనుదిరిగి చూసుకోలేదు రాజశేఖర్. ఈ ప్రశ్నకి బదులేది, దొరబిడ్డ చల్లని రామయ్య చక్కని సీతమ్మ వంటి
సినిమాలతో కుటుంబకథాచిత్రాలను ఇస్టపడే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అప్పుడే ఎంఎస్ రెడ్డి తీసిన తలంబ్రాలు సినిమా ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చింది అందులో మేకవన్నెపులిలా చేసిన అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కొంతమంది ఆ సినిమా తర్వాత రాజశేఖర్‌ని ఎక్కడ చూసినా తిట్టి పోసేవాళ్లంటే
ఎంతగా ప్రతినాయకపాత్రలో ఒదిగిపోయాడో అర్ధం చేసుకోవచ్చు. ఆ తర్వాత అటు టి. కృష్ణ సినిమాలతో పాటు ఇటు కోడిరామకృష్ణ సినిమాల్లో తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చాడు అప్పటి కుర్రాళ్లు సాయి కుమార్ గొంతుతో వీరావేశంతో ఊగిపోయే రాజశేఖర్ స్టైల్‌ని తెగ అనుకరించేవారు. అరుణ కిరణం, రేపటిపౌరులు, ప్రజాస్వామ్యం వంటి సినిమాల్లో హీరోగా..కాశ్మోరా, మిస్టర్ భరత్, అమెరికా అబ్బాయి వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలతో గుర్తింపు పెంచుకున్నారు. అలానే 1987లో కె విశ్వనాధ్ డైరక్షన్లో వచ్చిన శృతిలయలతో సాత్వికాభినయం కూడా చేయగలనని ప్రూవ్ చేసుకున్నారు. ఆహుతి, నవభారతం, మిస్టర్ హీరో సినిమాలు ఆయనకి యాక్షన్ స్టార్‌గా పేరు తెస్తే అంకుశంతో యాంగ్రీయంగ్ మేన్, పోలీస్ క్యారెక్టర్లకి సరైనోడుగా పేరు తెచ్చింది. అలా సాగుతున్న కెరీర్ మధ్యలోనే తన తలంబ్రాలు చిత్ర కథానాయిక జీవితతో ప్రేమలో పడ్డారు. కానీ ఇరుపక్షాల పెద్దలూ వారి వివాహానికి అంగీకరించలేదట. అలా సాగిన వారి ప్రేమ 1990లో మగాడు చిత్రసమయంలో రాజశేఖర్ ప్రమాదానికి గురవడంతో
ఓ కొలిక్కి వచ్చిందని చెప్తారు. జీవిత రాజశేఖర్ కి చేసిన సపర్యలు చూసి , రాజశేఖర్ పేరెంట్స్ వారి వివాహానికి ఒప్పుకున్నారట. అలా వారిద్దరూ ఒకటవగా..మొదట్లో రాజశేఖర్ తన సరసన జీవితను నటించడానికి  వద్దనేవారట..ఐతే జీవిత మాత్రం రాజశేఖర్‌నే రికమండ్ చేసేదట..ఈ విషయమే గరుడవేగా ప్రమోషన్లలో చెప్పేవారు రాజశేఖర్ అలా ఊపందుకున్న రాజశేఖర్ కెరీర్ 1990ల తర్వాత మరో టర్న్ తీసుకుంది..అహంకారి, బలరామకృష్ణులు, అక్కమొగుడు తర్వాత  అల్లరిప్రియుడుతో రొమాంటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నారు..ఐతే ఈ మధ్యకాలంలో దర్శకరత్న దాసరితో ఓ సినిమా సందర్భంలో విభేదాలు వచ్చాయ్. ఆ సినిమా పేరు నియంత
ముందుగా ఆ సినిమాలో హీరో రాజశేఖర్ అనే అనౌన్స్ చేశారు. కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. ఐతే రాజశేఖర్ షూటింగ్స్ కి లేటుగా రావడంతో దాసరి ఆగ్రహం చెంది  ఆ సినిమాలో వినోద్ కుమార్ ని హీరోగా పెట్టి పూర్తి చేసారు. ఐతే ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అహంకారి సినిమా ఫెయిలైంది. అందరూ అల్లరిప్రియుడిలో డ్యాన్సులు
రాజశేఖర్ ఇరగదీశాడని ప్రచారం చేశారు కానీ..దానికంటే ముందే వచ్చిన అహంకారిలో అంతకుమించిన నృత్యాలు ఉంటాయ్. ఈ సంగతి పక్కనబెడితే రాజశేఖర్ కి స్వయంగా తాను డాక్టరైనా కూడా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడేవారు. అంటే కాస్త ఇరిటేట్ అయినా వెంటనే బాత్ రూమ్ కి వెళ్లాల్సి వచ్చేదట..ఇది స్వయంగా ఆయనే చెప్పేవారు.  ఆ కారణాలతోనే రాజశేఖర్ తన సినిమాల షూటింగ్ కి లేట్ గా హాజరయ్యేవారట. ఈ వ్యాధికి మందు హోమియోలో ఉందని తెలిసిన తర్వాత తిరిగి షూటింగ్స్ కి సక్రమంగా రావడం ప్రారంభించారని ఆయనే చెప్పారు. అలా తన కెరీర్ ని తీర్చిదిద్దుకున్న రాజశేఖర్ కెరీర్లో వేటగాడు అనే సినిమా చేయడం ఘోరమైన తప్పిదం
హిందీలో బాజీగర్ కి ఇది రీమేక్..ఓ హీరోని నెగటివ్ గా చూపించడం ప్రేక్షకులకు నచ్చదని అప్పటిలో సాటి హీరో సుమన్ చెప్పినా వినకుండా ముందుకే పోయినందుకు ఆర్ధికంగా కెరీర్ పరంగా ఆ సినిమా తిరుగులేని దెబ్బ తీసింది. ఆ తర్వాత అడపా దడపా హిట్లు కొడుతూ కెరీర్ ని సిల్వర్ జూబ్లీ ఆడించారు రాజశేఖర్. కొత్త హీరోల రాకతో
వెనకబడిపోయి..చివరికి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. ముందునుంచీ తెలుగుదేశంతో అనుబంధం ఉన్నా..మధ్యలో కాంగ్రెస్..ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరి చివరికి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. ఈ క్రమంలోనే చిరంజీవితో కూడా ఢీ కొట్టారు. 2003 తర్వాత హిట్ట్ అనేది లేకుండా సినిమాలు తీసి ఆర్ధికంగా బాగా చితికిపోయారు.  హైదరాబాద్‌లో రాజశేఖర్ జీవితలకు నేచర్ వాల్డరఫ్ అనే స్కూల్ ఉంది. 2010లో ప్రారంభమైన ఈ స్కూల్ లాభాపేక్ష లేకుండా రన్ చేస్తున్నారంటారు. ఆలానే రాజశేఖర్ కి బ్యాంక్ అక్కౌంట్‌లో డబ్బనేది ఉండదట..సినిమాలు తీయడం
నటించడం తప్ప వేరే వ్యాపకాలు లేవంటారు. అలానే తెలుగులో హిట్టైన సినిమాలను తమిళంలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారట. అలానే ఇక్కడ హిట్టైన అంకుశాన్ని తమిళంలోకి డబ్ చేస్త్..అక్కడ నాగార్జున గీతాంజలి..శివని మించి సక్సెస్ సాధించాయట. ఇదే శివ కారణంగా అంకుశం రన్ తెలుగులో తగ్గించారని టాక్.. అలా సుదీర్ఘమైన కెరీర్ ఉన్న రాజశేఖర్  గరుడవేగాతో సక్సెస్ బాట పట్టారంటారు. ఇలా ఉఁడగానే తన కుమార్తె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి తీయబోయే సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించనున్నాడనే న్యూస్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 

Comments