24 సినిమాల్లో 6 సూపర్ హిట్లు..కెరీర్ డల్ అయినా డబ్బింగ్ చెప్పుకుంటుంటాడు


నటుడు వేణు గుర్తున్నాడు కదా..తొట్టెంపూడి వేణు అలియాస్ వేణు గురించి ఇప్పటిదాకా మీకు తెలియని అసలు సిసలు విషయాలు ఇప్పుడు తెలుసుకోండి. ఇది అల్లాటప్పాగా చెప్తోన్నవి కాదు. వికీ పీడియాలు, బ్లాగులు చదివి కూర్చినవి అసలే కాదు..వేణు మొదటి సినిమా భారతీరాజా నిర్మించారని చెప్తారు. ఐతే ధార్వాడ్ యూనివర్సిటీ కాలేజ్‌లో చదివిన ఇంజనీరింగ్ చదివిన వేణుది ప్రకాశం జిల్లా. బి.గోపాల్ మేనల్లుడైన వేణు ఈ సినిమాకంటే ముందే తెరపై కన్పించాడు. అది టి.సుబ్బరామిరెడ్డి తీసిన గ్యాంగ్ మాస్టర్ అనే సినిమా..ఇది హీందీ హిట్ సినిమా సర్ కి రీమేక్. ఇందులో హీరో రాజశేఖర్..హీరోయిన్ నగ్మా, వాణివిశ్వనాధ్, శుభశ్రీ , కృష్ణంరాజు, చరణ్ రాజ్ మిగిలిన నటులు. ఇందులోనే రాజశేఖర్ తమ్ముడు సెల్వ శేఖర్ కూడా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు కానీ సినిమా ఆట్టర్ ఫ్లాప్. అందులో రాజశేఖర్ స్టూడెంట్స్‌లో ఒకడిగా ఓ సీన్లో కన్పిస్తాడు వేణు.


ఆ తర్వాత కూడా బిగోపాల్ సినిమాల్లో కన్పించాడంటారు. ఐతే ఈలోపే అతని స్నేహితులు ఎస్పీ ఎంటర్టైన్ మెంట్స్ పేరుతో నిర్మాణరంగంలోకి ప్రవేశించి వేణుతో సినిమా తీశారని ప్రచారం ఉంది. ఐతే ఇది కూడా వాస్తవం కాదు..మాగంటి అంకినీడు అంటే వేణు తాతగారే..అంటే సొంతంగానే వేణుతో సిినిమాలు నిర్మించారన్నమాట. స్వయంవరం, చిరునవ్వుతో లాంటి సినిమాలతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న వేణుకి హనుమాన్  జంక్షన్ కామేడీ హీరోగా పేరు తెస్తే..పెళ్లాం ఊరెళ్తే కన్ఫామ్ చేసింది. కల్యాణ రాముడు మంచి పేరు తీసుకొచ్చింది. ఖుషీఖుషీగా, యమగోల మొదలైంది ఇతర హిట్ సినిమాలు కాగా..సోలో హీరోగా హిట్ సినిమా గోపి గోపిక గోదావరి..ఇక ఆ తర్వాత మనోడివన్నీ ఫ్లాప్ అవుతుంటే వేరే దారి లేక చిన్నా చితకా క్యారెక్టర్లు కూడా చేశాడు. బోయపాటి శ్రీనివాస్ దమ్ము కూడా ఫ్లాప్ అవడంతో ఇక దాదాపుగా తెర నుంచి దూరం అయ్యాడు. అడపాదడపా కన్పిస్తోన్న వేణు రామాచారి దెబ్బకి అయిపూ అజా లేకుండా పోవాల్సి వచ్చింది. ఐతే ఇక్కడే అందరూ వింటున్నా కూాడ..గుర్తించలేని విషయం ఒకటి ఉంది..వేణు హీరోగా చేస్తున్నప్పుడు డబ్బింగ్ కూాడ చెప్పేవాడు..అప్పట్లో చాలామంది వేణుకి ఎవరు డబ్బింగ్ చెప్తున్నారు..ఇదే గొంతు ఇతర హీరోలకు కూడా విన్పిస్తుంది అనుకునేవాళ్లు, కానీ విషయం ఏంటంటే..వేణునే వాళ్లకి డబ్బింగ్ చెప్పేవాడు. ఉదాహరణకు ప్రభుదేవాకి తొట్టి గ్యాంగ్, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, సుమన్‌కి వాన సినిమాల్లో వేణునే గొంతు అరువిచ్చాడు. అలా ఇప్పటికీ డబ్బింగ్ చెప్తూ సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరం కాకుండా గడుపుతున్నాడు. వేణుకి వ్యాపారాలతో పాటు డబ్బింగ్ థియేటర్ కూడా ఉందంటారు. ఇది నిజమో కాదో తెలీదు కానీ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఈయనకి ఓ ఫ్లాట్ ఉంది. అందులో అద్దెకున్నవాళ్లతో గొడవ అయి అప్పట్లో అది కేసు వరకూ కూడా వెళ్లింది. నానక్ రామ్‌గూడలో నివాసముండే వేణు ఇప్పటికీ ఎవరైనా మంచి పాత్ర ఇస్తే చేస్తానని అంటుంటాడు కూడా..కాబట్టి..వేణు తన వ్యాపారాల్లో బిజీగా ఉండి..సినిమాలకు దూరమయ్యాడనేది శుధ్ద అబద్దం

Comments