భరత్ అను నేను ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు బ్రేక్..మూడు రోజుల్లోపే 150కోట్లు ఖాయం


సూపర్ స్టార్ మహేష్ స్టామినా చూపిన సినిమా..భరత్ అను నేను..మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు కూడా
కోట్లకి కోట్లు కొల్లగొడితే..ఇక సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమా రేంజ్ ఏదంటే ఏం చెప్పగలం..దానికి అంతు ఉండదు
ఇప్పుడదే భరత్ అను నేను విషయంలో జరుగుతోంది. మొదటి రోజే 21.94కోట్లు కలెక్ట్ చేసిన భరత్ అను నేను
రంగస్థలాన్ని రెండున్నరకోట్ల మార్జిన్‌తో దాటేసింది. ఇక శని, ఆది వారాల్లో ఈ దూకుడు ఇంకా కొనసాగుతోంది. షేర్ రూపంలోనే ఈ మూడు రోజుల్లో 65కోట్లు కలెక్ట్ చేస్తోంది. ఇది ఒక్క తెలుగునాట ప్రదర్శించబడుతోన్న థియేటర్లలోనే మాత్రం కావడం గమనించాలి
దీనికి తోడు ఇక ఓవర్సీస్ లెక్కలు కనుక చూస్తే..150కోట్ల రూపాయలు సులభంగా భరత్ రామ్ కొల్లగొడతానేది అర్ధమవుతోంది. కానీ మొదటి రోజు ఓవరాల్ కలెక్షన్స్‌ని చూస్తే..50కోట్ల రూపాయలను సాధించి..బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.విదేశాలలో వన్ మిలియన్ డాలర్ కలెక్షన్‌ని అతి సులభంగా దాటేసింది.ఇదే ఊపు కంటిన్యూ అయితే..బాహుబలి తర్వాత తెలుగు సినిమాల్లో రికార్డు క్రియేట్ చేసిన సినేమాగా..భరత్ అను నేను నిలబడటం ఖాయం. తమిళనాడులో ఒక రోజులో ఇప్పటిదాకా పాతికలక్షల రూపాయలు కలెక్ట్
చేయడం రికార్డు అయితే దాన్ని బీట్ చేసి 27లక్షల కలెక్ట్ చేసింది భరత్ అను నేను..చెన్నైలో సింగిల్ థియేటర్‌లో భాషా..పెదరాయుడు హండ్రడ్ డేస్ రన్ లో కోటిరూపాయలు వసూలు చేయడం ఆ కాలంలో రికార్డు..మరిప్పుడు కాలం ఎలా గిర్రున తిరిగిందో చూడండి..కేవలం వారం రోజుల్లోనే ఆ డబ్బు రాబట్టే స్థాయికి కలెక్షన్లు చేరాయి
మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విజయం ఇదే కావడంతో వారంతా పండగ చేసుకుంటుంటే..సినిమా ఎక్కడా డ్రాప్ అవకుండా హండ్రడ్ డేస్ రన్ కనీసం 50 థియేటర్లలో ఉండేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..

Comments