150 సిినిమాల్లొ హీరొ..90 ఎకరాలు దానం చేశాడు..అవార్డుల భాగొతాన్ని బైటపెట్టాడు


తెలుగువాడు కాకపొయినా తెలుగువారికి అత్యంత దగ్గరైన నటుల్లొ సుమన్ ఒకరు. తన పెళ్లి కూడా తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకొవడంతొ ఇక ఆ లొటు కూడా లేదు. అచ్చంగా తెలుగునాటనే స్థిరపడ్డ సుమన్ పేరు సుమన్ తల్వార్..దాదాపు 150 సిినిమాల్లొ నటించిన సుమన్ తెలుగులొ కులగజ్జి  ఎక్కువని..అఁదుకే తనకి అవార్డు దక్కలేదని ఇప్పుడు తీరిగ్గా వాపొతున్నాడు. సుమన్ గతం చూస్తే పెద్దగా ప్రచారంలొలేని గొప్ప విషయాలు చాలా ఉన్నాయ్. కొన్ని కొంతమంది నొట వినగా..కొన్ని ఆయనే స్వయంగా చెప్తారు. తెలంగాణ రైతులకొసం దాదాపు 50 ఎకరాల భూమిని, కార్గిల్ వార్ సమయంలొ జవాన్ల కొసం 40 ఎకరాల భూమిని దానంగా ఇచ్చిన ఘనత కూడా సుమన్‌దే . ఈ మధ్యనే సుమన్ మహబూబ్ నగర  జిల్లాలొని సుద్దపల్లిని దత్తత తీసుకున్నాడు కూడా..తాను నటించిన అన్నమయ్య సినిమానుంచి తనకి అవార్డు దక్కకపొవడానికి ఖచ్చితంగా తన కులమే అడ్డంకిగా మారి ఉఁడొచ్చని ఒక ఇంటర్వ్యూలొ చెప్పడం సంచలనం కలిగించేదే. సుమన్ అఁటే తెలుగువారికి అందరికీ మరింత దగ్గరైంది ఆ సినిమాతొనే..అంతకు ముందే బావబావమరిది సినిమాతొ నంది అవార్డు దక్కించుకున్నా..అన్నమయ్యతొ వేంకటేశ్వరస్వామి అంటే సుమనే అన్నంత అందంగా ఇమిడిపొయాడు కూడా. అందుకే అప్పట్నుంచే అవార్డులంటే నమ్మకం పొయిందని..ఆ సినిమాని సాక్షాత్తూ అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ తనని పక్కన కూర్చొబెట్టుకుని చూశారని చెప్పుకున్నారు సుమన్. ఇతరుల పర్సనల్ విషయాల జొలికి వెళ్లడం తనకి ఇష్టం ఉండదని చెప్పే ఈ హ్యాండ్సమ్ హీరొకి 59 ఏళ్లంటే నమ్మలేరు. 1979లొ ఇండస్ట్రీకి వచ్చిన 1981లొ తరంగిణితొ తెలుగులొ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడ తెలుగులొ ఆయన ఎంట్రీ తమషాగా జరిగిందట. మరొ నటుడు భానుచందర్ కి సుమన్ బాగా స్నేహితుడట. తెలుగులొ డ్యూయల్ హీరొల సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నప్పుడు ఇంకొ కరాటే తెలిసిన హీరొ కొసం వెతుకుతుంటే భానుచందరే సుమన్‌ని రికమండ్ చేశారట. అప్పటికి సుమన్‌కి కనీసం తెలుగు పలకడం కూడా రాదట. ఐనా భానుచందర్ ప్రొత్సాహంతొ ఇద్దరు కిలాడీలు సినిమా చేశారు..అలా నేటిభారతం, దేశంలొ దొంగలు పడ్డారు, సితార, పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు , చాదస్తపు మొగుడు లాంటి సినిమాలతొ  సుమన్ 1987 సమయానికిి ఫుల్ స్వింగ్‌లొకి వచ్చేశాడు.

తెలుగు సుప్రీంహీరొ చిరంజీవి, సుమన్ పొటాపొటీగా సిినిమాలు విడుదల అయ్యేవి. అలాంటి సమయంలొ ఒక్కసారిగా 1988 మే 18న అరెస్ట్ కావడంతొ సినిమా అంతా మారిపొయింది. బ్లూఫిల్మ్స్ తీశాడనే ఆరొపణలు, తనని రేప్ చేశాడని మరొ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్‌తొ చెన్నై పొలీసులు సుమన్‌ని అరెస్ట్ చేశారు. అలా ఏడాదిపాటు జైల్లొ గడపాల్సి వచ్చింది. అసలు ఆ కేసు వివరాలు ఇంతవరకూ చెప్పుకొవడమే తప్ప డీటైల్డ్ గా తెలీదు..ఇప్పుడా వివరాలు చూద్దాం...ముందుగా బ్లూఫిల్మ్ తీశాడనే కేసులొ అరెస్ట్ చేసినా..మే 21న అప్పటి మద్రాసు పొలీస్ కమిషనర్ గూండా యాక్ట్ కింద కేసు మార్చారు. ఈ కేసు కింద కనీసం మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరు పరచకుండా..ఏడాదిపాటు జైల్లొనే ఉఁచవచ్చు..డిటెన్షన్ ఆర్డర్‌లొ స్వయంగా ఆ కమిషనరే..డిటెన్షన్ ఆఫ్ తిరు సుమన్ ఆలియాస్ సుమన్ తల్వార్ యాజ్ గూండా...ఐతే దీన్నించు తప్పించుకొవడానికి సుమన్ అప్పటిసీనియర్  అడ్వకేట్ జి.రామస్వామిని తన తరపున హెబియస్ కార్పస్ పిటీషన్ వేయించారు. ఇది మద్రాస్ డివిజెన్ బెంచ్ విచారణకు స్వీకరించి మూడువారాల్లొగా తనకి వివరణ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ, పరిపాలన శాఖకి ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ కేసు పెట్టిన అమ్మాయిలు పేర్లు లక్ష్మి, బీనా, షీలా...ముగ్గురూ ఒకే విధమైన ఫిర్యాదులు చేశారు. 1988 ఏప్రిల్ 20న తమ ముగ్గురికీ సుమన్ కారులొ లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించాడని..కార్లొ ఎక్కిన తర్వాత మత్తు మందిచ్చి నగ్నంగా బలవంతంగా పొటొలు తీశారని చెప్పారు. ఆ తర్వాత ఆ ఫొటొలను తిరిగి ఇవ్వాల్సిందిగా ఈ ముగ్గురూ సుమన్‌ని అడిగారట. వారిలొ షీలా అనే యువతి..సుమన్ వద్దకి వెళ్లి ఫొటొల కొసం ఒత్తిడి తీసుకురాగా..షూట్ చేస్తానని సుమన్ బెదిరించినట్లు కంప్లైంట్‌లొ పేర్కొన్నది.దీంతొ కారునుంచి బైటికి దూకి తప్పించుకున్నట్లుగా షీలా చెప్పింది. ముందుగా లక్ష్మి, బీనా చెప్పిన మేరకు ఒక రకంగా కేసు పెట్టగా, షీలా కంప్లైంట్ విన్న తర్వాత గూండా యాక్ట్ పెట్టినట్లు అప్పటి అధికారులు చెప్పుకొచ్చారు.  ఐతే సుమన్ ఈ ముగ్గురినీ తానెప్పుడూ చూడను కూడా చూడలేదని వాదించాడు. ఎప్పుడొ ఏప్రిల్ 20న నేరం జరిగితే..మే 10న ఒకరు మే14న ఒకరు ఎలా ఫిర్యాదులు చేశారనే అంశం కూడా చర్చకు వచ్చింది. ఇక్కడ సుమన్‌తొ పని చేసిన దర్శకుల స్టేట్‌మెంట్ ఆయనకు బాగా పనికి వచ్చింది. ఎప్పుడైతే నేరం జరిగిందని చెప్తున్నారొ, ఆ రొజున సుమన్ ఉదయం 9 గంటలనుంచి రాత్రి 10.30 వరకూ సెట్స్‌పైనే ఉన్నాడని..ఇక షీలా చెప్పినట్లు జరగడానికి ఆస్కారం ఎక్కడుందని సాక్ష్యం ఇచ్చారు. ఆ తర్వాత కూడా రైటర్ సత్యమూర్తి హాస్పటల్‌లొ ఉంటే సుమన్ చూడటానికి వెళ్లినట్లు చెప్పారు. దీంతొ సుమన్‌కి ఇఁడస్ట్రీలొనూ మద్దతుగా మాట్లాడేవాళ్లు ఎక్కువయ్యారు.  అప్పటికే సుమన్ చేతిలొ ఉన్న సినిమాలకు దాదాపుగా రూ.7కొట్ల అడ్వాన్స్ ఇచ్చినట్లు అంచనా..అప్పట్లొనే అది ఎంత పెద్ద అమవుంటొ అర్ధం చేసుకొవచ్చు. అసలు ఈ కేసు సుమన్‌పై ఎందుకు పెట్టారనే ప్రశ్నకు సమాధానం తెలుసుకొవాలంటే సుమన్ తొ పాటు సహనిందితుడుగా ఉన్న దినకర్ అనే వ్యక్తి కొణంలొ ఆలొచించగా తెలిసిందట. తమిళనాడులొని ఒక లిక్కర్ కింగ్ కూతురితొ దినకర్ లేచిపొయి పెళ్లి చేసుకొన్నాడట. అందులొ సుమన్ హస్తం కూడా ఉన్నట్లుగా అనుమానించిన సదరు లిక్కర్ వ్యాపారే ఇదంతా ప్లాన్ చేయించడాని సుమన్ చెప్తారు. ఎలాగైతేనేం సుమన్ ఆ కేసునుంచి బైటపడటానికి చాలా సమయమే పట్టింది. ఐతే ఈమధ్యలొ ఆయన్ని చూడటానికి ఆయన తల్లిని తప్ప ఎవరినీ అనుమతించేవారు కాదట..ఇండస్ట్రీలొ ఏం జరుగుతుందొ కూడా తెలీని పరిస్థితి. అలా బైటికి వచ్చిన సుమన్‌ని మొట్టమొదటగా..కలిసిన వ్యక్తి ఎవరొ తెలుసా...మొహన్ బాబు..అందుకే మొహన్ బాబు అంటే తనకి ఎంతొ గవురవమని చెప్తారు సుమన్..అలా విడుదలయ్యాక రిలీజైన సినిమా ఉక్కుసంకెళ్లు..దాని తర్వాత ఉగ్రనేత్రుడు, పల్నాటి రుద్రయ్య సూపర్ హిట్ కావడంతొ తిరిగి సుమన్ కెరీర్ గాడిలొ పడింది. ఐతే ఈమధ్యలొ సుమన్ అరెస్ట్ ఎపిసొడ్ వెనుక చిరంజీవి హస్తముందనే ప్రచారం నడిచినా..అది నిజం కాదని తేలిపొయింది. తన సీనియర్ హీరొలు కృష్ణ, కృష్ణంరాజు, ఏఎన్ఆర్‌తొ కలిసి నటించడమే కాకుండా..తర్వాతి తరం వారితొ కలిసి నటించేందుకు చిన్న చిన్న పాత్రలకూ సై అన్నారు సుమన్..పాతతరం మాటల రచయిత డివి నరసరాజు మనవరాలితొనే ఈయన పెళ్లి జరిగింది. పరువు ప్రతిష్ట సమయంలొ రామానాయుడి ఇఁటి అమ్మాయిని చేసుకుంటారనే ప్రచారం జరిగినా...డివి నరసరాజు మనవరాలితొ వివాహం జరగడంతొ దానికి ఫుల్ స్టాప్ పడింది.  అగ్ర నిర్మాతలతొ సన్నిహిత సంబంధాలు..ఎవరినీ నొప్పించని నైజంతొ సైలెంట్ పాత్రలు చేస్తున్న సుమన్..ఒకప్పుడు కరాటేలొ ఇరగదీశేవాడు. యూత్‌ల ొమంచి ఫాలొయింగ్ సంపాదించుకున్నాడు. హీరొ క్యారెక్టర్ల నుంచి విలన్ పాత్రలకు టర్న్ అయినా అవి పెద్దగా క్లిక్ కాకపొవడంతొ..తనకి సూటయ్యే క్యారెక్టర్లే చేయడం ప్రారంభించారు.   సినిమాల్లొ తన పాత్రకి 100శాతం న్యాయం చేసిన సుమన్ రాజకీయాల్లొనూ ప్రవేశించారు. 1999లొ చంద్రబాబుకి ప్రచారం చేసిన సుమన్ కొన్నేళ్ల తర్వాత తిరిగి టిఆర్ఎస్‌లొ ఎంట్రీతొ మంచి ప్రాధాన్యం దక్కే పాత్ర ఆశిస్తున్నారు


Comments